Radish Leaves Benefits: ముల్లంగిని చాలా మంది వంటకాల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ముల్లంగి ఆకులను మాత్రం పడేస్తారు. ఇలా చేయడం వల్ల మీరు అనేక ప్రయోజనాలు కోల్పోతున్నారని తెలుసా ? ముల్లంగి ఆకులు కూడా ముల్లంగి దుంపలాగానే అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. వీటిని తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.
ముల్లంగి ఆకులు పోషకాలతో నిండి ఉంటాయి. డయాబెటిస్, పైల్స్, కామెర్లు వంటి అనేక వ్యాధులను వీటి ద్వారా నయం చేయవచ్చు. ఈ ఆకులలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఐరన్, సోడియం, మెగ్నీషియం, ఫోలిక్ ఆమ్లం , క్లోరిన్ లతో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్లు ఎ, బి , సి కూడా ఉంటాయి. ఈ ఆకులను సలాడ్, కూరగాయలలో తయారీలో ఉపయోగించి తినడం వల్ల మీరు అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
ముల్లంగి ఆకులు తినడం వల్ల ప్రయోజనాలు:
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
ముల్లంగి ఆకులు మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ ఆకులలో ఐరన్, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఇవి హిమోగ్లోబిన్‌ను కూడా పెంచుతాయి. రక్తహీనతతో బాధపడే వారు ముల్లంగి ఆకుల రసం తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.
జీర్ణ వ్యవస్థ బలంగా ఉంటుంది:
కొందరిలో జీర్ణవ్యవస్థ తరచుగా బలహీనపడుతుంది. ఇలాంటి సమయంలో ముల్లంగి ఆకులు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ఆకులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. వీటిని తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
చర్మ సంబంధిత సమస్యలు:
మీరు మొటిమలు, దద్దుర్లు, దురద వంటి చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే.. ముల్లంగి ఆకులను క్రమం తప్పకుండా తినాలి. ఈ ఆకులు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
పైల్స్ నుండి ఉపశమనం:
మీరు పైల్స్ సమస్యతో బాధపడుతుంటే ముల్లంగి ఆకులను క్రమం తప్పకుండా తినండి. ఇది శరీరంలోని ఈ సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది. దీంతో పాటు.. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను కలిగి ఉండటం కూడా ఈ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.
కామెర్ల నివారణ:
ముల్లంగి ఆకులు తినడం ద్వారా మీరు కామెర్ల వంటి తీవ్రమైన వ్యాధి బారి నుండి కూడా బయటపడవచ్చు. ముల్లంగి ఆకులు తినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. కామెర్లు లక్షణాలు ఉన్న ప్రారంభంలో ముల్లంగి ఆకుల రసం తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: ఈ ఆయిల్ వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది
చర్మం, జుట్టుకు మంచిది:
ముల్లంగి ఆకులతో తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల మీ జుట్టు, చర్మం రెండూ మెరుగుపడతాయి. ఈ ఆకుకూరలో అనేక రకాల విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అందుకే ఇవి జుట్టు , చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే.. వీటిలో ఉండే ఐరన్, మెగ్నీషియం కారణంగా.. మీ మానసిక స్థితి కూడా బాగుంటుంది. ప్రతిరోజూ ఒక కప్పు ముల్లంగి ఆకులు తినడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి.