Coconut Water vs Sugarcane Juice | వేసవి కాలంలో ఎండకు శరీరం నీరసించిపోతుంది. అందుకే అందరూ చల్లని పానీయాలతో శరీర తాపాన్ని తగ్గించేందుకు, మంచి ఎనర్జీ పొందేందుకు చూస్తారు. అందుకే ఎండా కాలంలో అందరూ కొబ్బరి నీళ్లు లేదా చెరకు రసం తాగేందుకు ఇష్టపడతారు. ఈ రెండెంటిలో చెరకు రసం కాస్త తీయగా రుచికరంగా ఉండడంతో ఎక్కువ మంది దాని వైపు మొగ్గుచూపుతారు. అయితే చెరకు రసం కంటే కొబ్బరి నీరు శరీరానికి ఎక్కువ మేసుల చేస్తుందని కొందరి అభిప్రాయం. అందుకే ఈ రెండింటిలో ఏది శరీరానికి బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం.
చెరకు రసం వల్ల ఆరోగ్య లాభాలు
చెరకు రసం పూర్తిగా ప్రాకృతమైన జ్యూస్. ఇది తాగితే తక్షణమే శరీరంలో శక్తిని నింపుతుంది. షుగర్ కేన్ జ్యూస్ తాగిన తరువాత శరీరంలోని హానికారక టాక్సిన్ పదార్థాలు మల మూత్ర విసర్జన ద్వారా వెళ్లిపోతాయి. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. వేసవి కాలంలో అయితే శరీరానికి చెరకు రసం చల్లగా ఉంచుతుంది. వడ దెబ్బ ప్రమాదాన్ని ఇది నివారిస్తుంది. చెరకు రసంలోని పోషకాలు చర్మం ఆరోగ్యానికి చాలా మంచిదని శాస్త్రీయంగా తేలింది. శరీరంలో డిహైడ్రేషన్ సమస్యకు ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. కామెర్లు, మూత్రంలో ఇన్‌ఫెక్షన్, అలస లాంటి సమస్యలను పరిష్కరిస్తుంది. లివర్ ని డిటాక్స్ చేస్తుంది. మధ్యాహ్నం భోజనానికి ముందు తాగితే జీర్ణక్రియ వేగంగా పనిచేస్తుంది.
కొబ్బరి నీరు లో ఆరోగ్య ప్రయాజనాలు
వేసవిలో కొబ్బరి నీళ్లు చాలా అవసరమని అందరూ భావిస్తుంటారు. ఎండలు, వేడి గాలుల కారణంగా శరీరం నీరసించి పోతే చాలా మంది కొబ్బరి నీళ్లకే ప్రాధాన్యం ఇస్తారు. కొబ్బరి నీరు.. యాసిడిటీ సమస్యను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. తక్కువ కెలోరీలు ఉండడం వల్ల ఉదయం వేళ ఖాళీ కడపున కొబ్బరి నీళ్లు తాగితే బరువు నియంత్రణలో ఉంటుంది. దీంతో పాటు రక్తపోటుని నియంత్రిస్తుంది.
Also Read: చెరకు రసం ఆ విధంగా తాగడం హానికరం.. ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి
వేసవిలో ఏది బెటర్?
వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు, చెరకు రసంలో ఏది బెటర్ అంటే.. ఈ రెండింటి వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే చెప్పాలి. అయితే అవసరాన్ని బట్టి ఏది తాగాలి అనేది నిర్ణయించుకోవాలి. మీకు నీరసం ఎక్కువగా ఉంటే తక్షణ శక్తి కోసం చెరకు రసం తాగండి. కానీ శరీరం త్వరగా హైడ్రేట్ కావాలి అనుకుంటే కొబ్బరి నీరు తాగండి. అయితే మధుమేహం (డయాబెటీస్ షుగర్ వ్యాధి) ఉన్న వారు కొబ్బరి నీరు తాగడం మంచిది. వారి షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. పైగా ఎండ తీవ్రత నుంచి ఉపశమనం లభిస్తుంది. పైగా చెరకు రసంలో అధిక మొత్తంలో ఉండే గ్లూకోజ్ షుగర్ మధుమేహం ఉన్నవారికి హానికరం. దీంతో పాటు చెరకు రసం వారానికి మూడు లేదా నాలుగు సార్లు మాత్రమే తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.