BigTV English

G7 Warn Iran: ఇరాన్ వల్లే ఉగ్రవాదం.. ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించిన జీ7 దేశాలు

G7 Warn Iran: ఇరాన్ వల్లే ఉగ్రవాదం.. ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించిన జీ7 దేశాలు

G7 Warn Iran Support Israel| ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధం కారణంగా ప్రపంచదేశాలన్నీ అందోళనలో ఉన్నాయి. ఇరాన్ లాంటి భారీ ఆయుధ సామాగ్రి కల దేశంతో ఇజ్రాయెల్ నేరుగా ఢీకొనడంతో.. ఇరు వైపులా గత అయిదు రోజులుగా యుద్దం తీవ్రంగా సాగుతోంది. ఇరు దేశాలు ఒకరిపై మరొకరు భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ లో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోగా.. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో వందల సంఖ్యలో అమాయకులు మరణించారు. ఇటువంటి పరిస్థితుల్లో జి 7 దేశాలు (G7 Countries) సమావేశమయ్యాయి. సోమవారం జరిగిన ఈ కీలక సమావేశం తరువాత జీ7 దేశాలన్నీ సంయుక్తంగా ప్రకటన జారీ చేశాయి.


ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్నట్లు, ఇరాన్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నాయి. ప్రస్తుతం జీ7 నాయకులు కెనడాలోని రాకీ మౌంటైన్స్‌లో ఒక సదస్సులో సమావేశమవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా సోమవారం రాత్రి ఈ సదస్సులో కార్యక్రమాలను త్వరగా ముగించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అంతకుముందే.. అమెరికా ఈ ప్రకటనపై సంతకం చేసింది.

జీ7 ప్రకటనలో ముఖ్యాంశాలు
జీ7 సమూహంలో సభ్య దేశాలు.. అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ.. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. “జీ7 నాయకులైన మేము.. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నాము,” అని ప్రకటనలో పేర్కొన్నారు.


ఈ సందర్భంంగా.. ఇజ్రాయెల్‌కు తనను తాను రక్షించుకునే అధికారం ఉందని, ఇజ్రాయెల్ భద్రతకు తాము మద్దతు ఇస్తామని జీ7 దేశాలు తెలిపాయి. అదే సమయంలో, మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అస్థిరత, ఉగ్రవాదానికి మూల కారణం ఇరాన్ అని ఆరోపించాయి. “ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదని మేము స్పష్టంగా చెప్పాం.” అని జీ7 పేర్కొంది.

యుద్ధాలకు రష్యా, ఇరాన్ దేశాలే కారణం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఇరాన్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. రష్యా, ఇరాన్ మిత్రదేశాలు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న సమయంలో ఇరాన్ ఆయుధాలు, యుద్ధ సామగ్రిని సరఫరా చేస్తోంది. ఈ నేపథ్యంలో.. ఇరాన్ సంక్షోభం పరిష్కారం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి దారితీయాలని, గాజాలో కాల్పుల విరమణ జరగాలని కోరుకుంటున్నట్లు జీ7 దేశాలు తెలిపాయి.

ఇరాన్, ఇజ్రాయెల్ శత్రుత్వానికి మూలం అదే..
గత వారం ఇరాన్ అణు బాంబు తయారీ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ సైన్యంలోని సీనియర్ సభ్యులు, శాస్త్రవేత్తలను చనిపోయారు. దీంతో ఈ తాజా సంఘర్షణ ప్రారంభమైంది. ఈ దాడులు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. అయితే, ఈ దాడుల ప్రభావం ఇంతవరకు చమురు ధరలపై పడలేదు. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి చమురు ధరల్లో పెద్దగా మార్పు లేదు. కానీ ఇరాన్ తలుచుకుంటే యురోప్, ఇతర దేశాలకు సముద్ర మార్గంలో వెళుతున్న చమురును అడ్డుకోగలదు. అప్పుడు చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది.

Also Read: అమెరికా ఆ పని చేస్తేనే యుద్ధం ముగింపు.. కాల్పుల విరమణకు కండీషన్ పెట్టిన ఇరాన్

చమురు ధరలపై జీ7 దృష్టి
జీ7 దేశాలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై ఈ సంఘర్షణ ప్రభావాన్ని గమనిస్తున్నాయి. “మేము అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లపై ప్రభావాన్ని గమనిస్తున్నామ. మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడటానికి సమాన ఆలోచనలు కలిగిన భాగస్వాములతో కలిసి సమన్వయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం,” అని జీ7 ప్రకటనలో తెలిపాయి. ఇరాన్ అణు ఆయుధాలను కలిగి ఉండకూడదని, శాంతి కోసం చర్చలు జరగాలని జీ7 దేశాలు నొక్కి చెప్పాయి.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×