E-Paper
Advertisement

పర్ఫెక్ట్ కొలతలతో..నోరూరించే బ్రెడ్ హల్వా రెసిపీ

పర్ఫెక్ట్ కొలతలతో..నోరూరించే బ్రెడ్ హల్వా రెసిపీ
Advertisement

Bread halwa recipe in telugu: ఇంట్లో ఎప్పుడైనా అప్పటికప్పుడు తియ్యగా ఏదైనా తినాలనిపిస్తే, లేదా సడన్‌గా గెస్టులు వస్తే క్షణాల్లో చేసుకునే అద్భుతమైన స్వీట్ ‘బ్రెడ్ హల్వా’. చాలా మందికి ఇది హోటళ్లలో లేదా పెళ్లిళ్లలో తిన్న రుచిలా ఇంట్లో కుదరదు. అయితే, సరైన కొలతలతో , పర్ఫెక్ట్ రెసిపీతో చేస్తే రెస్టారెంట్ టేస్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఎంతో ఈజీగా, తక్కువ ఖర్చుతో నోట్లో వెన్నలా కరిగి పోయే బ్రెడ్ హల్వాను పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం!

వంటకాల్లో స్వీట్లకు ఉండే ప్రత్యేకతే వేరు. అందులోనూ ఇంట్లోనే తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో చేసుకునే స్వీట్లలో బ్రెడ్ హల్వా ఎప్పుడూ ముందుంటుంది. ముఖ్యంగా పిల్లలు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. చాలా మందికి బ్రెడ్ హల్వా చేసేటప్పుడు పాకం ముదరడం లేదా బ్రెడ్ ముక్కలు గట్టిగా అయిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కానీ.. ఇక్కడ చెప్పబోయే పర్ఫెక్ట్ కొలతలను పాటిస్తే మొదటిసారే అద్భుతమైన, జ్యూసీ జ్యూసీగా ఉండే బ్రెడ్ హల్వాను తయారు చేసుకోచ్చు.

కావలసిన పదార్థాలు:

Advertisement

బ్రెడ్ స్లైసెస్ : 1 ప్యాకెట్ (సుమారు 10 నుండి 12 బ్రెడ్ స్లైసెస్)

నెయ్యి : 4 నుండి 5 టేబుల్ స్పూన్లు

Advertisement

పంచదార : 1 కప్పు (సుమారు 200 గ్రాములు)

పాలు : 1.5 కప్పులు (కాచి చల్లార్చినవి)

నీళ్లు : అర కప్పు

డ్రై ఫ్రూట్స్ : గుప్పెడు

యాలకుల పొడి : అర టీస్పూన్

తయారీ విధానం:

1:మొదటగా బ్రెడ్ స్లైసెస్ అంచులను కట్ చేసి, చిన్న చిన్న చతురస్రాకారపు ముక్కలుగా కట్ చేసుకోవాలి. (అంచులు కట్ చేయకపోయినా పర్వాలేదు, కట్ చేస్తే హల్వా మరింత మృదువుగా వస్తుంది). ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత బ్రెడ్ ముక్కలను అందులో వేసి మీడియం మంటపై బంగారు రంగు వచ్చే వరకు క్రిస్పీగా వేయించుకోవాలి. లేదా నూనెలో లేదా నెయ్యిలో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ నెయ్యిలో వేయిస్తేనే అసలైన రుచి వస్తుంది.

2.వేరే గిన్నెలో 1 కప్పు పంచదార, అర కప్పు నీళ్లు పోసి మంటపై పెట్టాలి. పంచదార పూర్తిగా కరిగి కొద్దిగా.. తీగ పాకం వచ్చే వరకు మరిగించాలి. ఆ తర్వాత అందులో 1.5 కప్పుల కాచి చల్లార్చిన పాలను పోయాలి. పాలు, పాకం బాగా మరిగేటప్పుడు, ముందుగా వేయించి పెట్టుకున్న క్రిస్పీ బ్రెడ్ ముక్కలను అందులో వేయాలి.

3: బ్రెడ్ ముక్కలు వేసిన వెంటనే పాలను , పాకాన్ని పీల్చుకుని మెత్తగా మారుతాయి. మంటను సిమ్‌లో ఉంచి గరిటెతో మెత్తగా మాష్ చేస్తూ కలపాలి. మిశ్రమం దగ్గరగా పడుతున్న సమయంలో.. మిగిలిన 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని, యాలకుల పొడిని కలపాలి.హల్వా కడాయికి అంటు కోకుండా నెయ్యి పైకి తేలే వరకు బాగా ఉడికించాలి.

4.చివరగా చిన్నపాటి కడాయిలో.. కొద్దిగా నెయ్యి వేడి జీడిపప్పు, కిస్మిస్, బాదం ముక్కలను దోరగా వేయించి హల్వాలో కలపాలి. అంతే.. గుమ గుమలాడే నోరూరించే బ్రెడ్ హల్వా సిద్ధం!

ఈ పర్ఫెక్ట్ కొలతలతో చేసిన బ్రెడ్ హల్వా వేడి వేడిగా లేదా కొద్దిగా చల్లారిన తర్వాత తింటే.. అమృతంలా ఉంటుంది. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు లేదా పండగ రోజుల్లో కేవలం 15 నిమిషాల్లో ఈ ట్రెండీ స్వీట్‌ను తయారు చేసి మీ కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరచండి!

Related News

పక్కా తెలంగాణ స్టైల్ సర్వపిండి..ఒక్క సారి టేస్ట్ చేేస్తే అస్సలు వదలరు!

పర్ఫెక్ట్ కొలతలతో గుమగుమలాడే సెమియా కేసరి..క్షణాల్లోనే రెడీ అవుతుంది

పప్పుచారులో నంజుకోవడానికి బాప్‌లాంటి ‘కరివేపాకు రొయ్యల వేపుడు’.. తింటే ఫిదా అయిపోతారు!

రాయలసీమ స్టైల్ నాటుకోడి వెల్లుల్లి కారం.. ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా!

బోటీ కూర అంటే ఇష్టముండదా? చింతచిగురుతో ఇలా చేస్తే ప్లేట్లు నాకేస్తారు!

రైస్ వాటర్‌తో మెరిసే జుట్టు, గ్లాస్ స్కిన్ సాధ్యమేనా? సోషల్ మీడియాలో చెప్పేదంతా నిజమేనా?

మధ్యాహ్నం కాగానే కళ్లు మూతలు పడుతున్నాయా? శరీరం ఇచ్చే డేంజర్ సిగ్నల్ ఇది!

Big Stories

Advertisement
×