BigTV English

Curry Leaves For Hair: నడుము వరకు పొడవాటి జుట్టు పెరగాలంటే.. కరివేపాకును ఇలా వాడండి

Curry Leaves For Hair: నడుము వరకు పొడవాటి జుట్టు పెరగాలంటే.. కరివేపాకును ఇలా వాడండి

Curry Leaves For Hair: నడుము వరకు పొడవాటి జుట్టు కావాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. కానీ ప్రస్తుత రోజుల్లో జుట్టురాలే సమస్యలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. జుట్టు ఊడిపోకుండా పొడవుగా పెరిగేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. బయట మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్‌ని వాడుతుంటారు. దీనివల్ల ఫలితం రావడం పక్కనపెడితే.. జుట్టుకి హానీ కలిగే ప్రమాదం ఉంది.


కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాచురల్ పదార్ధాలతో జుట్టుకు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇందుకోసం మన ఇంటి పెరట్లో దొరికే కరివేపాకు జుట్టుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి ఆరోగ్యానికే కాదు జుట్టు సంరక్షణకు కూడా చాలా మంచిది. వీటిలో అమినో యాసిడ్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టురాలడాన్ని తగ్గిస్తాయి. చుండ్రు సమస్యలను దూరం చేస్తాయి. అంతే కాదు జుట్టు పొడవుగా, సిల్కీగా ఉండేందుకు సహాయపడుతుంది. కాబట్టి మీరు కూడా దీన్ని ఉపయోగించండి. కరివేపాకు జుట్టుకు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం..

కరివేపాకు, ఉసిరితో హెయిర్ మాస్క్
జుట్టు పెరుగుదలకు కరివేపాకు, ఉసిరి అద్బుతంగా పనిచేస్తుంది. దీని కోసం ముందుగా ఉసిరికాయలను సన్నగా తరిగి.. అందులో కరివేపాకు వేసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి వాటి నుండి వచ్చే రసాన్ని తలకుపట్టించండి. గంట తర్వాత సాధారణ షాంపుతో తలస్నానం చేయండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. జుట్టు ఊడటాన్ని ఆపేసి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.


కరివేపాకు, మెంతులతో హెయిర్ మాస్క్..

పొడవాటి జుట్టు కోసం మెంతులు కూడా బాగా ఉపయోగపడతాయి. ఇందుకోసం ముందుగా మెంతులను ఐదు గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత కరివేపాకు, మెంతులు, అందులో రెండు టేబుల్ స్పూన్ పెరుగు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసి, రెండు గంటల తర్వాత సాధారణ షాంపుతో తలస్నానం చేయండి. ఇలా నెలకు రెండుసార్లు చేస్తే జుట్టు పొడవుగా పెరుగుతుంది.

Also Read: ఈ షాంపూ వాడితే.. జుట్టు రాలడం తగ్గుతుంది తెలుసా ?

కరివేపాకు, కొబ్బరి నూనె హెయిర్ మాస్క్..
జుట్టు పెరుగుదలకు కొబ్బరి నూనె, కరివేపాకు చక్కగా పనిచేస్తుంది. ఇందుకోసం ముందుగా స్టవ్ వెలిగింగి కడాయిపెట్టి కొబ్బరి నూనె.. అందులో కరివేపాకు రెమ్మలు వేసి బాగా మరిగించండి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి ఈ మిశ్రమాన్ని వడకట్టండి. ఈ ఆయిల్‌ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టేలా అప్లై చేసి.. అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాదు తెల్లజుట్టును కూడా నివారిస్తుంది.

కరివేపాకు, మందారం ఆకులు హెయిర్ మాస్క్..
కరివేపాకు, మందారం ఆకులను ముందుగా నీటితో శుభ్రం చేయాలి. ఈ రెండిటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని తలకు అప్లై చేయండి. గంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు ఒత్తుగా, సిల్కీగా పెరుగుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×