E-Paper
Advertisement

ఎప్పుడూ చిరాకుగా, అలసటగా అనిపిస్తోందా? క్రోనిక్ స్ట్రెస్ లక్షణాలు ఇవే

ఎప్పుడూ చిరాకుగా, అలసటగా అనిపిస్తోందా? క్రోనిక్ స్ట్రెస్ లక్షణాలు ఇవే
Advertisement

Chronic stress symptoms| రోజంతా పనులతో బిజీగా ఉండటం, బాధ్యతలు పెరగడం, వ్యక్తిగత సమస్యలు ఎదురవడం సహజమే. అయితే ఒత్తిడి రోజులు, వారాలు, నెలల పాటు తగ్గకుండా కొనసాగితే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడూ అలసటగా ఉండటం, చిన్న విషయాలకే చిరాకు రావడం కూడా దీని సంకేతాలు కావచ్చు. ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడిని సాధారణంగా క్రోనిక్ స్ట్రెస్ అంటారు. ఇది శరీరంతో పాటు మనసుపైనా ప్రభావం చూపుతుంది.

క్రోనిక్ స్ట్రెస్ అంటే ఏంటి?

ఒత్తిడి కొన్ని సందర్భాల్లో శరీరానికి సహజమైన ప్రతిస్పందనగా ఉంటుంది. సమస్య పరిష్కారమైన తర్వాత సాధారణంగా ఒత్తిడి తగ్గిపోతుంది.
అయితే సమస్యలు లేదా ఒత్తిడి ఎక్కువకాలం కొనసాగితే శరీరం నిరంతరం అప్రమత్తంగా ఉంటుంది. దీంతో నిద్ర, శక్తి, ఏకాగ్రత, మానసిక స్థితిపై ప్రభావం పడవచ్చు. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు వంటి కారణాలు దీర్ఘకాలిక ఒత్తిడికి దారితీయవచ్చు.

క్రోనిక్ స్ట్రెస్ వల్ల కార్టిసోల్ లెవెల్స్ ప్రభావితం

Advertisement

డాక్టర్ దీప్తాంశు అగర్వాల్ ప్రకారం.. దీర్ఘకాలిక ఒత్తిడి.. శరీరంలో కార్టిసోల్ లెవెల్స్ పెంచుతుంది. కార్టిసోల్‌‌‌ని సాధారణంగా స్ట్రెస్ హార్మోన్ అని పిలుస్తారు. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో శరీరం సహజంగానే ఈ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఒత్తిడి ఎక్కువకాలం కొనసాగితే ఈ ప్రక్రియ కూడా ఎక్కువకాలం కొనసాగవచ్చు. దీంతో అలసట, తక్కువ ఎనర్జీ, చిరాకు వంటి సమస్యలు కనిపిస్తాయి. రోజువారీ పనులు చేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది.

రోజువారీ పనులపై ఆసక్తి తగ్గడం కూడా సంకేతం

క్రోనిక్ స్ట్రెస్ ఉన్నప్పుడు గతంలో సులభంగా చేసిన పనులపై ఆసక్తి తగ్గుతుంది. ఎప్పుడూ నీరసంగా అనిపించడం లేదా ఏ పనిపైనా దృష్టి పెట్టలేకపోవడం కనిపించే అవకాశం ఉంది. కొంతమందికి ఏకాగ్రత, ఉత్సాహం, పని పూర్తి చేసే సామర్థ్యం తగ్గుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆందోళన లేదా మూడ్ ఔట్ వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అయితే ఈ లక్షణాలకు ఇతర కారణాలు కూడా ఉండవచ్చు.

ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ప్రాణాయామం, ధ్యానం

Advertisement

డాక్టర్ అగర్వాల్ ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, శ్వాస వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. అనులోమ విలోమం వంటి ప్రాణాయామాలను రోజువారీ జీవితంలో చేర్చుకోవచ్చు. ధ్యానం, మైండ్‌ఫుల్‌నెస్ వంటి పద్ధతులు కూడా మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
ప్రతిరోజూ కొంత సమయం ప్రశాంతంగా గడపడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే తీవ్రమైన లేదా నిరంతర సమస్యలు ఉంటే నిపుణుల సలహా అవసరం.

Also Read: నెల చివరికి జేబు ఖాళీ.. జీతం సరిపోవడం లేదా? ఈ స్మార్ట్ ఫైనాన్సియల్ టిప్స్ మీ కోసమే

ఒత్తిడి నిర్వహణకు ఆరోగ్యకరమైన అలవాట్లు

ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం శరీరానికి ఉపయోగపడుతుంది. సమయానికి భోజనం చేయడం, శారీరకంగా చురుకుగా ఉండటం కూడా ముఖ్యమే. పని మధ్యలో చిన్న విరామాలు తీసుకోవడం మానసిక ఒత్తిడిని తగ్గించవచ్చు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మాట్లాడటం కూడా మానసికంగా ఉపశమనం కలిగిస్తాయి. అనవరమైన ఒత్తిడిని గుర్తించి తగిన హద్దులు పెట్టుకోవడం మంచిది.

Also Read: ప్రేమ అంటే రక్తంతో లవ్ లెటర్స్ రాయడం కాదు.. ఒక్కడే కొండను చీల్చిన ప్రేమికుడు

ఎక్కువకాలం ఒత్తిడి ఉంటే తప్పకుండా నిపుణులను సంప్రదించాలి

అలసట, చిరాకు, ఏకాగ్రత తగ్గడం లేదా తక్కువ మూడ్ చాలాకాలం కొనసాగితే నిర్లక్ష్యం చేయకండి. వైద్యుడు లేదా మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించి కారణాన్ని తెలుసుకోవడం మంచిది. తీవ్రమైన భావోద్వేగ సమస్యలు లేదా స్వీయహాని ఆలోచనలు ఉంటే వెంటనే అత్యవసర సహాయం తీసుకోవాలి.

Related News

నెలకు రూ.20,500 పెన్షన్.. సీనియర్ సిటిజెన్స్ కోసం సూపర్ స్కీమ్

ముక్కు చుట్టూ చర్మం నల్లగా మారిందా? ఈ టిప్స్‌తో సమస్యకు చెక్

సైబీరియా పరిశోదన ల్యాబ్‌లో పగిలిన ట్యూబ్.. ఓ ఉద్యోగి మృతి-క్వారంటైన్‌లో 200 మంది, మరో వుహాన్ అంటూ..

ఎమర్జెన్సీ కిట్.. ప్రతి ఇంట్లో ఉండాల్సిన ముఖ్యమైన మెడికల్ పరికరాలు ఇవే

చిన్న విషయాలకే మీ లవర్ కోపం తెచ్చుకుంటున్నారా? ఈ 5 టిప్స్ మీ కోసమే

మీరు నమ్మిన వ్యక్తి మోసం చేస్తే నిశ్శబ్దంగా సహించాల్సిన అవసరం లేదు.. చాణక్యుడు ఏం చెప్పాడంటే

మిల్లీనియల్స్ పురుషులను ఇష్టపడుతున్న జెన్ Z అమ్మాయిలు.. కారణాలు ఇవే

Big Stories

Advertisement
×