Virat Kohli Injury: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 ) భాగంగా…ఆదివారం అంటే రేపే ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ ఫైనల్స్ లో భాగంగా… టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు ( Team India vs New Zealand ) తలపడబోతున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయింది. అయితే… ఫైనల్ మ్యాచ్ కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న తరుణంలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ( Virat Kohli Injury ) గాయం అయిందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు ఫైనల్ జరుగనున్న తరుణంలో… టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ఇవాళ ఉదయం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడట.
Also Read: Pakistan Performances: 3 ఏళ్లలో 100 మార్పులు.. కానీ పాకిస్థాన్ దరిద్రం మారలేదు !
అయితే… ఈ తరుణంలోనే… టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకు గాయం అయిందని చెబుతున్నారు. నెట్ బౌలర్ వేసిన బంతికి విరాట్ కోహ్లీకి గాయం అయిందట. ఆ బౌలర్ వేసిన బంతి విరాట్ కోహ్లీ ( Virat Kohli ) మోకాలికి తాకిందట. దీంతో… కోహ్లీ కుప్పకూలాడని చెబుతున్నారు. ఈ తరుణంలోనే… ప్రథమ చికిత్స అందించి.. బ్యాండేజీ వేశారట. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ( Virat Kohli ) నడువగలుగుతున్నాడని చెబుతున్నారు. రేపటి మ్యాచ్ కూడా ఆడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కానీ టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకు గాయం అయిందనే విషయం తెలియగానే.. ఫ్యాన్స్ అందరూ ఆందోళన చెందుతున్నారు.
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కోలుకుని ఫైనల్ మ్యాచ్ ఆడి..టీమిండియాను గెలిపించాలని పూజలు చేస్తున్నారు అభిమానులు. కోహ్లీ ఆడితే… ఫైనల్స్ గెలుస్తామని మరికొందరు అంటున్నారు. అయితే.. విరాట్ కోహ్లీ గాయం కారణంగా… ఫైనల్ మ్యాచ్ ఆడకపోతే… మరో ఆటగాడు జట్టులోకి వస్తాడు. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ఫైనల్ మ్యాచ్ లో అవకాశం వస్తుంది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 ) ఒక్క మ్యాచ్ ఆడలేదు రిషబ్ పంత్. దుబాయ్ పిచ్ పై ఆడిన అనుభవం కూడా రిషబ్ పంత్ కు లేదు. అంటే…. గాయం కారణంగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ దూరం అయితే… టీమిండియా గెలవడం కష్టమేనని అంటున్నారు.
Also Read: Jonty Rhodes: 55 ఏళ్ల వయస్సులో జాంటీ రోడ్స్ అరాచకం.. గూస్ బంప్స్ రావాల్సిందే !
ఇది ఇలా ఉండగా… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా మార్చి 9 అంటే ఆది వారం రోజున జరిగే.. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభంకానుంది. మధ్యాహ్నం 2 గంటలకు టాస్ ప్రక్రియ ఉంటుంది. జియో హాట్ స్టార్ లో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఉచితంగానే చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 లో కూడా వీక్షించవచ్చును.