BigTV English

Herbal Tea: హెర్బల్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Herbal Tea: హెర్బల్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Herbal Tea: ఈ మధ్య కాలంలో హెర్బల్ టీలు బాగా ఫేమస్ అయ్యింది . ఇది సహజమైన మూలికలతో తయారవుతుంది. కాబట్టి, శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందని ఆయుర్వేద వైద్యులు కూడా చెబుతున్నారు. రోజూ ఒక కప్పు హెర్బల్ టీ తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటున్నారు. ఇందులో ఉండే సహజ గుణాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయట.హెర్బల్ టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఇమ్యూన్ పవర్
హెర్బల్ టీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయని అంటున్నారు. అల్లం టీ లేదా తులసి వంటి వాటితో తయారు చేసిన టీలు జలుబు, దగ్గు నుండి రక్షణ కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ హెర్బల్ టీ తాగితే రోగాలు తక్కువగా వస్తాయని అంటున్నారు.

ఒత్తిడిని తగ్గిస్తుంది
ఈ రోజుల్లో ఒత్తిడి సర్వసాధారణం అయిపోయింది. కామోమైల్ టీ, లావెండర్ టీ వంటి హెర్బల్ టీలు మనసును శాంతపరుస్తాయట. ఇవి నిద్రలేమి సమస్యను తగ్గించి, మంచి నిద్రను అందిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం సమయంలో ఒక కప్పు హెర్బల్ టీ తాగితే, మనసు రిలాక్స్ అవుతుందట.


జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
పుదీనా టీ, అల్లం టీ వంటివి జీర్ణక్రియకు చాలా మంచివని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇవి కడుపులో గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తాయని అంటున్నారు. భోజనం తర్వాత ఒక కప్పు హెర్బల్ టీ తాగడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుందట. ఇది బరువు తగ్గాలనుకునేవారికి కూడా సహాయపడుతుంది.

చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది
హెర్బల్ టీలోని యాంటీఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని డాక్టర్లు చెబుతున్నారు. గ్రీన్ టీ, రోజ్ టీ వంటివి మొటిమలు, చర్మంపై మచ్చలను తగ్గిస్తాయట. ఇవి శరీరంలోని విష పదార్థాలను తొలగించి, చర్మానికి సహజమైన కాంతిని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.

గుండె ఆరోగ్యానికి మంచిది
కొన్ని హెర్బల్ టీలు రక్తపోటును కంట్రోల్‌లో ఉంచుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. హిబిస్కస్ టీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందట. ఇది రక్త నాళాలను శుభ్రపరిచి, గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.

ALSO READ: క్యావిటీస్ లేకపోయినా పన్ను నొప్పి వస్తుందంటే ప్రమాదమే..!

సహజమైన ఔషధ గుణాలు
హెర్బల్ టీలు సహజ ఔషధాలుగా పనిచేస్తాయట. దాల్చిన టీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, తులసి టీ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుందట. ఈ టీలు ఎలాంటి రసాయనాలు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ఎలా తయారు చేయాలి?
హెర్బల్ టీ తయారీ చాలా ఈజీ. ఒక కప్పు నీళ్లను మరిగించి, అందులో పుదీనా, అల్లం, తులసి వంటి ఏవైనా ఆకులను వేయాలి. 5-10 నిమిషాలు మరిగించి, వడకట్టాలి. తేనె లేదా నిమ్మరసం జోడిస్తే రుచి మరింత పెరుగుతుందట.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×