Ajwain Leaves: వాము సాధారణంగా ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటుంది. వాములో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వాము ఆకులో కూడా అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించే గుణాలు ఉంటాయి. వాము ఆకులు కడుపు నొప్పిని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా జలుబు, దగ్గు వంటి వాటి నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. వాము ఆకులు శరీరంలో మంటను తగ్గించడంలో ప్రభావ వంతంగా పనిచేస్తాయి. మరి వాము ఆకులు తినడం వల్ల ఇంకా ఎలాంటి అద్భుత ప్రయోజనాలు ఉంటాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కడుపు సంబంధిత సమస్యలు:
కడుపు సంబంధిత సమస్యలు తగ్గడానికి వాము ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా వాము ఆకులు నమలడం వల్ల జీర్ణ ప్రక్రియ కూడా వేగవంతం అవుతుంది. కడుపు మంట, అజీర్ణం వంటి సమస్యల నుండి బయటపడవచ్చు. భోజనం తర్వాత వాము ఆకులు తింటే చాలా ప్రయోజనకరం అని చెబుతారు. ఇవి ఆహారాన్ని ఈజీగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి.
జలుబు, దగ్గు:
వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు వంటి రావడం చాలా కామన్. ఇటువంటి పరిస్థితిలో వాము ఆకులు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . వాము ఆకుల రసంలో తేనె కలిపి తాగడం వల్ల కూడా దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. వాము ఆకులు ఇన్ఫెక్షన్ల నుండి పోరాడటంలో కూడా సహాయం చేస్తాయి. అంతే కాకుండా వీటిని తినడం వల్ల మీరు ఆరోగ్యంగా కూడా ఉంటారు. కానీ తగిన మోతాదులో మాత్రమే మీరు వాము ఆకులను తినాలని గుర్తుంచుకోండి.
శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది:
వాము ఆకులను ఎండబెట్టి కూడా నిల్వ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇలా తయారు చేసిన పొడిని టీ తయారీలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది డీటాక్స్ డ్రింక్ గా కూడా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా వీటిలో ఫైబర్, ఫోలెట్, కాల్షియం, నియాసిన్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఈ ఆకులను మరిగించి తాగడం వల్ల కూడా శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి.
ఊపిరితిత్తుల ఆరోగ్యం:
వాము ఆకులు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ ఆకులలోని శోథ నిరోధక లక్షణాలు ఊపిరితిత్తుల సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యల నుండి బయటపడటానికి మీరు వైద్యుడి సలహా మేరకు వాము ఆకులను తినవచ్చు.
Also Read: చికెన్‌కు బదులుగా చేపలు తినండి.. బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు !
రోగనిరోధక శక్తి:
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే బలమైన రోగనిరోధక శక్తి కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఆకుకూరలను తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మీరు అనేక తీవ్రమైన వ్యాధులు ,ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.
నోటి దుర్వాసన:
మీ నోటి నుండి దుర్వాసన వస్తుంటే ఈ సమస్య నుండి బయటపడటానికి వాము ఆకులను తినండి. ఇది మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది. రోజూ వాము ఆకులను నమలడం ద్వారా మీరు ఈ సమస్య నుండి బయటపడవచ్చు.