Blood Pressure Foods| అధిక రక్తపోటు లేదా హై బిపి లాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. రక్తపోటు పెరిగిపోతే గుండెలని రక్తనాళాలు, గుండె పై ఒత్తిగి బాగా పెరిగిపోతుంది. దాని వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది ప్రాణాంతకంగా కూడా మారుతుంది. సాధారణంగా రక్త పోటు అంటే బిపి 120/80 mmHg కంటే తక్కువ స్థాయిలో ఉండాలి. ఈ స్థాయిని దాటితే హై బిపి (హైపర్‌టెన్షన్) అని అంటారు. అధిక రక్తపోటు నివారణ కోసం ఆయుర్వేద ప్రకారం.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం ముఖ్యంగా ఆహార నియమాలు పాటించాలి. ఏవి తినాలి, ఏవి తినకూడదో తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ సమస్యకు నివారణ కోసం ఇది చాలా అవసరం.
రక్తపోటు నియంత్రణ కోసం ఇవి తినాలి
1. డ్రై ఫ్రూట్ నట్స్..
డ్రై ఫ్రూట్ నట్స్ తినడం వల్ల అధిక రక్తపోటు ఉన్నవారికి ప్రయోజనం కలుగుతుంది. ఇందులో లభించే ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే హై బిపి ఉన్నవారు డ్రై ఫ్రూట్ నట్స్ నిత్య ఆహారంగా తీసుకోవాలి. ముఖ్యంగా బాదం పప్పు, వాల్ నట్స్ ని రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని విసర్జించేసి బాదం, వాల్ నట్స్ ని పడికడుపున తినేయాలి.
2.కూరగాయలు తినాలి
రక్తపోటు అధికంగా ఉంటే ఆహారంలో ఎక్కువగా కూరగాయలు బాగా తినాలి. కానీ వంట చేసే సమయంలో అందులో ఉప్పు తక్కువగా ఉండాలి. కూరగాయలు గ్రేవి లాగా చేసుకొని తింటే అధిక రక్త పోటుతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది.
3.పండ్లు బాగా తినాలి
అధిక రక్తపోటుతో మీరు బాధపడుతుంటే అప్పుడు మీరు కూరగాయలు, పండ్లు లాంటివి తినడం తప్పనిసరి. ఎందుకంటే ఫ్రూట్స్ లో విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ లాంటివి ఉంటాయి ఇవి అనారోగ్యాల బారిన పడుకుండా కాపాడుతాయి. పండ్లు రోజూ తింటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ పండ్లలో కూడా మరీ తియ్యగా ఉండే వాటిని తక్కువగా తినాలి. లేదా బిపి, డయాబెటీస్ లాంటి సమస్యలతో బాధపడేవారు తినకూడదు. ఇవి తినడం వల్ల బిపి మరింత తీవ్రమవుతుంది.
4.జొన్న పిండి
జొన్నపిండి హైబిపి ఉన్నవారికి ఎంతో ఆరోగ్యకరం. అందుకే రక్తపోటు అధికంగా ఉంటే తప్పకుండా జొన్న పిండి వంటకాలు తీసుకోవాలి. ఇందులో శరీరంలోని మలినాలను తొలగించే గుణం ఉంది. జొన్న పిండి తో చేసుకునే రొట్టెలు రోజూ తింటే శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి. ఫలితంగా హై బిపి కంట్రోల్ లోకి వస్తుంది.
Also Read: ప్రోటీన్ ఫుడ్స్ తినడం హానికరం.. ఆ వ్యాధులు ఉన్నవారు అసలు తినకూడదు
ఏవి తినకూడదు?
హై బిపి సమస్యతో బాధపడేవారు ఉప్పు తక్కువగా తినాలి. ఇందులోని సోడియం.. రక్తపోటుని తీవ్రంగా పెంచేస్తుంది. వీటితో పాటు స్పైసీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినడం మానుకోవాలి. హై బిపి ఉన్నవారు ఖాళీ కడుపున టీ తాగే అలవాటు మానుకోవాలి. సమయానికి తినాలి, మితంగా తినాలి. సాయంత్రం 7 గంటల లోపు డిన్నర్ పూర్తిచేయాలి.
ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.