Sugar Control Tips: భారతదేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. చాలా మంది ప్రతిరోజూ వారి చక్కెర స్థాయి పదే పదే 350 mg/dL దాటే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది సాధారణం కంటే చాలా ఎక్కువ అంతే కాకుండా ప్రమాదకరమైన పరిస్థితి. దీనిని సకాలంలో నియంత్రించకపోతే.. గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, కంటి చూపు కోల్పోవడం వంటి తీవ్రమైన సమస్యలు వస్తుంటాయి.
మంచి విషయం ఏమిటంటే మధుమేహాన్ని పూర్తిగా నిర్మూలించలేకపోయినా.. దానిని ఖచ్చితంగా నియంత్రించవచ్చు. పదే పదే రక్తంలో అధిక చక్కెర స్థాయిని నియంత్రించగల 5 ప్రభావ వంతమైన మార్గాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చక్కెరను తగ్గించే టిప్స్ :
1. క్రమం తప్పకుండా నడక, వ్యాయామం:
షుగర్ నియంత్రించడానికి సులభమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గం క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం. ప్రతిరోజూ 30-45 నిమిషాల నడక లేదా వ్యాయామం శరీర ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది . అంతే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. కపలాభతి, మండూకాసన వంటి యోగాసనాలు కూడా షుగర్ కంట్రోల్ చేయడంలో కూడా ఉపయోగపడతాయి. ప్రతి రోజు వాకింగ్ చేసే వారిలో షుగర్ కంట్రోల్ లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
2. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ :
మీ ఆహారంలో తెల్ల బియ్యం, చక్కెర, శుద్ధి చేసిన పిండి , బంగాళదుంపలు వంటి అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలను నివారించండి. బదులుగా.. తృణధాన్యాలు, బ్రౌన్ రైస్, పప్పులు, ఆకుపచ్చ కూరగాయలు , సలాడ్లను చేర్చండి. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. అంతే కాకుండా రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుతాయి.
3. మెంతి గింజలు తినండి:
మెంతులు ఇన్సులిన్ బాగా పనిచేయడానికి సహాయపడతాయి. రాత్రిపూట 1 టీస్పూన్ మెంతులు నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా మెరుగు పరుస్తుందని తేలింది. మెంతి గింజలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కూడా అనేక లాభాలు ఉంటాయి. అంతే కాకుండా షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.
Also Read: వెల్లుల్లి తినడం వల్ల కలిగే నష్టాలివే !
4. ఒత్తిడిని తగ్గించండి:
ఒత్తిడి హార్మోన్ ‘కార్టిసాల్’ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ధ్యానం, ప్రాణాయామం, సంగీతం వినడం లేదా ఇష్టమైన పనులను చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చు. ఇది మధుమేహంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే వీలైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఒత్తిడిని తగ్గించే ప్రత్యామ్నాయాలను కూడా ఎంచుకోవడం మీకు మేలు చేస్తుంది.
5. వేప, కాకరకాయ రసం:
వేప , కాకరకాయ రెండూ రక్తంలో చక్కెరను తగ్గించే సహజ పదార్థాలు. ఉదయం ఖాళీ కడుపుతో 30 మి.లీ కాకరకాయ, వేప రసం కలిపి తాగడం వల్ల చక్కెర స్థాయి త్వరగా నియంత్రించబడుతుంది. వీటిని తరచుగా తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆహారంలో కాకర కాయను చేర్చుకోవడం వల్ల కూడా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. తినే ఆహార పదార్థాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.