BigTV English

Men Ear-piercing: మగవారు చెవి పోగు పెట్టుకోగానే చప్రీ అనడం కాదు.. దీని వల్ల కలిగే లాభాలు తెలుసుకోండి

Men Ear-piercing: మగవారు చెవి పోగు పెట్టుకోగానే చప్రీ అనడం కాదు.. దీని వల్ల కలిగే లాభాలు తెలుసుకోండి

Men Ear-piercing: మగవాళ్లు చెవి పోగులు పెట్టుకుంటే చూడడానికి చిల్లరగా కనిపిస్తుందని చాలా మంది అనుకుంటారు. మరికొందరైతే చెవి పోగు పెట్టుకుంటే చప్రీ మోడల్ లాగా కనిపిస్తున్నావని ఎగతాలి చేస్తారు. కానీ దీని వల్ల లాభాలు కూడా ఉన్నాయని తెలిసిన వారు చాలా అరుదుగా ఉంటారు.


చెవి పోగు పెట్టుకోవడం అనేది కేవలం సంప్రదాయంలా కనిపించినా, దీని వల్ల ఆయుర్వేదం, వైద్య పరంగా కూడా చాలా లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చెవి పోగు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

తెలుగు సంస్కృతిలో మగవాళ్లు చెవి పోగులు పెట్టుకోవడం చాలా ఏళ్ల నుంచి ఉన్న ఆచారం. పురాణాల్లో చెవి కుండలాలు పెట్టుకుంటే దేవుళ్ల శక్తి వస్తుందని చెప్పుకుంటారు. కృష్ణుడు, శివుడు లాంటి దేవుళ్లు చెవి ఆభరణాలు పెట్టుకున్న ఫోటోలు చూస్తాం కదా! ఈ ఆచారం సమాజంలో గుర్తింపును, సంప్రదాయ విలువల్ని చూపిస్తుంది. గ్రామాల్లో మగవాళ్లు పోగులు పెట్టుకుంటే వాళ్ల కుటుంబం, స్థాయి తెలుస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇది వ్యక్తిత్వానికి గౌరవం ఇవ్వడమే కాకుండా ఆకర్షణగా కూడా నిలుస్తుంది.


ఆయుర్వేదం చెప్పేదేమిటంటే, చెవి పోగులు పెట్టుకుంటే శరీరంలో శక్తి సమతుల్యంగా ఉంటుంది. చెవిలో కొన్ని పాయింట్లు శరీరంలోని భాగాలతో అనుసంధానమై ఉంటాయి. చెవికి రంధ్రం చేయించడం వల్ల ఈ పాయింట్లు ఉత్తేజితమై, రక్తం బాగా ప్రవహిస్తుంది. దీని వల్ల మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. బంగారం, వెండి పోగులు పెట్టుకుంటే చర్మ సమస్యలు తగ్గుతాయి. బంగారం శరీర ఉష్ణాన్ని నియంత్రిస్తుంది, వెండి చల్లగా ఉంచుతుంది. ఈ లోహాలు శరీరంలోని విష పదార్థాల్ని బయటకు పంపడంలో సాయపడతాయి.

ALSO READ: కాస్త దూరం నడిచినా అలసిపోతున్నారా?

ఆధునిక డాక్టర్లు చెప్పేది ఏంటంటే, చెవికి రంధ్రం చేయడం వల్ల అనేక లాభాలు వస్తాయి. ఆక్యుపంక్చర్ ప్రకారం, చెవిలో కొన్ని పాయింట్లను ఉత్తేజపరిస్తే ఒత్తిడి, నొప్పి తగ్గుతాయి. చెవి రంధ్రం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. శరీరంలో ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి, ఇవి నొప్పిని తగ్గించే సహజ రసాయనాలు. చెవి పోగులు పెట్టుకోవడం వల్ల చెవి రంధ్రం శుభ్రంగా ఉంటుంది, ఇది చెవి ఇన్ఫెక్షన్‌లను తప్పిస్తుంది. బంగారం, వెండి లాంటి లోహాలు బ్యాక్టీరియాను తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి, ఇవి చర్మ ఇన్ఫెక్షన్‌లను నివారిస్తాయి.

మగవాళ్లు చెవి పోగులు పెట్టుకోవడం వల్ల వ్యక్తిత్వానికి ఆకర్షణ తెచ్చి, ఆత్మవిశ్వాసం వంటివి పెరుగుతాయట. ఈ రోజుల్లో చెవి పోగులు ఫ్యాషన్‌లో భాగమైపోయాయి. యువతలో ఈ ట్రెండ్ బాగా హిట్ అయింది. చెవి పోగులు వ్యక్తిగత స్టైల్‌ని, సృజనాత్మకతను చూపించే మార్గంగా మారాయి.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×