E-Paper
Advertisement

మన ఆరోగ్యాన్ని AIతో ట్రాక్ చేసే పెబుల్ కొత్త బ్యాండ్.. ధర కూడా తక్కువే!

మన ఆరోగ్యాన్ని AIతో ట్రాక్ చేసే పెబుల్ కొత్త బ్యాండ్.. ధర కూడా తక్కువే!
Advertisement

Pebble Qore Ultra: మన దైనందిన జీవితంలో ఆరోగ్యాన్ని ట్రాక్ చేసుకోవడానికి స్మార్ట్ బ్యాండ్లు, వాచ్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ బ్రాండ్ పెబుల్.. భారతదేశంలో ‘కోర్ అల్ట్రా’ పేరుతో ఒక కొత్త వెల్నెస్ బ్యాండ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఏఐ టెక్నాలజీతో పనిచేసే హెల్త్ ఫీచర్లు, అధునాతన సెన్సార్లు, వందకు పైగా స్పోర్ట్స్ మోడ్‌లతో ఈ డివైజ్ రూపొందింది. సాధారణంగా మనం చూసే స్మార్ట్ బ్యాండ్ల కంటే భిన్నంగా, ఇది మన శరీరం చెప్పే సంకేతాలను అర్థమయ్యేలా విశ్లేషించి చెప్తుంది.

ఆకట్టుకునే ధర, ఆఫర్లు:

ఈ బ్యాండ్ అసలు ధర రూ.8,999 కాగా.. ప్రారంభ ఆఫర్ కింద దీన్ని రూ.5,999కే సొంతం చేసుకోవచ్చు. డెసర్ట్ గోల్డ్, డీప్ బ్లూ, డీప్ బ్లాక్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. పెబుల్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలో ఇది లభిస్తుంది.

Advertisement

Also Read: రూ.500 లోపే 60 గంటల బ్యాటరీ లైఫ్ ఇచ్చే బెస్ట్ TWS ఇయర్ ఫోన్స్ ఇవే!

అత్యుత్తమ సెన్సార్లు, ఫీచర్లు:

ఇందులో ఉన్న నాలుగు ఫోటోడయోడ్ సెన్సార్లు, సిక్స్ యాక్సిస్ మోషన్ సెన్సార్లు గుండె వేగం, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, ఒత్తిడి, శ్వాసక్రియను నిరంతరం పర్యవేక్షిస్తాయి. నడక, పరుగు వంటి వ్యాయామాలను ఇది ఆటోమేటిక్‌గా గుర్తించగలదు. అవుట్‌డోర్ యాక్టివిటీస్ కోసం యాప్ ద్వారా జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం కూడా ఉంది.

ఏఐ ఆధారిత కోర్ యాప్:

Advertisement

పెబుల్ కోర్ మొబైల్ యాప్ ఈ బ్యాండ్‌కు ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. మన నిద్ర, ఒత్తిడి, హెచ్‌ఆర్‌వి ఆధారంగా ప్రతిరోజూ 0 నుంచి 100 వరకు స్కోర్ ఇస్తుంది. దీనివల్ల మన శరీరంలో శక్తి స్థాయిలు ఎలా ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్‌తో కలిసి ఫిట్‌నెస్ కమ్యూనిటీని క్రియేట్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

15 రోజుల బ్యాటరీ లైఫ్:

రోజువారీ వాడకంలో మాటిమాటికీ ఛార్జింగ్ పెట్టే అవసరం లేకుండా.. ఒకే ఒక్క ఛార్జ్‌తో ఏకంగా 15 రోజుల పాటు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారికి, ప్రతిరోజూ తమ ఫిట్‌నెస్ పురోగతిని తెలుసుకోవాలనుకునేవారికి ఈ పెబుల్ కోర్ ఆల్ట్రా బ్యాండ్ ఒక మంచి ఆప్షన్‌‌గా నిలుస్తుంది.

Also Read: బ్యాంక్ డిస్కౌంట్లతో మరింత చవకగా ల్యాప్‌టాప్‌లు.. ఏ మోడల్ కొంటే బెటర్ అంటే?

Tags

Related News

ఫిట్‌నెస్ ప్రియులకు ఇదొక్కటి చాలు.. గుండె వేగం నుంచి ఆక్సిజన్ వరకు అన్నీ ఈ బ్యాండ్ గుప్పిట్లోనే!

ఎక్కువ ర్యామ్ ఉన్నా సరే ఫోన్ హ్యాంగ్ అవుతోందా? మీరు చేసే పొరపాట్లివే!

ఫోన్ బ్యాటరీ 20% కన్నా తగ్గగానే..ఎందుకు వేగంగా డ్రైన్ అవుతుంది? అసలు కారణమిదే!

BSNL లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చిందోచ్.. ఉచిత సిమ్, కాల్స్, 24GB డేటా!

రూ.500 లోపే 60 గంటల బ్యాటరీ లైఫ్ ఇచ్చే బెస్ట్ TWS ఇయర్ ఫోన్స్ ఇవే!

Airtel యూజర్లకు ఊహించని గిఫ్ట్.. ఏడాది ప్లాన్‌పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఫ్రీగా 150GB డేటా!

బ్యాంక్ డిస్కౌంట్లతో మరింత చవకగా ల్యాప్‌టాప్‌లు.. ఏ మోడల్ కొంటే బెటర్ అంటే?

Big Stories

Advertisement
×