CM Revanth Reddy: పీసీసీ అధ్యక్షుడిగా వచ్చాను. మళ్లీ సీఎం హోదాలో ఇక్కడికి వచ్చానంటూ సీఎం రేవంత్ రెడ్డి మెదక్ పర్యటన సమయంలో అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ చర్చి వద్ద ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
మెదక్ చర్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు. అలాగే క్రిస్మస్ పర్వదినాన్ని సైతం ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాల నిర్వహించగా క్రైస్తవ సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున చర్చికి తరలి వచ్చారు. చర్చి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించగా, బుధవారం సీఎం క్రిస్మస్ పర్వదినాన పురస్కరించుకొని మెదక్ చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు.
మెదక్ చర్చికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి పాస్టర్లు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మెదక్ చర్చితో తనకు గొప్ప అనుబంధం ఉందన్నారు. పిసిసి అధ్యక్షుడి హోదాలో తాను మెదక్ చర్చికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నానని, మళ్లీ సీఎం హోదాలో ఇక్కడికి వస్తానంటూ ఆనాడే చెప్పానని తన మాటలను సీఎం గుర్తుకు చేసుకున్నారు. ప్రభువు ఆశీస్సులతో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం వచ్చిందని, శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం తనకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు సీఎం తెలిపారు.
Also Read: Allu Arjun : నేషనల్ మీడియాను మిస్ చేయడం లేదు… ఈ పొజిషన్‌లో కూడా పబ్లిసిటీ అవసరమా..?
మెదక్ చర్చి అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేసిందని, అన్ని వర్గాల ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పాలన సాగిస్తుందని సీఎం అన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులను, ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. అలాగే మెమొంటోలను సైతం అందజేశారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.
మెదక్ చర్చ్ తో నాకు గొప్ప అనుబంధం ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
పీసీసీ అధ్యక్షుడిగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నా
మళ్లీ సీఎం హోదాలో ఈ చర్చ్ కి వస్తానని ఆనాడు చెప్పాను
శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను
ప్రభువు ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం వచ్చింది
మెదక్… https://t.co/QQcg3dmINs pic.twitter.com/j38K3qg1eE
— BIG TV Breaking News (@bigtvtelugu) December 25, 2024