BigTV English

Cinnamon Benefits: దాల్చిన చెక్కతో.. ముఖంపై మొటిమలను మాయం చేద్దామిలా..

Cinnamon Benefits: దాల్చిన చెక్కతో.. ముఖంపై మొటిమలను మాయం చేద్దామిలా..

Benefits of Cinnamon Powder Face Packs & Scrub for Treating Pimples and Glowing Skin: ఈ రోజుల్లో చాలా మంది అందం, యవ్వనంగా ఉండటం కోసం రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను వాడుతూ ఉంటారు. వేలవేల డబ్బులు ఖర్చు పెట్టి అందం కోసం బ్యూటీ పార్లర్ లో రకరకాల ఫేషియల్ చేపించుకుంటారు. కాని ఇక నుంచి ఇంట్లో దొరికే నాచురల్ ప్రొడక్ట్స్ ను వాడటం అలవాటు చేసుకోండి. మంచి ప్రయోజనం ఉంటుంది. మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. అయితే ముఖంపై మొటిమలు తగ్గాలంటే దాల్చిన చెక్కను ఉపయోగంచవచ్చు.


దాల్చిన చెక్క సుగంధ, రుచికరమైన మసాలా.. ఇది ఎక్కువగా ఆహార పదార్ధాల్లో రుచి, సువాసన కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో ఉండే పోషకాహారం ఆరోగ్యానికి కాకుండా చర్మానికి కూడా చాలా మంచిది. దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. చర్మ సంరక్షణలో దీన్ని చేర్చడం వల్లన మెటిమలు రాకుండా కోపాడుకోవచ్చు. దాల్చిన చెక్క ఒక సహజమైన ఎక్స్‌ఫోలియేటర్.. దీని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల ముఖఛాయను మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్క వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..

1. మొటిమలను తొలగిస్తుంది


మీ ముఖంపై తరుచూ మొటిమలతో ఇబ్బంది పడుతుంటే.. దాల్చిన చెక్కను మీ చర్మ సంరక్షణ కోసం ఉపయోగించుకోవచ్చు. దాల్చినచెక్కలో యాంటీ బాక్టీరియల్ మూలకాలు ఉంటాయి. ఇది మొటిమల సమస్యను తొలగిస్తుంది. దాల్చిన చెక్క పొడి లేదా నూనె, ఈ రెండూ చర్మానికి మేలు చేస్తాయి. దీన్ని ఇలా ఉపయోగించండి.. దాల్చిన చెక్క నూనెను 3 నుంచి 4 చుక్కలు తీసుకుని అందులో 1 టీస్పూన్ తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి ముఖానికి అప్లై చేసి.. 10 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Also Read: మహిళల్లో అధిక బరువు సమస్య.. ముప్పు తప్పదంటున్న వైద్యులు

2. వృద్ధాప్యాన్ని నివారించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

యాంటీఆక్సిడెంట్ లక్షణాలు దాల్చినచెక్కలో పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను దెబ్బతీయకుండా నిరోధిస్తాయి. దాల్చిన చెక్క కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. దీని వల్ల వయసు పెరిగినా ముఖంపై ముడతల ప్రభావం తక్కువగా కనిపిస్తుంది. అంతే కాకుండా చర్మం గ్లో కూడా పెరుగుతుంది. దీన్ని ఇలా ఉపయోగించండి.. దాల్చిన చెక్క పొడిని ఆలివ్ ఆయిల్‌తో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌తో ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేయండి. ఆ తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల ముఖం మెరుస్తుంది.. మృదుత్వం కూడా పెరుగుతుంది.

3. ముఖ ఛాయను కాంతివంతం చేస్తుంది..
దాల్చినచెక్కను ఏ రూపంలోనైనా ఉపయోగించడం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీని వల్ల రఫ్, డల్ స్కిన్ అనేది తొలగిపోతుంది.. చర్మం కూడా మెరుస్తుంది. దీన్ని ఇలా ఉపయోగించండి.. దాల్చిన చెక్క పొడిని తేనె, పెరుగు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరుచూ చేయడం వల్లన మీ చర్మం మెరుస్తుంది.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×