Publicity Stunt: సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే ఆరాటంతో యువత హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. లైకులు, ఫాలోవర్లను పెంచుకోవడానికి మితిమీరిన విన్యాసాలు చేస్తూ వీడియోలను రీల్స్ రూపంలో సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తారు. వీళ్లు చేసే హంగామా వల్ల ఇతరులు ఇబ్బంది పడతారనే కనీస ఆలోచన కూడా లేకుండా ప్రవర్తిస్తారు. పాపులారిటీ కోసం ఇలాంటి చేష్టలు చేసే వారికి పోలీసులు సరైన గుణపాఠం చెబుతున్నారు.
ఈ నెల 26న రీల్స్ కోసం అర్ధరాత్రి ఓపెన్ టాప్ జీపులో ర్యాష్ డ్రైవింగ్ చేసిన యువకులను అరెస్ట్ చేసినట్లు బంజారా హిల్స్ పోలీసులు తెలిపారు. రోడ్డు నెంబర్.1లో కొందరు ఆకతాయిలు మితిమీరిన వేగంతో వెళ్తూ సర్వీ హోటల్ దగ్గర గాల్లో రైఫిల్ చూపించి స్థానికులను భయబ్రాంతులకు గురిచేశారు. ఇది గమనించిన కానిస్టేబుల్ శ్రీకాంత్ యువకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ALSO READ: 10th పేపర్ లీక్ కేసులో ట్విస్ట్
శ్రీకాంత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా జీపు నంబర్ దొరికిందని తెలిపారు. ఆ జీపులో ఉన్నది సనత్ నగర్‌కు చెందిన అఫీజుద్దీన్ (21)గా గుర్తించామని పోలీసులు తెలిపారు. అఫీజుద్దీన్‌తో పాటు ర్యాష్ డ్రైవింగ్ చేసిన డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకొని విచారణ జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీడియో గ్రాఫర్‌గా పని చేస్తున్నానని, రీల్స్ కోసమే జీపులో వెళ్తూ రైఫిల్ చూపించానని అఫీజుద్దీన్ ఒప్పుకున్నాడని తలిపారు. ర్యాష్ డ్రైవింగ్ చేయడమే కాకుండా తుపాకితో పబ్లిక్‌ని భయపెట్టినందుకు అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.