Ghee For Feet: రాత్రి పడుకునే ముందు అరికాళ్లకు నెయ్యి రాసుకుంటే చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో మలబద్ధకం నుంచి కీళ్ల నొప్పుల వరకు అనేక సమస్యలు మనల్ని ఇబ్బంది పెడతాయి. ఈ సమస్యలను ఎదుర్కోవటానికి నెయ్యి చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజు రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల నెయ్యి వేళ్లకు, అరికాళ్లకు అప్లై చేయాలి. నెయ్యిని శీతాకాలంలో రాత్రిపూట అరికాళ్లకు అప్లై చేయడం వల్ల కలిగే 6 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి పడుకునే ముందు అరికాళ్లపై నెయ్యితో మర్దన చేస్తే చలికాలంలో అనేక రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు.
మలబద్ధకం వంటి సమస్యకు పరిష్కారం:
ముఖ్యంగా చలికాలంలో మలబద్ధకంతో బాధపడేవారు చాలా మందే ఉంటారు. ఇలాంటి వారురోజు నిద్రపోయే ముందు అరికాళ్లకు నెయ్యి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం:
చలికాలంలో చాలా మందికి కీళ్ల నొప్పులు పెరుగుతాయి. కాళ్ల నొప్పులతో పాటు చలికి భుజం నొప్పి, బిగుసుకుపోవడంతో చాలా మంది బాధపడుతుంటారు. ఇలాంటి సమయంలో రాత్రిపూట అరికాళ్ళపై నెయ్యి అప్లై చేయడం వల్ల ఈ కీళ్లన్నీ ఉత్తేజితమవుతాయి. అంతే కాకుండా కాళ్ల నొప్పి కూడా తగ్గుతుంది.
నిద్రపోవడానికి సహాయపడుతుంది:
నిద్రపోలేని వారు చిరాకుగా ఉంటారు. రాత్రిపూట పదే పదే నిద్రలేవడం వంటి సమస్యలను ఎదుర్కుంటారు. అలాంటివారు అరికాళ్లకు నెయ్యి రాసుకుని నిద్రించాలి. ఇలా చేయడం వల్ల ఆటంకం లేకుండా నిద్ర పడుతుంది.
రక్త ప్రసరణను పెంచుతుంది:
చలిలో రక్త నాళాలు సక్రమంగా పనిచేయవు. ఫలితంగా రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది. దేశీ నెయ్యిని అరికాళ్లపై అప్లై చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. నెయ్యి తరుచుగా కాళ్లకు అప్లై చేయడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.
కాలు నొప్పి నుండి ఉపశమనం:
తీవ్రమైన కాలు నొప్పి ఉన్న వారు పడుకునే ముందు కూడా దేశీ నెయ్యితో అరికాళ్లకు మసాజ్ చేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కాలి నొప్పులు తగ్గించడంలో నెయ్యి చాలా బాగా పని చేస్తుంది.
Also Read: ఈ ఆయిల్ వాడితే చాలు.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది
వాత దోషం శరీరంలో సమతుల్యంగా ఉంటుంది:
ఆయుర్వేదంలో మూడు విషయాలు వ్యాధులకు కారణమని చెప్పబడింది. వాత, పిత్త , కఫ. ఈ మూడింటిలో దేని పరిమాణం శరీరంలో పెరిగినా రకరకాల వ్యాధులు వస్తాయి. అరికాళ్ళకు మసాజ్ చేయడం వల్ల వాత సమతుల్యం అవుతుంది. అందుకే నెయ్యిని అరికాళ్లకు అప్లై చేయాలి. తరుచుగా ఇలా చేయడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అందుకే నెయ్యిని పాదాలకు అప్లై చేస్తూ ఉండాలి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.