BigTV English

Panchabhakshya Paramannalu: పంచభక్ష పరమాన్నాలు అంటే ఏమిటి.. అందులో ఏమేమీ ఉంటాయో తెలుసా?

Panchabhakshya Paramannalu: పంచభక్ష పరమాన్నాలు అంటే ఏమిటి.. అందులో ఏమేమీ ఉంటాయో తెలుసా?

Panchabhakshya Paramannalu: ఏ శుభకార్యమైనా తరచుగా ఓ పదం వినిపిస్తూ ఉంటుంది. ఆనాటి రోజుల్లో అయితే ఆ పదం మరీ ఎక్కువగా వినిపించేది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ప్రస్తుతం పాత పద్ధతులే ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. అప్పట్లో పాటించే విధానాలను ఇప్పుడు చాలామంది ఫాలో అవుతున్నారు. కాకపోతే వాటికి కొంచెం అధునాతనను జోడిస్తున్నారు. అయితే, ప్రస్తుతం హోటల్స్ చాలా వెరైటీ వెరైటీలతో కస్టమర్స్ ను ఆకర్శిస్తున్నాయి. అంతేకాదు.. పెళ్లిలు, పండుగలు, ఏ శుభకార్యం చేసినా పంచభక్ష పరమాన్నాలు అనే మాట ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.


ఆ హోటల్ లో ఏమిటి స్పెషల్ ? ఈ పండుగకు మీ ఇంట్లో ఏమిటి స్పెషల్? ఆ పెళ్లిలో ఏమిటి స్పెషల్ ? ఇలా అడిగిన సందర్భాల్లో అప్పుడు ఎదురవుతున్న సమాధానం ఒక్కటే.. అదేమంటే ‘పంచభక్ష పరమాన్నాలు’. అవును మీరు విన్నది రైటే. ఇప్పుడు ఎవరినోట విన్నా ఇదే పదం వినపడుతుంది. దీంతో ఈ పదం ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతుంది. ఏ శుభకార్యక్రమం చేసినా ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. అయితే, నాటి రోజుల్లో ఈ పదం బాగా వినిపించేది. ప్రస్తుత రోజుల్లో కూడా ఈ మాట విరివిగా వినిపిస్తుంది. ఈ క్రమంలో చాలామందికి పంచభక్ష పరామాన్నాలు అంటే ఏమిటో తెలుసుకోవాలని ఆసక్తి కలుగుతుంది. దీంతో వారు ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి మరీ తెలుసుకుంటున్నారంటా.

Also Read: మీకు చికెన్ వింగ్స్ అంటే ఇష్టమా? ఆ రెసిపీని ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు


అయితే, పెళ్లిళ్లు గానీ, పండుగలు గానీ, శుభకార్యాలు గానీ.. జరిగినా తెలుగు ఇళ్లలో పంచభక్ష పరమాన్నాలను ఏర్పాటు చేస్తుంటారు. దీనికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలతో భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. ఒక వ్యక్తి ఆహారాన్ని తీసుకునే సమయంలో, తీసుకున్న తరువాత సంతృప్తిగా ఫీలవ్వాలి. ఇలా భోజనాన్ని ఏర్పాటు చేయడమే పంచభక్ష పరమాన్నాల ముఖ్య ఉద్దేశం అని చెబుతుంటారు.

ఈ పంచభక్ష పరమాన్నాలలో మొత్తం ఐదు రకాల ఆహార పదార్థాలు ఉంటాయి. అవేమంటే.. భక్ష్యాలు, భోజ్యం, చోష్యం, లేహ్యం, పానీయం.. వీటన్నిటినీ కలిపి పంచభక్ష పరమాన్నాలు అంటారు.

1. భక్షాలు – కొరికి తినేవాటిని భక్ష్యాలు అని అంటారు. అనగా.. బూరెలు, గారెలు లాంటివి.
2. భోజ్యం – నమిలి తినే ఆహార పదార్థాలను భోజ్యం అంటారు. అనగా.. దద్దోజనం, పులిహోర.
3. చోష్యం – జుర్రుకుని తినేవాటిని చోష్యం అంటారు. అనగా.. చారు, పాయసం.
4. లేహ్యం – నాకి తినే ఆహార పదార్థాలను లేహ్యాలు అని అంటుంటారు. అనగా.. బెల్లం పాకం, తేనె లాంటివి.
5. ఇక చివరగా పానీయం – తాగేవన్నిటినీ పానీయాలు అని అంటారు. అనగా.. నీళ్లు, పళ్ల రసాలు ఈ కోవలోకే వస్తాయి.

Also Read: వంటింట్లో ఉండే పచ్చి కొబ్బరిని ఒక్క సారి వాడితే.. బ్యూటీ పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరమే ఉండదు

సుష్టుగా భోజనం చేయడం కోసం ఈ విధంగా అనేక రకాలైన ఆహార పదార్థాలను పంచభక్ష పరమాన్నాలను ఏర్పాటు చేస్తుంటారు. పూర్వీకులు అయితే దీనిని బాగా ఫాలో అయ్యేవారు. వారు ఏ శుభకార్యక్రమం చేసినా ఈ విధంగా ఏర్పాటు చేసేవారు. కార్యక్రమం ఎంత ముఖ్యమో.. పంచభక్ష పరమాన్నాలను ఏర్పాటు చేయడం అంతే ముఖ్యంగా పరిగణించేవారు. ఇప్పటికీ చాలామంది ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో హోటల్స్, రెస్టారెంట్స్ డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాయి. పేర్లతోనే కాకుండా రకరకాల ఆహార పదార్థాలను ఏర్పాటు చేసి కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. అందులో భాగంగానే చాలా హోటల్స్ పంచభక్ష పరమాన్నాల ట్రెండ్ ను ఫాలో అవుతున్నాయి. దీంతో వాటికి లాభాలు చేకూరుతున్నాయంటా. పెళ్లిలు, శుభాకార్యాలు చేసేవారు కూడా అందరికంటే భిన్నంగా తాము భోజనాలను ఏర్పాటు చేయాలనుకుంటారు. ప్రస్తుతం వీరు కూడా ఈ పంచభక్ష పరమాన్నాలను ఆ కార్యక్రమంలో ఖచ్చితంగా ఉండేలా చూస్తున్నారంటా. దీంతో ప్రస్తుతం పంచభక్ష పరమాన్నాలు అనే పదం బాగా ట్రెండ్ అవుతోంది. అందుకే చెబుతుంటారు.. అప్పట్లో ఇప్పటిలాగా ఎటువంటి టెక్నాలజీ లేకపోయినా నాటిరోజుల్లో ఏది ఫాలో అయినా దాని వెనుక ఏదో ఒక మంచి ఉద్దేశం ఉంటుందని చెబుతుంటారు. ఇందుకు ఉదాహరణ ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్.

Tags

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×