Jail Premier League: క్రికెట్… ప్రపంచంలోనే అత్యధిక జనాధారణ ఉన్న ఆట. ప్రపంచంలో కాదు ముఖ్యంగా మన ఇండియా విషయానికి వస్తే క్రికెట్ ఆడని వారు లేదా చూడని వారు అస్సలు ఉండరు. గల్లీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు ఇండియాలో.. అన్ని మ్యాచ్లకు జనాధారణ ఉంటుంది. క్రికెట్ ఆడే వాళ్ళు ఆడతారు అలాగే చూసే వాళ్ళు చూస్తారు. అందుకే ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ చాలా బాగా సక్సెస్ అయింది. 18 సంవత్సరాలుగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
Also Read: Select Shreyas Iyer: అప్పుడు ధనశ్రీ, ఇప్పుడు చాహల్ కొత్త ప్రియురాలు.. అయ్యర్ పాడు పనులు ?
జైల్లోనే క్రికెట్.. ఖైదీల కోసం జైలు ప్రీమియర్ లీగ్
ఇండియా వ్యాప్తంగా క్రికెట్ బాగా పాపులారిటీ సంపాదించుకున్న నేపథ్యంలో కొత్తగా తెరపైకి జైలు ప్రీమియర్ లీగ్ కూడా వచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ చూసి ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ అభిమానులు… ఇక ఇప్పుడు.. జైలు ప్రీమియర్ లీగ్ కూడా జర పైకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని కొన్ని జైల్లో ఖైదీలతో క్రికెట్ కూడా ఆడిపిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మతుర అనే ప్రముఖ జైల్లో.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ తరహాలోనే….. జైలు ప్రీమియర్ లీగ్ ప్రవేశపెట్టారు అధికారులు. ఈ టోర్నమెంట్లో ఖైదీల అందరినీ భాగస్వామ్యులు చేశారు.
ఇలా జైలు ప్రీమియర్ లీగ్ ఆడితే ఖైదీలలో కొత్త ఉత్సాహం నెలకొంటుంది. వాళ్ల శరీర పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోతాయి. హెల్దీగా తయారవుతారు. మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది. చాలా ప్రశాంతంగా జైలు జీవితాన్ని గడుపుతారు. ఈ నేపథ్యంలోనే జైలు అధికారులందరూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా జైలు ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించి… ఖైదీలతో క్రికెట్ ఆడిస్తున్నారు ఉత్తరప్రదేశ్ అధికారులు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోని చూసిన క్రికెట్ అభిమానులు అలాగే జనాలందరూ రియాక్ట్ అవుతున్నారు. ఒరేయ్ జైల్లో కూడా క్రికెట్ ఆడిస్తున్నారా? అలాంటి ఆలోచన ఎలా వచ్చిందో అంటున్నారు. ఉత్తరప్రదేశ్ అధికారులు మంచి నిర్ణయం తీసుకున్నారు.. ఇలాంటి రూల్ అన్ని జైళ్లలో కొనసాగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక చొరవ తీసుకొని మరి…. ఇండియా వ్యాప్తంగా… ఉన్న అన్ని సెంట్రల్ జైళ్లు, చిన్న జైల్లో కూడా…. జైలు ప్రీమియర్ లీగ్ నిర్వహించాలని కోరుతున్నారు క్రికెట్ అభిమానులు. ఇది ఇలా ఉండగా… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య యుద్ధం నేపథ్యంలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే మధ్యలో ఆగిపోయిన ఈ టోర్నమెంటును.. మే 17వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభించబోతోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. జూన్ మూడవ తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
#WATCH | Uttar Pradesh | To enhance the talent of the prisoners, improve their physical health and relieve them from mental stress, Jail Premier League was organized on the lines of IPL among the prisoners in Mathura Jail pic.twitter.com/ACofTYmRgi
— ANI (@ANI) May 15, 2025