E-Paper
Advertisement

Airtel ధమాకా ప్లాన్.. రూ.279‌కే నెట్ ఫ్లిక్స్ సహా 18 పైగా ఓటీటీలు.. ఇక ప్రతిరోజూ పక్కా ఎంటర్‌టైన్‌మెంట్!

Airtel ధమాకా ప్లాన్.. రూ.279‌కే నెట్ ఫ్లిక్స్ సహా 18 పైగా ఓటీటీలు.. ఇక ప్రతిరోజూ పక్కా ఎంటర్‌టైన్‌మెంట్!
Advertisement

Airtel Prepaid Plan: దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. ఓటీటీ (OTT) ప్రియుల కోసం ఒక అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ. 279 ధరలో లభించే ఈ ప్లాన్ ద్వారా ప్రపంచంలోనే టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ‘నెట్‌ఫ్లిక్స్ బేసిక్’ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. సాధారణంగా దేశంలో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ నెలకు రూ. 199గా ఉంది. అయితే, ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌తో పాటు మరిన్ని ఇతర ప్రయోజనాలను కూడా ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తుండటం విశేషం.

రూ. 279 ప్లాన్ ప్రయోజనాలు ఇవే

ఎయిర్‌టెల్ ఈ రూ. 279 ప్లాన్ ను నెల రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. దీని ద్వారా వినియోగదారులకు 30 జీబీ (30GB) హై-స్పీడ్ డేటా లభించనుంది. అయితే ఇది ఒక ‘డేటా వోచర్’ మాత్రమే. అంటే మీ మొబైల్‌లో సర్వీస్ వ్యాలిడిటీ ఉన్న మరొక బేసిక్ ప్లాన్ యాక్టివ్ గా ఉంటేనే ఈ డేటా వోచర్‌ను వినియోగించుకోవడం సాధ్యపడుతుందని ఎయిర్ టెల్ వర్గాలు పేర్కొన్నాయి.

18కి పైగా ఓటీటీలు ఫ్రీ..

Advertisement

ఈ ప్లాన్ ద్వారా నెట్ ఫ్లిక్స్ తో పాటు 18పైగా ఓటీటీలను ఉచితంగా వీక్షించే అవకాశం యూజర్లకు లభించనుంది. జియో హాట్‌స్టార్, జీ5 ప్రీమియం, సోనీలివ్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే సబ్‌స్క్రిప్షన్ తో మరో 18కి పైగా ఓటీటీ యాప్‌లకు ఫ్రీ యాక్సెస్ పొందొచ్చు. తక్కువ బడ్జెట్ లో అన్ని రకాల ఓటీటీల సబ్ స్క్రిప్షన్ కోరుకునేవారికి ఈ ప్లాన్ అద్భుత అవకాశమని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

Also Read: BSNL ధమాకా ఆఫర్.. ఒక్క రీఛార్జ్‌‌తో 380 రోజుల వ్యాలిడిటీ.. ఫ్రీ కాల్స్, రోజూ 2GB డేటా!

తక్కువలో రూ. 200 ప్లాన్

Advertisement

ఒకవేళ బడ్జెట్ కొద్దిగా తక్కువగా ఉంటే ఎయిర్‌టెల్ అందిస్తున్న రూ. 200 ప్లాన్‌ను ట్రై చేయవచ్చు. ఇందులో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ లభించనప్పటికీ ఇతర ఓటీటీ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. రూ. 200 ప్లాన్ ద్వారా కూడా 30 జీబీ డేటా లభించనుంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్ లో అమెజాన్ ప్రైమ్, జియోహాట్‌స్టార్, జీ5 ప్రీమియం, సోనీలివ్, తదితర 18కి పైగా ఓటీటీల ఉచితంగా వీక్షించవచ్చు.

Also Read: నెలకు రూ.20,500 పెన్షన్.. సీనియర్ సిటిజెన్స్ కోసం సూపర్ స్కీమ్

Tags

Related News

రూ.9,999 బడ్స్ ఇప్పుడు రూ.3,399కే.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో దిమ్మతిరిగే డీల్!

వంటగదిలో వినోదం మిస్ అవ్వక్కర్లేదు.. పాత గూగుల్ హోమ్ డిస్‌ప్లే ఉంటే ఇలా వాడేయండి!

BSNL ధమాకా ఆఫర్.. ఒక్క రీఛార్జ్‌‌తో 380 రోజుల వ్యాలిడిటీ.. ఫ్రీ కాల్స్, రోజూ 2GB డేటా!

వాట్సాప్‌లో అదిరిపోయే ప్రైవసీ ఫీచర్.. ఇంతకీ’రెస్ట్రిక్టెడ్ చాట్’ అంటే ఏంటీ?

ఆన్ లైన్ షాపింగ్ చేయకపోయినా పార్శిల్ వచ్చిందా? ఇలా చేస్తే..నిలువునా మోసపోతారు!

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

Big Stories

Advertisement
×