E-Paper

భారత్‌ లో బెంజ్ ఎస్-క్లాస్ లాంచ్.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

భారత్‌ లో బెంజ్ ఎస్-క్లాస్ లాంచ్.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Advertisement

New Benz S-Class Launched: లగ్జరీ కార్ల తయారీలో దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ తన ఫ్లాగ్‌ షిప్ సెడాన్ 2026 ఎస్ క్లాస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ప్రారంభ ధర రూ.2.20 కోట్లు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. టాప్ వేరియంట్ ధర రూ.2.38 కోట్ల వరకు ఉంది. కొత్త ఎస్ క్లాస్‌ లో డిజైన్ అప్‌ డేట్స్‌ తో పాటు అత్యాధునిక టెక్నాలజీ, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్ లాంటి కీలక మార్పులు చేసింది. ఈసారి భారత మార్కెట్లో ఎస్ 450e ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వేరియంట్‌ ను మాత్రమే అందిస్తున్నారు. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ కారు డెలివరీలు 2026 చివరి క్వార్టర్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

ఇంజిన్, రేంజ్ గురించి..

కొత్త ఎస్ 450eలో 3.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ తో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌ ను జత చేశారు. ఈ హైబ్రిడ్ వ్యవస్థ మొత్తం కలిపి 435 హెచ్‌పీ పవర్, 680 ఎన్ఎం టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ద్వారా రియర్ వీల్స్ కు చేరుతుంది. ఈ కారు కేవలం బ్యాటరీ పవర్ తోనే 115 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. అంతేకాదు, ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.7 సెకన్లలో అందుకుంటుంది. 22kWh బ్యాటరీ ప్యాక్‌ ను ఫాస్ట్ ఛార్జర్‌తో 20 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ కారు 32.2 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

డిజైన్ గురించి..

Advertisement

డిజైన్ పరంగా కొత్త ఎస్ క్లాస్ మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. ముందు భాగంలో పెద్ద క్రోమ్ గ్రిల్, కొత్త LED హెడ్‌ ల్యాంప్స్, ప్రత్యేక స్టార్ ఆకార లైటింగ్ ఎలిమెంట్స్ మరింతగా ఆకట్టుకుంటుంది. వెనుక భాగంలో కూడా కొత్త టెయిల్ ల్యాంప్స్, డైనమిక్ లైటింగ్ ఎఫెక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. కొత్త అల్లాయ్ వీల్స్, అడిషనల్ కలర్ ఆప్షన్లు కూడా ఈ మోడల్‌ లో అందుబాటులో ఉన్నాయి.

మరింత విలాసవంతమైన అనుభూతి

ఇంటీరియర్‌ లో మెర్సిడెస్ మరింత విలాసవంతమైన అనుభూతిని అందించేలా మార్పులు చేసింది. కొత్త డాష్‌ బోర్డ్ డిజైన్, అప్‌ డేటెడ్ సెంటర్ కన్సోల్, ప్రీమియం మెటీరియల్స్ క్యాబిన్‌ ను మరింత ఆకర్షణీయంగా మర్చారు. దేశంలో లాంగ్ వీల్‌ బేస్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉండటంతో వెనుక సీట్లలో ప్రయాణికులకు విశాలమైన స్థలం లభిస్తుంది. వెనుక సీట్లలో రిక్లైనింగ్ ఫీచర్, వెంటిలేషన్, హీటింగ్, మసాజ్ ఫంక్షన్లు అందుబాటులో ఉన్నాయి. క్యాబిన్‌ లో శబ్దాన్ని తగ్గించే ప్రత్యేక ఇన్సులేషన్‌ను కూడా మెరుగుపరిచారు. మంచి యాంబియంట్ లైటింగ్ వ్యవస్థ రాత్రి సమయంలో ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది.

టెక్నాలజీ గురించి..

Advertisement

టెక్నాలజీ విషయానికి వస్తే, కొత్త MBUX సూపర్‌ స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. ఇందులో 14.4 అంగుళాల OLED టచ్‌ స్క్రీన్, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, ముందు ప్రయాణికుడి కోసం ప్రత్యేక స్క్రీన్ ఉన్నాయి. AI ఆధారిత వర్చువల్ అసిస్టెంట్, OTA అప్‌ డేట్స్, గూగుల్ మ్యాప్స్‌ తో కూడిన హెడ్ అప్ డిస్‌ ప్లే కూడా అందుబాటులో ఉన్నాయి.  భద్రత కోసం అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ కీప్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, మల్టిపుల్ ఎయిర్‌ బ్యాగ్స్ లాంటి అత్యాధునిక ఫీచర్లను అందించారు. 2026 ఎస్ క్లాస్ లగ్జరీ, సౌకర్యం, టెక్నాలజీ పరంగా మరోసారి తన రేంజ్ ను నిలబెట్టుకుంది.

Read Also: ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Related News

బెంజ్ To ఎంజీ.. ఈ ఏడాది లాంచ్ కానున్న క్రేజీ PHEV కార్లు ఇవే!

కియా సెల్టోస్ vs రెనాల్ట్ డస్టర్.. ఏసీలో ఏ SUV బెటర్?

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులపై క్రేజీ ఆఫర్లు.. ఎన్ని వేలు డిస్కౌంట్ ఇస్తుందంటే!

టయోటా హిలక్స్ స్పై షాట్స్ లీక్, లుక్ అదిరింది భయ్యా!

కవాసకి నింజా బైక్‌లపై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ.2.89 లక్షల వరకు తగ్గింపు!

సెకండ్‌ హ్యాండ్ ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్.. పెట్రోల్ కార్ల కంటే వేగంగా పెరుగుతున్న రేట్లు!

×