Big Stories

Bubonic Plague: మళ్లీ తిరిగొచ్చిన బుబోనిక్ వ్యాధి.. ఈ జంతువులకు దూరంగా ఉండండి

Bubonic Plague

- Advertisement -

Bubonic Plague Symptoms: అగ్రరాజ్యం అమెరికాలో ఓరేగాన్ రాష్ట్రంలో అరుదైన వ్యాధి ప్రబలింది. ఒకప్పుడు ఐరోపాలో విలయం సృష్టించిన బుబోనిక్ ప్లేగు వ్యాధి కేసు అమెరికాలో ఓ వ్యక్తికి సోకింది. పెంపుడు పిల్లి నుంచి ఆ వ్యాధి అతడికి సోకినట్లుగా భావిస్తున్నారు. ఈ ప్లేగు వ్యాధి వల్ల ఒక‌ప్పుడు ఐరోపాలో భారీ నష్టం జరిగింది. బ్యూబోనిక్ ప్లేగు వ్యాధి వల్ల సుమారు మూడ‌వ వంత జ‌నాభా మృతిచెందారు.

- Advertisement -

అయితే బాధితుడి వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. అతడికి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆ వ్యక్తికి చెందిన పెంపుడు పిల్లికి కూడా వైద్యం చేస్తున్నట్లు డాక్టర్ రిచ‌ర్డ్ వాసెట్ తెలిపారు.

Read More: పీచు మిఠాయి బ్యాన్.. అసలు కారణం తెలుసా..!

ప్రస్తుతం వ్యాధి సోకిన వ్యక్తిలో వ్యాధి ప్రారంభ దశలో ఉన్నట్లుగా వెల్లడించారు. కొన్ని సంవత్సరాలు లక్షల మంది ప్రాణాలు తీసిన ఈ వైరస్ ఇప్పుడు కనిపించడం చాలా ప్రమాదమని వెల్లడించారు. 14వ శతాబ్ధంలో ఐరోపాలో ఈ వ్యాధికి, చికిత్స, యాంటీ బయాటిక్స్ లేకపోవడంతో లక్షల మంది మరణించారు. బుబోనిక్ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది.

యెర్సినాయి పెస్టిస్ అనే బ్యాక్టీరియా కారణంగా బుబోనిక్ ప్లేగు వ్యాధి సంభవిస్తుంది. ఈ వైరస్ జంతువులు, మనుషులకు సులభంగా సోకుతుంది. ఈగలు ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. జంతువు నుంచి వైర‌స్ సోకిన 8 రోజుల త‌ర్వాత మ‌నిషిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..

బ్యూబోనిక్ ప్లేగు లక్షణాలు

1. అధిక జ్వరం

2. చేతులు, కాళ్లు నొప్పులు

3. తలనొప్పి

4. శరీరంపై పెద్ద పెద్ద వాపు గడ్డలు

5. వేళ్లు లేదా కాళ్లలో రక్తస్రావం

6. కండరా బలహీనత

మానవ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా ఈ బుబోనిక్ ప్లేగు వ్యాధిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది. ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడి ఆఫ్రికా, ఐరోపా, ఆసియాలో 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు.

Read More: ఇన్‌ఫ్లుఎంజా వైరస్.. ఈ నెలలోనే విజృంభణ..!

బుబోనిక్ ప్లేగు వ్యాధిని ముందుగా గుర్తించడం చాలా అవసరం. లేదంటే వ్యాధి రక్తంలోకి ప్రవహించి ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. అనంతరం న్యూమోనిక్ ప్లేగుగా మారి బాధితుల ప్రాణాలు తీస్తుంది.
సరైన నిబంధనలు పాటించకపోతే ప్రాణనష్టం ఊహించని స్థాయిలో ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తారు.

Disclaimer : ఈ సమచారాన్ని పలు హెల్త్ జర్నల్స్ ఆధారంగా, ఆరోగ్య నిపుణుల సలహా మేరకు మీ అవగాహన కోసం అందిస్తున్నాం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News