BigTV English

Belly Fat in Men: పురుషులకే పొట్ట ఎందుకు ఎక్కువగా పెరుగుతుందో తెలుసా?

Belly Fat in Men: పురుషులకే పొట్ట ఎందుకు ఎక్కువగా పెరుగుతుందో తెలుసా?

What causes belly fat in mens: మహిళల్లో ఎంత కొలెస్ట్రాల్ ఉన్నా వారిలో పొట్ట వచ్చే వారి సంఖ్య మాత్రం  చాలా తక్కువే. ఎందుకంటే స్త్రీ, పురుషనిర్మాణంలో కొన్ని తేడాలు ఉంటాయి. మహిళల్లో తొడలు, తుంటి , ఇంకా ఇతర భాగాలకు కొవ్వు నిల్వ చేసుకొనే సామర్థ్యం ఉంటుంది. ఆ ప్రదేశంలో కొవ్వు పదార్ధాలు చేరిపోయి ఖాళీ లేనప్పుడే పొట్ట దగ్గర చేరుతుంది. కానీ పురుషుల్లో అలా కాదు.. కేవలం పొట్ట భాగంలో మాత్రమే కొవ్వు నిల్వలు ఉండటానికి ఛాన్స్  ఉంది. అందుకే  మగవారికి ఎక్కువగా  పొట్ట వస్తుంది.


పొట్ట పెరగడానికి మరికొన్ని కారణాలు.. చాలా మందికి చిన్న వయసులేనే పొట్ట పెరుగుతూ ఉంటుంది. మరికొంతమందికి వయసుపెరిగే కొద్ది పొట్ట పెద్దదిగా అవుతుంది. ఇలా పొట్ట ఎందుకు పెరుగుతుందో తెలియక తిండి మానేసి డైటింగ్ లు చేస్తుంటారు. నిజానికి పొట్ట ఎందుకు పెరుగుతుందో చూద్దాం.. సాధారణంగా పొట్ట పెద్దదిగా ఉంటే విటమిన్ డి లోపం ఉన్నట్లే అని వైధ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమే కాకుండా కొన్ని రకాల చెడు అలవాట్లు కూడా శరీర బరువు పెరగాడానికి కారణం అవుతాయి. కొన్ని అలవాట్లు శరీర బరువు పెంచి నడుముచుట్టు కొవ్వు పదార్ధాలు పేరుకుపోయేలా చేస్తాయి. మరి అలాంటి చెడ్డ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.

రాత్రి ఆలస్యంగా తినడం వల్ల నిద్రపోయిన సమయంలో మన శరీరంలో క్రొవ్వు పదార్ధాలు వినియోగించబడతాయి. రాత్రి సమయంలో ఆలస్యంగా తినడం వల్ల ఈ ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడతాయి. యాసిడ్స్ ఎక్కువగా విడుదలయ్యి అజీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఇక అల్పాహారం తినకపోవడం వల్ల కూడా పొట్ట పెరుగుతుంది. మన శరీరానికి అల్పాహారం చాలా ముఖ్యం. అల్పాహారం మరిచినట్లైతే మధ్యాహ్న భోజనంలో ఆహారం ఎక్కువగా తీసుకొనే అవకాశం ఉంది. ఫలితంగా శరీరంలో క్రొవ్వు పధార్ధాలు అధికమై పొట్ట చుట్టు పేరుకుపోయే అవకాశం ఉంది. ఎప్పటి ఆహారాన్ని అప్పుడే వండుకుని తినడానికి ప్రయత్నించాలి.


Also Read: జుట్టు ఎక్కువగా రాలి బట్టతల వస్తుందా? ఈ జాగ్రత్తలు పాటించండి!

ఇక ఆల్కాహాల్ అలవాటు కూడా పొట్ట పెరగడానికి అవకాశం ఉంది. ఆల్కాహాల్ నుండి శరీరంలో అధిక మొత్తంలోకేలరీలు అందించబడి క్రొవ్వు పదార్ధాలు పేరుకుపోయి శరీరబరువును పెంచుతాయి. అందువల్ల తగిన స్థాయిలో మాత్రమే తాగడం మంచిది. మానేస్తే మరీ ఆరోగ్యంగా ఉంటారు. ఇక భావోద్వేగాలకు కూడా పొట్ట పెరగడానికి కారణం అవుతాయి. అవును భావోధ్వేగాల సమయంలో బాధలు, సంతోషం, కోపానికి గురవుతాం.. ఆ సమయంలో ఎక్కువగా ఆహారంతీసుకొనే ఛాన్స్ ఉంది.

 

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×