BigTV English

Lungs Cancer: స్మోకింగ్ అలవాటు లేకపోయిన ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకు వస్తుంది? కారణాలేంటి?

Lungs Cancer: స్మోకింగ్ అలవాటు లేకపోయిన ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకు వస్తుంది? కారణాలేంటి?
ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం ధూమపానం చేయడమేనని అందరికీ తెలుసు. అయితే ధూమపానం చేయని వారిలో కూడా ఊపిరిగత్తుల క్యాన్సర్ వస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. అలాగే మన దేశంలో కూడా లంగ్ క్యాన్సర్ వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. స్మోకింగ్ చేసే వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చిందంటే ఒక అర్థం ఉంది… కానీ ధూమపానం అలవాటు లేని వారు, మద్యపానం చేయనివారు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా స్మోకింగ్ చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకు వస్తుంది?


భారతదేశంలో ధూమపానం చేసే వారికే కాదు, చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ బయటపడుతుంది. ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకోవడం కోసం ఎన్నో అధ్యయనాలు జరిగాయి. అధ్యయనంలో ధూమపానం చేయని వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం వాయు కాలుష్యం. ఢిల్లీ లాంటి నగరాలలో వాయు కాలుష్యం దారుణంగా ఉంది. కేవలం ఢిల్లీ మాత్రమే కాదు, మెట్రో నగరాలన్నింటిలోనూ వాయు కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతోంది. దీని వల్లే ఊపిరితిత్తుల క్యాన్సర్ భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వాయు కాలుష్యం వల్ల శ్వాస కోశ వ్యాధులు పెరిగిపోతున్నాయి. మనదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడిన వారిలో ఎక్కువమంది స్మోకింగ్ చేయని వారే కావడం గమనార్హం. వీరందరికీ వాయు కాలుష్యం వల్లే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చినట్టు తెలుస్తోంది.

ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు
ఊపిరితిత్తుల్లో ఏ భాగానికి క్యాన్సర్ సోకింది అనే దానిపై కనిపించే లక్షణాలు ఆధారపడతాయి. ముఖ్యంగా దగ్గు అధికంగా వస్తుంది. శ్వాస ఆడటానికి ఇబ్బంది పెడుతుంది. క్యాన్సర్ ఎక్కడ సోకినా కూడా ఈ రెండు లక్షణాలు కచ్చితంగా కనిపిస్తాయి. దగ్గు నిరంతరంగా ఆగకుండా వస్తూనే ఉన్నా క్యాన్సర్ ఉందేమోనని అనుమానించాల్సిందే. అలాగే దగ్గుతో పాటు రక్తపు చుక్కలు కనిపించినా కూడా జాగ్రత్తపడాలి. దగ్గుతున్నప్పుడు లేదా నవ్వుతున్నప్పుడు, శ్వాస లోతుగా తీసుకుంటున్నప్పుడు, ఛాతీ, భుజాలు, వీపులో నొప్పిగా అనిపిస్తుంది. బరువు హఠాత్తుగా తగ్గిపోతూ ఉంటారు. 24 గంటలు అలసటగా, బలహీనంగా అనిపిస్తుంది. ఆకలి కూడా తగ్గిపోతుంది. గొంతు బొంగురు పోయినట్టు అనిపిస్తుంది. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది. ముఖం లేదా మెడలో వాపు కనిపిస్తుంది. మింగడంలో కూడా ఇబ్బంది అనిపిస్తుంది. అలాగే వేళ్ళు ఉబ్బినట్టు అనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలే. మీకు వీటిలో ఏ లక్షణం కనిపించినా వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడం అత్యవసరం.

ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి… ఎందుకంటే ఈ క్యాన్సర్ మెదడుకు త్వరగా వ్యాపిస్తుంది. తలనొప్పి, మూర్ఛలకు కారణం క్యాన్సర్ కణితుల వల్ల నరాలు దెబ్బతింటాయి. ఇవి చేతులు, కాళ్లలో బలహీనత తిమ్మిరి కి కారణం అవుతాయి. నరాలు కూడా నష్టపోతాయి. కనురెప్పలు ఆధీనంలో ఉండవు. కంటి చూపులో కొంత భాగం చీకటిగా అనిపిస్తుంది.


ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో అనేక రకాలు ఉన్నాయి. వీటిలో నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, అడెనోకార్సినోమా, లార్జ్ సెల్ కార్సినోమా, స్క్రామస్ సెల్ కార్సెనోమా, స్మాల్ సెల్ లంగ్స్ క్యాన్సర్ వంటివి ఉన్నాయి. వీటిలో ఏది వచ్చినా ప్రమాదమే.

Related News

Anjeer: వీళ్లు.. అంజీర్‌లను అస్సలు తినకూడదు తెలుసా ?

Dasara festival 2025: నవరాత్రి పండుగకు స్పెషల్ వంటలు.. ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా ప్రత్యేక రెసిపీలు

Heart Attack: వ్యాయామం చేసేటప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా ? హార్ట్ ఎటాక్ కావొచ్చు !

Healthy Hair Tips: ఆరోగ్యమైన జుట్టు కోసం సహజ చిట్కా.. వారంలో రెండు సార్లు చాలు

Glowing Skin Tips: కెమికల్స్ లేకుండా ఇంట్లోనే గ్లోయింగ్ స్కిన్.. ఇలా చేస్తే చందమామలా మెరిసే చర్మం

Yoga For Brain Health: ఈ యోగాసనాలతో.. బ్రెయిన్ డబుల్ షార్ప్ అవుతుందట !

Air Fryer: ఎయిర్ ఫ్రైయర్ వంటలు ఆరోగ్యానికి ఇంత మంచివా? అస్సలు ఊహించి ఉండరు!

Alcohol: విస్కీ, వైన్, బీర్, కల్లు.. వీటిలో ఏది ఎక్కువ డేంజర్!

Big Stories

×