BigTV English

Diabetic diet: ఇవి తింటే షుగర్‌ రమ్మన్నా.. రాదు

Diabetic diet: ఇవి తింటే షుగర్‌ రమ్మన్నా.. రాదు

Diabetic diet: ప్రస్తుతం చాలా మంది ఎదుర్కుంటున్న ఆరోగ్య సమస్యల్లో షుగర్ కూడా ఒకటి. మారిన జీవన శైలి, వంశపారం పర్యంతో పాటు అనేక కారణాలు షుగర్ వ్యాధి రావడానికి కారణం అవుతాయి. డయాబెటిస్ పేషెంట్స్ ఎప్పుడూ షుగర్ పెరుగుతుందనే భయంతోనే ఉంటారు. ఇలాంటి వారు మీ రోజువారీ ఆహారం విషయంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మీరు షుగర్ లెవల్స్ ఈజీగా తగ్గించుకోవచ్చు.


చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు మధుమేహానికి ప్రధాన కారణాలు. ఇది జీవనశైలికి సంబంధించిన వ్యాధి అని చెప్పవచ్చు.మధుమేహ వ్యాధిగ్రస్తులు సరైన ఆహారం తినడం చాలా ముఖ్యం కొన్ని ఆహారాలు మీ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర పెరుగుదల లేదా ఆకస్మిక తగ్గుదల అనే ఈ రెండు పరిస్థితులు ఆరోగ్యానికి చాలా హానికరం. హై బ్లడ్ షుగర్ పేషెంట్లు తమ షుగర్ నియంత్రణలో ఉంచుకోవడం గురించి తరుచుగా ఆందోళన చెందుతారు.

దీని కోసం చాలా మంది మందులను కూడా క్రమం తప్పకుండా వాడుతుంటారు.కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు షుగర్ ను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. మీ రోజువారీ ఆహారంలో ఈ ఆహారలు చేర్చుకోవడం వల్ల ఈ సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. మరి షుగర్ లెవల్స్ తగ్గించే ఆహారాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.


మధుమేహాన్ని నియంత్రించే ఆహారాలు ఇవే..

1. కాకరకాయ:
మధుమేహ వ్యాధిగ్రస్తులకు కాకరకాయ దివ్యౌషధంగా చెబుతారు. ఇందులో ఉండే ఎలిమెంట్స్ బ్లడ్ షుగర్ లెవెల్ ను తగ్గించడానికి ఉపయోగపడతాయి. కాకర కాయలో పాలీపెప్టైడ్-పి, విసిన్ , చరాన్టిన్ వంటి సమ్మేళనాలు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. కాకరకాయను కూరగాయగానూ, జ్యూస్‌గానూ తీసుకోవచ్చు.

2. మెంతి:
మెంతి గింజలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే గుణాలు బ్లడ్ షుగర్ ను తగ్గించేందుకు పని చేస్తాయి. మెంతులు రక్తంలో చక్కెరను నియంత్రించే ట్రైగోనెలిన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి. మీరు మెంతి ఆకుకూరలను తరుచుగా ఆహారంలో భాగంగా చేసుకోవడంతో పాటు..మెంతి గింజల నీటిని రోజు తాగితే, రక్తంలో చక్కెర నియంత్రణలో ఇది సహాయపడుతుంది.

3. గ్రీన్ వెజిటేబుల్స్:
డయాబెటిక్ పేషెంట్స్ తప్పనిసరిగా గ్రీన్ వెజిటేబుల్స్ ను డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో బచ్చలికూర, బీట్‌రూట్, మెంతులు, క్యాబేజీ మొదలైనవి ఉన్నాయి. ఫైబర్ అధికంగా ఉండే ఈ కూరగాయలను తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఈ కూరగాయలలో రక్తంలో చక్కెరను నియంత్రించే అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. తరుచుగా వీటిని తినడం వల్ల షుగర్ తగ్గే అవకాశాలు చాలా వరకూ ఉంటాయి.

Also Read: ఇలా చేస్తే.. శాశ్వతంగా బ్యాక్ పెయిన్ దూరం

4. మునగ:
డయాబెటీస్ రోగులకు మునగకాయ వినియోగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డ్రమ్ స్టిక్ పాడ్ ని సూపర్ ఫుడ్ అంటారు. ఇటువంటి సమ్మేళనాలు మునగలో కనిపిస్తాయి. ఇవి ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి పని చేస్తాయి. దీని వినియోగం అధిక రక్త చక్కెరకు కారణమయ్యే బరువును కూడా తగ్గిస్తుంది. అందుకే షుగర్ వ్యాధితో ఇబ్బందిపడే వారు తరుచుగా మునగ ఆకుతో పాటు, మునగ కాయలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Glow Skin In One Day: ఇవి వాడితే.. ఒక్క రోజులోనే గ్లోయింగ్ స్కిన్

Blood Sugar: ఏంటీ.. టూత్ పేస్ట్‌‌తో షుగర్ పెరుగుతుందా ?

Goat Milk Benefits: మేక పాలు తాగితే.. మతిపోయే లాభాలు, తెలిస్తే అస్సలు వదలరు !

Chai-Biscuit: చాయ్‌తో బిస్కెట్ తినొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే షాక్ అవుతారు

Tomato Pulao: క్షణాల్లోనే రెడీ అయ్యే టమాటో పులావ్.. తింటే మైమరచిపోతారు !

Mushroom Curry: మష్రూమ్ కర్రీ.. సింపుల్‌గా ఇలా చేసేయండి !

Kidneys: మీలో ఈ అలవాట్లున్నాయా ? వెంటనే మానేయండి !

Almonds Side Effects: ఆరోగ్యానికి మంచివని బాదం ఎక్కువగా తింటున్నారా ? ఈ సమస్యలు తప్పవు !

Big Stories

×