BigTV English

Carrot Badusha: క్యారెట్లతో బాదుషా చేశారంటే రుచి అదిరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Carrot Badusha: క్యారెట్లతో బాదుషా చేశారంటే రుచి అదిరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Carrot Badusha: క్యారెట్ల తో చేసే స్వీట్లు టేస్టీగా ఉంటాయి. ఎక్కువగా క్యారెట్ హల్వాని అధికంగా చేస్తూ ఉంటారు. ఒకసారి క్యారెట్ బాదుషా కూడా చేసి చూడండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. సహజమైన తీపి రుచిని తెలిసేలా చేస్తుంది. క్యారెట్లతో బాదుషా చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా చేసేయొచ్చు.


క్యారెట్ బాదుషా రెసిపీకి కావలసిన పదార్థాలు
క్యారెట్లు – కిలో
మైదాపిండి – వంద గ్రాములు
పంచదార – 150 గ్రాములు
యాలకులు – ఆరు
పైనాపిల్ ఎసెన్స్ – మూడు చుక్కలు
ఆరెంజ్ రంగు – చిటికెడు
నూనె – వేయించేందుకు సరిపడా

క్యారెట్ బాదుషా రెసిపీ
1. క్యారెట్ బాదుషా చేసేందుకు ముందుగా క్యారెట్లను కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించండి.
2. తరువాత వాటిని ఒక గిన్నెలో వేసి మెత్తగా పేస్టులా చేసేయండి.
3. ఆ పేస్టులోనే యాలకుల పొడి, పైనాపిల్ ఎసెన్స్, మైదాపిండి, రెండు చెంచాల నెయ్యి, ఆరెంజ్ రంగు వేసి బాగా కలపండి.
4. ఇది చపాతి పిండిలాగా గట్టిగా కలపాలి. నీళ్లు అవసరం పడవు.
5. ఈ పిండిని చిన్న చిన్న భాగాలుగా చేసి లడ్డూల్లా చేసుకోండి.
6. ఒక లడ్డూను తీసుకుని చేతులతోనే బాదుషా ఆకారంలో నొక్కండి.
7. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
8. కొందరు నూనెకి బదులు డాల్డాను కూడా వేస్తారు.
9. అందులో క్యారెట్ బాదుషాలను వేయించాలి.
10. అవి రంగు మారేవరకు వేయించాక తీసి పక్కన పెట్టుకోవాలి.11. మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి పంచదారను వేసి తీగపాకం తీయాలి.
12. ఆ పాకంలోనే క్యారెట్ బాదుషాలను వేసి ఉంచాలి.
13. అవి పంచదార పాకాన్ని పీల్చుకొని టేస్టీగా మారుతాయి.
14. అంతే టేస్టీ క్యారెట్ బాదుషా రెడీ అయినట్టే.
15. ఇంటికి ఇంట్లో విందులు, వేడుకలు పండగల సమయంలో వచ్చే అతిధులకు వీటిని వడ్డిస్తే కొత్త రుచితో పాటు టేస్టీగా ఉంటాయి.


Also Read: చపాతీలు మిగిలిపోతే వాటిని బయటపడేసే కన్నా.. వీటిని వండేయండి

బాదుషాలను పూర్తిగా మైదా పిండితో చేస్తూ ఉంటారు. మైదా పిండితో బాదుషాలు చేసే కన్నా ఇలా క్యారెట్లు కలిపి చేయడం వల్ల ఆరోగ్యానికి కొంత మేలు జరుగుతుంది. క్యారెట్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చేరే హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి మన అవయవాలను కాపాడతాయి. క్యారెట్లు తినడం వల్ల అధిక రక్తపోటు, గుండెజబ్బులు, క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. అయితే క్యారెట్లను ఇలా స్వీట్ రూపంలో కాకుండా నేరుగా క్యారెట్ల లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది. పచ్చి క్యారెట్లను ప్రతిరోజూ ఒకటి తినండి చాలు. నెల రోజుల్లోనే మీ ఆరోగ్యంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా చర్మకాంతి పెరుగుతుంది. కంటిచూపు మెరుగుపడుతుంది.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×