E-Paper
Advertisement

ఇలాంటి డివైజ్ ఒక్కటి ఉంటే చాలు.. ఫోన్, వాలెట్, తాళాలు ఎక్కడున్నా నిమిషాల్లో పట్టేయవచ్చు!

ఇలాంటి డివైజ్ ఒక్కటి ఉంటే చాలు.. ఫోన్, వాలెట్, తాళాలు ఎక్కడున్నా నిమిషాల్లో పట్టేయవచ్చు!
Advertisement

Samsung Galaxy SmartTag 3: సాధారణంగా తాళాలు, వాలెట్ లేదా కార్ కీ ఎక్కడో పెట్టి మరిచిపోవడం మనలో చాలా మందికి అలవాటే. ఇలాంటి సమస్యకు పరిష్కారంగా శాంం‌సంగ్ కంపెనీ ‘గెలాక్సీ స్మార్ట్‌ట్యాగ్ 3’ పేరుతో ఒక సరికొత్త ట్రాకింగ్ డివైజ్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. గతంలో వచ్చిన మోడల్స్‌తో పోలిస్తే.. ఇది మరింత చిన్నగా, తేలికగా ఉండటమే కాకుండా ఎన్నో అద్భుతమైన కొత్త ఫీచర్లతో వచ్చింది. ముఖ్యంగా శాంసంగ్ యూజర్లతో పాటు ఐఫోన్ వాడేవారు కూడా దీని ద్వారా తమ వస్తువులను సులభంగా వెతుక్కునే వెసులుబాటు లభించింది.

కొత్త డిజైన్, లాంగ్ బ్యాటరీ:

ఈ కొత్త స్మార్ట్‌ట్యాగ్ 3 పరిమాణంలో గత మోడల్ కంటే 35 శాతం చిన్నగా, 33 శాతం తేలికగా ఉంటుంది. గుండ్రటి ఆకారం, అల్యూమినియం బటన్, ఐపీ67 రేటింగ్‌తో డిజైన్ చేశారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. సాధారణ వాడకంలో ఇది 550 రోజుల వరకు వస్తుంది. ఒకవేళ పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేస్తే ఏకంగా 790 రోజుల పాటు, అంటే రెండేళ్లకు పైగానే బ్యాటరీ ఛార్జింగ్ ఆందోళన లేకుండా పనిచేస్తుంది.

Advertisement

Also Read: రూ.500 లోపే 60 గంటల బ్యాటరీ లైఫ్ ఇచ్చే బెస్ట్ TWS ఇయర్ ఫోన్స్ ఇవే!

ఐఫోన్ యూజర్లూ వాడొచ్చు:

ఇన్నాళ్లూ శాంసంగ్ ట్రాకర్లు కేవలం ఆ కంపెనీ ఫోన్లలో మాత్రమే పనిచేసేవి. కానీ ఇప్పుడు స్మార్ట్‌ట్యాగ్ 3 మోడల్ స్మార్ట్‌థింగ్స్ ఫైండ్ నెట్‌‌వర్క్ ద్వారా యాపిల్ ఐఓఎస్ డివైజ్‌లకు కూడా కనెక్ట్ అవుతుంది. దీనివల్ల ఒకే ఇంట్లో ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారు కలిసి ఒకే వస్తువును ట్రాక్ చేయవచ్చు. బ్లూటూత్ 6.0 సాంకేతికత వల్ల ఏకంగా 60 మీటర్ల దూరంలో ఉన్న వస్తువు ఏ దిశలో, ఎంత దూరంలో ఉందో స్పష్టంగా తెలుస్తుంది.

అధునాతన సెక్యూరిటీ ఫీచర్లు:

Advertisement

దగ్గర్లో ఉన్న వస్తువుల కోసం ఇది అల్ట్రా వైడ్‌బ్యాండ్ సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఒకవేళ మీ వస్తువు బ్లూటూత్ పరిధి దాటిపోతే.. దగ్గర్లో ఉన్న ఇతర శాంసంగ్ పరికరాల సాయంతో దాని లొకేషన్‌‌ను కనుగొంటుంది. మీరు ఉండే ప్రదేశం దాటగానే అలర్ట్‌లు రావడం, వస్తువును ఎక్కడైనా మరిచిపోతే హెచ్చరించడం వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనిపై ఉన్న బటన్‌‌తో ఇంటి స్మార్ట్ పరికరాలను నియంత్రించవచ్చు. మీ వస్తువు పోయినప్పుడు ఎవరైనా దాన్ని ఆన్ చేస్తే మీ కాంటాక్ట్ వివరాలు వారికి కనిపిస్తాయి.

ధర వివరాలు:

ఈ స్మార్ట్‌ట్యాగ్ 3 సింగిల్ ప్యాక్ ధర దాదాపు రూ.2,500 కాగా, నాలుగు ట్యాగ్‌ల ప్యాక్ ధర దాదాపు రూ.8,300 వరకు ఉంటుంది. ఇది నలుపు, తెలుపు రంగుల్లో లభిస్తుంది. దీన్ని వస్తువులకు సులభంగా తగిలించుకోవడానికి సిలికాన్, లూప్ కేస్‌లను కూడా శాంసంగ్ విక్రయిస్తోంది. అక్టోబర్ 7 నుంచి సౌత్ కొరియాలో, నవంబర్ నుంచి ఇతర దేశాల్లో అందుబాటులోకి రానుంది.

Also Read: బ్యాంక్ డిస్కౌంట్లతో మరింత చవకగా ల్యాప్‌టాప్‌లు.. ఏ మోడల్ కొంటే బెటర్ అంటే?

Tags

Related News

కొత్త మెుబైల్ నెంబర్ తీసుకుంటున్నారా? ఏ అంకెలు ఉంటే అదృష్టం? ఏ సంఖ్యలతో దురదృష్టం!

ఫిట్‌నెస్ ప్రియులకు ఇదొక్కటి చాలు.. గుండె వేగం నుంచి ఆక్సిజన్ వరకు అన్నీ ఈ బ్యాండ్ గుప్పిట్లోనే!

మన ఆరోగ్యాన్ని AIతో ట్రాక్ చేసే పెబుల్ కొత్త బ్యాండ్.. ధర కూడా తక్కువే!

ఎక్కువ ర్యామ్ ఉన్నా సరే ఫోన్ హ్యాంగ్ అవుతోందా? మీరు చేసే పొరపాట్లివే!

ఫోన్ బ్యాటరీ 20% కన్నా తగ్గగానే..ఎందుకు వేగంగా డ్రైన్ అవుతుంది? అసలు కారణమిదే!

BSNL లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చిందోచ్.. ఉచిత సిమ్, కాల్స్, 24GB డేటా!

రూ.500 లోపే 60 గంటల బ్యాటరీ లైఫ్ ఇచ్చే బెస్ట్ TWS ఇయర్ ఫోన్స్ ఇవే!

Big Stories

Advertisement
×