E-Paper
Advertisement

స్క్రీన్ చూస్తూ కళ్లు పోగొట్టుకుంటున్నారా? ఈ “20-20-20” మ్యాజిక్ ట్రిక్ మీకోసమే!

స్క్రీన్ చూస్తూ కళ్లు పోగొట్టుకుంటున్నారా? ఈ “20-20-20” మ్యాజిక్ ట్రిక్ మీకోసమే!
Advertisement

Digital Eye Strain: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్, లాప్‌టాప్ లేనిదే  రోజు  గడవదు. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన కళ్లు నిరంతరం స్క్రీన్లకే అతుక్కుపోతున్నాయి. ఈ క్రమంలో మనకు తెలియకుండానే.. ‘డిజిటల్ ఐ స్ట్రెయిన్’ (Digital Eye Strain) బారిన పడుతున్నాం. కళ్లు మండటం, కంటి నుంచి నీరు కారడం, తలనొప్పి వంటి లక్షణాలను మనం సాధారణ అలసటగా భావిస్తాం. కానీ ఇది శాశ్వత కంటి సమస్యలకు దారి తీసే ప్రమాదం కూడా ఉంది. ఈ సమస్యనుంచి బయట పడటానికి  మార్గం “20-20-20 రూల్”. అసలేంటీ 20-20-20 రూల్, దీని వల్ల కలిగే ప్రయోజనాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటే ఏంటి?

సాధారణంగా మనం నిమిషానికి 15 నుంచి 20 సార్లు కళ్లు ఆరపిస్తాం. కానీ డిజిటల్ స్క్రీన్లను చూస్తున్నప్పుడు.. ఆ సంఖ్య సగానికి పడిపోతుంది. దీని వల్ల కళ్లలోని తేమ ఆవిరైపోయి ‘డ్రై ఐ’ సమస్య వస్తుంది. దీనినే ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’ అని కూడా పిలుస్తారు. గంటల తరబడి ఒకే దగ్గర దృష్టి కేంద్రీకరించడం వల్ల కంటి కండరాలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి.

అద్భుతమైన పరిష్కారం- 20-20-20 రూల్:

Advertisement

అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్టోమెట్రీ సూచించిన ఈ సూత్రం చాలా బెస్ట్ అనే చెప్పాలి.

ప్రతి 20 నిమిషాలకు ఒకసారి.. 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును.. కనీసం 20 సెకన్ల పాటు చూడాలి.

Advertisement

ఈ చిన్న విరామం కంటి కండరాలకు ఎలాంటి ఉపశమనాన్ని ఇస్తుందో తెలుసుకుందాం.

1. కండరాల విశ్రాంతి: మన కంటిలోని ‘సిలియరీ’ కండరాలు దగ్గరి వస్తువులను చూడటానికి నిరంతరం కుంచించుకుపోయి ఉంటాయి. 20 అడుగుల దూరాన్ని చూసినప్పుడు.. ఆ కండరాలు యధాస్థితికి వచ్చి విశ్రాంతి పొందుతాయి. ఇది కెమెరా లెన్స్‌ను రీ-ఫోకస్ చేసినట్లుగా పనిచేస్తుంది.

తేమ పునరుద్ధరణ: ఈ 20 సెకన్ల విరామంలో మనం సహజంగానే ఎక్కువ సార్లు కళ్లు ఆర్పుతాం. దీని వల్ల కంటిపై కన్నీటి పొర ఏర్పడి, కళ్లు పొడిబారకుండా ఉంటాయి.

మెదడుకు సంకేతం: నిరంతర కాంతి వల్ల అలసిపోయిన మెదడుకు, ఈ చిన్న బ్రేక్ ఒక రీసెట్ బటన్‌లా పని చేస్తుంది. దీని వల్ల పనిపై ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

దీన్ని అలవాటు చేసుకోవడం ఎలా?

చాలా మంది పనిలో పడి సమయాన్ని మర్చిపోతుంటారు. వారి కోసం కొన్ని చిట్కాలు..

అలారమ్ సెట్ చేసుకోండి: ప్రతి 20 నిమిషాలకు మీ ఫోన్‌లో లేదా కంప్యూటర్‌లో రిమైండర్ పెట్టుకోండి.

ప్రకృతిని చూడండి: వీలైతే కిటికీ గుండా బయట ఉన్న చెట్టునో.. ఆకాశాన్నో చూడండి. ఇది కళ్లకు మరింత చల్లదనాన్ని ఇస్తుంది.

బ్లింకింగ్ ఎక్సర్‌సైజ్: ఆ 20 సెకన్లలో ఐదు సార్లు మెల్లగా కళ్లు మూసి తెరవండి.

Also Read: షుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్.. ఈ విత్తనాలు తింటే ఇన్సులిన్ అవసరమే ఉండదు!

స్క్రీన్ సెట్టింగ్స్ కూడా ముఖ్యమే:

కేవలం వ్యాయామమే కాదు.. మీ పని వాతావరణం కూడా మారాలి. స్క్రీన్ మీ కళ్లకు కనీసం 25 అంగుళాల దూరంలో ఉండాలి. స్క్రీన్ వెలుతురు గదిలోని వెలుతురు కంటే.. మరీ ఎక్కువగా లేదా తక్కువగా ఉండకూడదు. స్క్రీన్ పొజిషన్ మీ కంటి చూపు కంటే కొంచెం కిందకు ఉండేలా చూసుకోవాలి.

కళ్లు మన ప్రపంచానికి కిటికీలు. సాంకేతికతను వాడుకోవడం తప్పనిసరి అయిన ఈ రోజుల్లో.. మన కళ్లను మనం కాపాడుకోవడం కూడా బాధ్యతే. “20-20-20 రూల్” అనేది కేవలం ఒక సలహా కాదు.. అది డిజిటల్ యుగంలో కళ్లకు ఇచ్చే సంజీవని. ఈ రోజే దీన్ని మీ లైఫ్ స్టైల్ లో భాగం చేసుకోండి.

Related News

80ల నాటి మన ఇళ్లలో దాగున్న అపురూపమైన జ్ఞాపకాలు.. ఇవి మీ ఇంట్లో ఇంకా ఉన్నాయా?

గోలీలు, బొంగరాలతో ఆటలు.. నేటి ఆన్‌లైన్ గేమ్స్‌లో ఆ కిక్కేది?

80’s కిడ్స్.. ఫ్యాషన్ ఐకాన్స్, రెట్రో అంటే గుర్తొచ్చేది వీళ్ల స్టైలే!

అమ్మ చేతి కమ్మని వంట.. కిచెన్‌ నుంచి వచ్చే ఆ మసాలాల సువాసనలు, ఇప్పుడేవీ?

ఒక్క ఫోటో కోసం ఎన్నో రోజులు ఎదురుచూపులు.. 80s స్టూడియో అనుభూతే వేరు!

80ల్లో ఆటలు.. పెనవేసుకొనే బంధాలు.. ఇప్పుడవి ఏమైపోయాయ్?

80’s లవ్ లెటర్.. కాగితంపై మనసులో మాట.. అక్షరాల్లో అంతులేని ప్రేమ!

స్త్రీలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజం.. PCOS – PCOD మధ్య అసలు తేడా ఇదే!

Big Stories

Advertisement
×