E-Paper
Advertisement

ఇంట్లో లక్ష్మీదేవి రూపం ఆడబిడ్డ.. పాపకు 3 అక్షరాల అర్థవంతంమైన, సులభంగా పలికే పేర్లు ఇవిగో

ఇంట్లో లక్ష్మీదేవి రూపం ఆడబిడ్డ.. పాపకు 3 అక్షరాల అర్థవంతంమైన, సులభంగా పలికే పేర్లు ఇవిగో
Advertisement

ఇంట్లో ఆడబిడ్డ పుట్టడం ప్రతి కుటుంబానికి ప్రత్యేకమైన సంతోషాన్ని తీసుకువస్తుంది. చాలామంది కుమార్తెలను అదృష్టం, ఐశ్వర్యానికి ప్రతీకగా, లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అందుకే తమ చిన్నారికి మంచి అర్థం ఉన్న అందమైన పేరును పెట్టాలని తల్లిదండ్రులు కోరుకుంటారు.

ఇటీవలి కాలంలో చిన్నగా, ఆధునికంగా ఉండే పేర్లకు అందరూ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే సులభంగా పలకగలిగే ఈ పేర్లు అందరికీ త్వరగా గుర్తుండిపోతాయి.

మంచి అర్థం ఉన్న పేరు చాలా ముఖ్యం

Advertisement

పేరు అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగం. అది వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేక గుర్తింపునిస్తుంది. సానుకూల అర్థం ఉన్న పేరు పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని చాలామంది నమ్ముతారు. అలాంటి పేర్లు జీవితాంతం మంచి ముద్రను వేస్తాయి.

3 అక్షరాలా అర్థవంతమైన పేర్లు

అదితి .. ఈ పేరు గొప్పతనాన్ని సూచిక
ఈ పేరు అనంతమైన అవకాశాలు, స్వేచ్ఛ, గొప్పతనానికి ప్రతీకగా భావిస్తారు. అదితి అనే పేరుకు అర్థం దేవతల తల్లి. అంటే అంతం, ఆరంభం లేనిది.

Advertisement

అవని.. ఈ పేరు భూదేవికి సూచిక
అవని అంటే భూమి అని అర్థం. ఈ పేరు స్థిరత్వం, దయ, సున్నితమైన స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది.

అరుషి ఆశకు ప్రతీక
అరుషి అంటే సూర్యుడి తొలి కిరణం. ఈ పేరు కొత్త ప్రారంభాలు, ఆశావాదాన్ని సూచిస్తుంది.

ఇషాని.. శక్తి, కరుణకు చిహ్నం
ఇషాని అనేది పార్వతి దేవి పేర్లలో ఒకటి. ఈ పేరు శక్తి, అందం, స్త్రీత్వాన్ని సూచిస్తుంది.

కావ్య.. సృజనాత్మకతను ప్రతిబింబిస్తుంది
కావ్య అంటే కవిత్వం లేదా కళాత్మక సృష్టి. ఈ పేరు సృజనాత్మకత, అందానికి ప్రతీకగా నిలుస్తుంది.

చార్వి.. అందానికి సంకేతం
చార్వి అంటే అందమైన మహిళ అని అర్థం. ఈ పేరు ఆకర్షణ, సౌందర్యాన్ని సూచిస్తుంది.

జియానా.. దేవుని కృపను తెలియజేస్తుంది
జియానా అంటే భగవంతుడి ఆశీర్వాదం అని అర్థం. కొంతమంది దీన్ని ధైర్యానికి కూడా ప్రతీకగా చూస్తారు.

తన్వి.. సున్నితత్వాన్ని సూచిస్తుంది

తన్వి అంటే సున్నితమైన, అందమైన వ్యక్తి. ఈ పేరు సరళత, హుందాతనాన్ని ప్రతిబింబిస్తుంది.

దివ్య పవిత్ర కాంతికి చిహ్నం
దివ్య అంటే దైవికమైన వెలుగు. ఈ పేరు పవిత్రత, ప్రకాశాన్ని సూచిస్తుంది.

దృష్టి జ్ఞానాన్ని సూచిస్తుంది
దృష్టి అంటే చూపు లేదా దృక్పథం. ఈ పేరు తెలివితేటలు, అవగాహనకు ప్రతీక.

నందిని ఆనందాన్ని పంచుతుంది
నందిని అంటే సంతోషాన్ని తీసుకువచ్చే వ్యక్తి. ఈ పేరు ప్రేమ, ఆనందానికి సూచిక.

నవ్య కొత్తదనానికి ప్రతీక
నవ్య అంటే కొత్తది, ప్రశంసనీయమైనది. ఈ పేరు ఉత్సాహం, సానుకూలతను ప్రతిబింబిస్తుంది.

నైరా ప్రకాశాన్ని సూచిస్తుంది
నైరా అంటే మెరుస్తూ ఉండే లేదా గులాబీ పువ్వు అని అర్థం. ఈ పేరు ఆధునికంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.

ప్రిషా.. దేవుని వరం
ప్రిషా అంటే ఆ భగవంతుడి నుంచి వచ్చిన బహుమతి. ఈ పేరు ఎంతో ప్రేమించబడే వ్యక్తిని సూచిస్తుంది.

Also Read: ఎక్కిళ్లు హఠాత్తుగా ఎందుకు వస్తాయి? శరీరంలో ఈ మార్పులే కారణం.. వెంటనే ఆపేందుకు ఇలా చేయండి

మరికొన్ని అందమైన పేర్లు

  • భవ్య అంటే గొప్పది, వైభవవంతమైనది.
  • మహిరా అంటే నైపుణ్యం కలిగిన తెలివైన వ్యక్తి.
  • మన్నత్ అంటే నోచిన నోము లేదా భగవంతుడి వద్ద కోరిన కోరిక..
  • వన్య అంటే దేవుని అమూల్యమైన కానుక.
  • సమీరా అంటే ఉదయం వీచే చల్లని గాలి లేదా మంచి స్నేహితురాలు.

పిల్లలకు పెట్టే ప్రతి పేరు ఒక ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంటుంది. అందమైన పేరు వారి జీవితానికి మంచి గుర్తింపు ఇస్తుంది. అందుకే ప్రేమతో, ఆలోచించి, మంచి భావం వచ్చే పేరును ఎంచుకోవడం ఉత్తమం.

Also Read: ఫాదర్స్ డే 2026.. మీ నాన్న ముఖంలో చిరునవ్వు చూడాలనుకుంటున్నారా? ఈ స్పెషల్ గిఫ్ట్స్ ఐడియాస్ మీ కోసమే

Related News

హైబ్రిడ్ ఫిట్‌నెస్ అంటే ఏంటి? స్టామినా, బలం రెండూ పెంచే కొత్త వర్కౌట్స్

ప్రేమలో మూడో వ్యక్తి జోక్యాన్ని సహించరు.. ఈ తేదీల్లో పుట్టినవారు చాలా పొసిసివ్

కిచెన్‌లో మీరు చేసే ఈ 9 తప్పుల వల్లే వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు..

పిల్లలు బొటనవేలు ఎందుకు చీకు తుంటారు? ఈ అలవాటు మాన్పించేందుకు ఈజీ టిప్స్ hi

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

Big Stories

Advertisement
×