Fashion Tips: ప్రతిరోజూ ఉదయం ఆఫీస్‌కు బయలుదేరే ముందు చాలామంది అమ్మాయిలను వేధించే కామన్ ప్రశ్న.. ‘ఈరోజు ఆఫీస్‌కి ఏం వేసుకెళ్లాలి?’ కప్‌బోర్డ్ నిండా బట్టలు ఉన్నా, ప్రతిరోజూ కొత్తగా, స్టైలిష్‌గా కనిపించాలనే కోరిక మాత్రం ఉంటుంది. ముఖ్యంగా కార్పొరేట్ ప్రపంచంలో మన దుస్తులు, యాక్సెసరీస్ మన మొత్తం లుక్‌పై ప్రభావం చూపిస్తాయి. అయితే, అందంగా, క్లాసీగా, ఖరీదైన లుక్‌లో కనిపించడానికి ప్రతిసారీ భారీగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మన వార్డ్‌రోబ్‌లో ఉండే కొన్ని బేసిక్ వస్తువులను సరైన విధంగా స్టైల్ చేసుకుంటే చాలు.. సింపుల్ లుక్‌నే చాలా రిచ్‌గా మార్చుకోవచ్చు. రోజూ ఆఫీస్‌కు ఏం వేసుకోవాలా అని ఆలోచిస్తూ సమయం వృథా కాకుండా.. మీ వార్డ్‌రోబ్‌లో తప్పక ఉండాల్సిన ఈ 5 ముఖ్యమైన ఫ్యాషన్ ఎసెన్షియల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఒక మంచి శాటిన్ షర్ట్ మీ లుక్‌ను ఒక్కసారిగా మార్చేస్తుంది. ఎలాంటి ఖర్చు లేకుండానే ఇది చాలా రిచ్‌గా కనిపిస్తుంది. చాంపైన్ కలర్ లేదా బ్లాక్ కలర్ శాటిన్ షర్ట్ తీసుకుంటే అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. ఆఫీస్ టైమ్‌లో ట్రావుజర్స్‌లోకి ఇన్ చేసి, ఈవినింగ్ ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లినప్పుడు జీన్స్ మీదకి నాట్ వేసుకుంటే పర్ఫెక్ట్ క్యాజువల్ లుక్ వచ్చేస్తుంది.
షూస్ విషయంలో ట్రెండ్స్ వెంట పడకుండా పాయింటెడ్‌లో ఉన్న హీల్స్ ఎంచుకోవడం బెస్ట్. బ్లాక్ లేదా న్యూడ్ కలర్ పాయింటెడ్ హీల్స్ పాదాలను చాలా అందంగా, పొడవుగా చూపిస్తాయి. ఇవి డ్రెసెస్, ట్రావుజర్స్ రెండింటికీ బాగుంటాయి. ఐదు చౌకబారు జతల కంటే.. కంఫర్ట్‌గా ఉండే ఒక మంచి క్లాసిక్ పేర్ మన దగ్గర ఉంటే చాలు.
Also Read: ఫిట్‌నెస్ ప్రియులకు ఇదొక్కటి చాలు.. గుండె వేగం నుంచి ఆక్సిజన్ వరకు అన్నీ ఈ బ్యాండ్ గుప్పిట్లోనే!
మీ నడుము సైజుకు పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యే స్ట్రైట్ లెగ్ ట్రావుజర్స్ మీ లుక్‌ని చాలా ప్రొఫెషనల్‌గా మారుస్తాయి. ఐదు నిమిషాల్లో హడావుడిగా వేసుకున్నా సరే, మిమ్మల్ని చాలా పద్ధతిగా చూపిస్తాయి. బీజ్ లేదా బ్లాక్ కలర్ ట్రావుజర్స్ మీ దగ్గర ఉంటే, ఏ షర్ట్‌తోనైనా సులభంగా పేర్ చేసుకోవచ్చు.
మనం పట్టుకునే బ్యాగ్ మన టేస్ట్‌ని చెప్తుంది. వంగిపోయేలా ఉండే బ్యాగ్స్ కాకుండా, మంచి షేప్ ఉన్న మిడ్‌సైజ్ బ్యాగ్స్ చాలా క్లాసీగా ఉంటాయి. ల్యాప్‌టాప్, రోజూ వాడే వస్తువులు పెట్టినా బయటకు ఉబ్బినట్లు కనిపించని బ్యాగ్ ఎంచుకోవాలి. ఇది డెస్క్ నుంచి డిన్నర్ వరకు దేనికైనా సెట్ అవుతుంది.
బలమైన కాంతి ఇచ్చే హడావుడి నగలు కాకుండా, చిన్న గోల్డ్ ఇయర్ రింగ్స్, ఒక క్లాసిక్ వాచ్, సన్నటి చైన్ వేసుకుంటే ఆ లుక్కే వేరు. ఒక మంచి యాంటీ-టార్నిష్ గోల్డ్ జ్యువెలరీ పీస్ మీ సింపుల్ అవుట్‌ఫిట్‌ని కూడా చాలా రాయల్‌గా మారుస్తుంది. అతిగా కాకుండా సింపుల్‌గా ఉండటమే కార్పొరేట్ లుక్ అసలు సీక్రెట్.
Also Read: మన ఆరోగ్యాన్ని AIతో ట్రాక్ చేసే పెబుల్ కొత్త బ్యాండ్.. ధర కూడా తక్కువే!