BigTV English

Realme 13 Pro+: ఇచ్చిపడేశాడు భయ్యా.. కొత్త కలర్‌లో రియల్‌మి ఫోన్ లాంచ్, రూ.3000 డిస్కౌంట్‌ కూడా, కెమెరా హైలైట్!

Realme 13 Pro+: ఇచ్చిపడేశాడు భయ్యా.. కొత్త కలర్‌లో రియల్‌మి ఫోన్ లాంచ్, రూ.3000 డిస్కౌంట్‌ కూడా, కెమెరా హైలైట్!

Realme 13 Pro+: ఇప్పటికీ ఎన్నో మొబైళ్లను దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి. కొత్త కొత్త ఫోన్లను అధునాతన ఫీచర్లతో రిలీజ్ చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఎన్నో మోడళ్లను తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు అదే తరహాలో పరుగులు పెడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ పెరగడంతో రకరకాల వేరియంట్లు, కలర్‌లలో ఫోన్లను తీసుకొస్తుంది. ఇటీవలే Realme 13 Pro+ 5G స్మార్ట్‌ఫోన్‌ను జూలై 30న Realme 13 Pro 5Gతో పాటు భారతదేశంలో లాంచ్ చేసింది కంపెనీ.


ఈ హ్యాండ్‌సెట్ Snapdragon 7s Gen 2 SoC ద్వారా ఆధారితమైనది. గరిష్టంగా 12GB RAMతో వచ్చింది. ఇది 6.7-అంగుళాల పూర్తి HD+ AMOLED స్క్రీన్, 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. లాంచ్ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ దేశంలో రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఆ కలర్స్‌కి సూపర్ డూపర్ రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ఇది మూడవ షేడ్‌లో కూడా అందించబడుతోంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ పర్పుల్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు దీని ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించి ఇతర వివరాలు తెలుసుకుందాం.

Realme 13 Pro+ 5G Price


Realme 13 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ తాజాగా పర్పుల్ ‌కలర్ వేరియంట్‌లో లాంచ్ అయింది. దీనిని సెప్టెంబర్ 2 మధ్యాహ్నం 12 గంటల నుండి భారతదేశంలో Flipkart, Realme India వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ మెయిన్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొత్త Monet పర్పుల్ కలర్ ఫోన్‌ను కొనుక్కోవచ్చు. భారతదేశంలో Realme 13 Pro+ 5G మూడు వేరియంట్లలో లభిస్తుంది. అందులో 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 32,999 నుండి ప్రారంభమవుతుంది.

Also Read: కిక్కే కిక్కు.. మోటో ఫోన్‌పై రూ.10000 డిస్కౌంట్, ఆఫర్ అదిరిపోయిందంతే!

అదే సమయంలో 12GB + 256GB ధర రూ.34,999గా నిర్ణయించబడింది. ఇక టాప్ 12GB + 512GB వేరియంట్‌ల రూ. 36,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్ 2 మధ్యాహ్నం, అర్ధరాత్రి మధ్య మోనెట్ పర్పుల్ కలర్‌ ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ. 3,000 బ్యాంక్ తగ్గింపును పొందుతారని Realme ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు పాత ఫోన్‌ని ఎక్స్‌ఛేంజ్ చేసుకునే వారికి రూ.4,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా ఇవ్వనున్నారు. బ్యాంక్ ఆఫర్ ఈ ప్రత్యేక వ్యవధిలో మాత్రమే చెల్లుబాటు అవుతుందని, కొత్త పర్పుల్ కలర్ వేరియంట్‌పై మాత్రమే ఉంటుందని గుర్తుంచుకోండి.

Realme 13 Pro+ 5G Specifications

Realme 13 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల 120Hz పూర్తి HD+ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్‌తో సహా 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, అల్ట్రావైడ్ లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ సెన్సార్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇందులో Snapdragon 7s Gen 2 SoC ప్రాసెసర్ అందించబడింది. Realme 13 Pro+ 5G Android 14-ఆధారిత Realme UI 5.0పై పనిచేస్తుంది. 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5200mAh బ్యాటరీతో వస్తుంది.

Related News

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

Vivo Y400 vs iQOO Z10R vs OnePlus Nord CE 5: రూ.25,000 లోపు బడ్జెట్ లో ఏది బెస్ట్?

iPhone 17 Pro GPT-5: ఐఫోన్ 17 ప్రోలో చాట్ జిపిటి-5.. ఆపిల్ సంచలన ప్రకటన

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Big Stories

×