Best Hair Serum: హెయిర్ సీరం జుట్టు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని సహజ పదార్థాలను ఉపయోగించి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
ఈ రోజుల్లో చాలా మంది హెయిర్ సీరంలను వాడుతున్నారు. కానీ మార్కెట్లో లభించే సీరమ్‌లు ఖరీదైనవి. అంతే కాకుండా వీటిని వివిధ రకాల రసాయనాలతో తయారు చేస్తుంటారు. వీటిని ఎక్కువగా వాడటం వల్ల జుట్టు దెబ్బతింటుంది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇంట్లోనే సహజ పదార్ధాలతో హెయిర్ సీరం తయారు చేసి వాడటం మంచిది. ఇది మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా డబ్బు ఖర్చు కాకుండా ఉపయోగపడుతుంది.
ఇంట్లో తయారుచేసిన హెయిర్ సీరం పూర్తిగా రసాయనాలు లేనిది. కాబట్టి మీరు మీ జుట్టు అవసరాలకు అనుగుణంగా ఉపయోగించవచ్చు. అంతే కాకుండా ఇది జుట్టును మెరిసేలా, నునుపుగా, బలంగా చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు హెయిర్ సీరం ఇంట్లోనే ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లోనే హెయిర్ సీరం ఎలా తయారు చేసుకోవాలి ?
కావాల్సినవి:
అలోవెరా జెల్ – 2 టేబుల్ స్పూన్లు
కొబ్బరి నూనె – 1 టేబుల్ స్పూన్
రోజ్ వాటర్ – 2 టేబుల్ స్పూన్లు
విటమిన్ ఇ క్యాప్యూల్స్ – 2
లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ – 4-5 చుక్కలు (వీలైతే)
తయారు చేసే విధానం:
ఒక గిన్నెలో కలబంద జెల్ తీసుకుని దానికి కొబ్బరి నూనె, రోజ్ వాటర్ కలపండి. ఇప్పుడు రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ కట్ చేసి దాని నూనెను మిశ్రమానికి కలపండి.
మీకు కావాలంటే.. మీరు దానికి 4-5 చుక్కల లావెండర్ ఆయిల్ కూడా కలుపుకోవచ్చు. తద్వారా జుట్టుకు మంచి సువాసన, అదనపు సంరక్షణ లభిస్తుంది. అన్ని పదార్థాలను బాగా కలిపి మృదువైన సీరం తయారు చేసుకోండి. దానిని శుభ్రమైన డ్రాపర్ బాటిల్‌లో నింపి ఫ్రిజ్‌లో నిల్వ చేయండి. ఇది 7-10 రోజులు ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి ?
షాంపూ చేసిన తర్వాత.. కొద్దిగా తడిగా ఉన్న జుట్టుకు కొద్ది మొత్తంలో సీరం తీసుకొని, జుట్టు చివర్ల నుండి పైభాగం వరకు సున్నితంగా అప్లై చేయండి. తలకు అప్లై చేయకూడదు.
Also Read: కరివేపాకులో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది
హెయిర్ సీరం యొక్క ప్రయోజనాలు:
జుట్టును నునుపుగా, మెరిసేలా చేస్తుంది:
కలబంద, కొబ్బరి నూనె జుట్టును లోతుగా తేమ చేస్తాయి. జుట్టును ముడతలు పడకుండా, మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా జుట్టు రాలకుండా చేస్తుంది.
చివర్లు చిట్లడం నుండి ఉపశమనం:
విటమిన్ ఇ నూనె వల్ల జుట్టు బలపడుతుంది. అంతే కాకుండా ఇది జుట్టు చిట్లడాన్ని నివారిస్తుంది. జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది.
మీ జుట్టును డీటాక్సిఫై చేసి చల్లబరుస్తుంది:
రోజ్ వాటర్ జుట్టును చల్లబరుస్తుంది. అంతే కాకుండా ఇది తలకు తాజాదనాన్ని ఇస్తుంది. ఇది జుట్టు మూలాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
సహజ సువాసన, ఉత్తేజకరమైన అనుభూతి:
లావెండర్ ఆయిల్ జుట్టుకు మంచి వాసనను అందిస్తుంది. అంతే కాకుండా ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.