Summer Born: వేవేసవి కాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఈ సమయంలో పుట్టిన పిల్లలకు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అప్పుడే పుట్టిన పిల్లల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. దీంతో వేసవిలో వచ్చే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ప్రభావం చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపుతాయని డాక్టర్లు చెబుతున్నారు.
డీహైడ్రేషన్
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, ఎక్కువ వేడి కారణంగా శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం చాలా సాధారణం. అప్పుడే పుట్టిన పిల్లలు నీళ్లు కూడా ఎక్కువగా తాగే అవకాశం ఉండదు. దీంతో వీరిలో డీహైడ్రేషన్ సమస్యలు మరింత తలెత్తే అవకాశముందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలు తాగే వయసులో పిల్లలు ఉన్నప్పుడు శరీనానికి నీరు చాలా అవసరం అవుతుంది. అదే సమయంలో నూనె, గోధుమ పిండి వంటి వాటిని ఇస్తే డీ హైడ్రేషన్ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
వడదెబ్బ
వేసవి వేడి వల్ల చాలా మంది పిల్లలకు త్వరగా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న చిన్నారుల్లో శరీర ఉష్ణోగ్ర 104°Fకి కంటే ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందట. ఇది జీవన విధానాన్ని మరింత కష్టతరం చేస్తుంది. శరీరంలో డీహైడ్రెేషన్, చెమట వల్ల తీవ్రమైన అలసట వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
ఎగ్జిమా
వేసవిలో, వేడి కారణంగా పిల్లల చర్మం కూడా ఎక్కువగా ప్రభావితమవుతుంది. అధిక వేడి వల్ల చిన్నారుల్లో ఎగ్జిమా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అప్పటికప్పుడు పెరుగుతున్న చర్మ శిరోజాలు, చర్మం చాలా సున్నితంగా ఉంటాయి. అలాంటి సమయంలో డీహైడ్రేషన్ సమస్య కూడా వస్తే చర్మం పొడిబారిపోవడం, చర్మం చీలిపోవడం వల్ల గాయాలు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు.
శ్వాసకోశ సమస్యలు
వేసవి కాలంలో గాలిలో ఉండే ధూళి, పొల్యూషన్ కారణంగా చిన్న పిల్లలకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల చిన్నారుల్లో అస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల వంటివి కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరికొందరు చిన్నారుల్లో అలెర్జీ, గొంతు నొప్పి కూడా కనిపించే ఛాన్స్ ఉందట.
కళ్లు తిరగడం
పిల్లల శరీరంలో వేడి వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. దీనివల్ల వారు ఎప్పుడూ మందులు, స్వల్ప ఆరోగ్య లక్షణాలు వస్తాయట. కొందరికి సడన్‌గా మత్తు, తల తిరుగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.
ALSO READ: సమ్మర్‌లో జుట్టును కాపాడుకోండిలా..!
ఏం చేస్తే సేఫ్..?
చిన్నారులకు పాలు ఇచ్చే తల్లులు అధికంగా కారం, మసాలాలు ఉండే ఆహాన్ని తీసుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తల్లుల దగ్గర పాలు తాగడం వల్ల చిన్నారుల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందంట. పాలిచ్చే తల్లులు తీసుకునే ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వేసవిలో పిల్లలకు ప్రతి కొద్ది గంటలు నీరు లేదా పాలు ఇవ్వడం అవసరం. వేడి కారణంగా ఉష్ణోగ్రత తగ్గించేందుకు శరీరంలో వేడిని తగ్గించేందుకు సహాయపడే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
చిన్న పిల్లల్లో జ్వరం, వాపు, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే డాక్టర్‌ని సంప్రదించాలి. చిన్నారులను వేడి నుంచి రక్షించాలంటే లైట్ కలర్ బట్టలు వేయడం మంచిది. వేసవిలో ఎల్లప్పుడూ పిల్లల చర్మం మురికి లేకుండా, వారిని శుభ్రంగా ఉంచడం అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.