1980 నాటికి బెల్‌బాటమ్ ప్యాంట్లు భారత యువతలో బాగా పాపులర్. నడుము దగ్గర ఫిట్‌గా ఉండి.. మోకాలి కింద నుంచి ఒక్కసారిగా వెడల్పయ్యే డిజైన్ అది. అప్పట్లో ప్యాంట్ ఎంత వెడల్పుగా ఉంటే.. అంత స్టైలిష్‌గా భావించేవారు. సినిమా హీరోల నుంచి కాలేజీ కుర్రాళ్ల వరకు.. బెల్‌బాటమ్ ఓ కామన్ ఫ్యాషన్! ప్యాంట్‌తో పాటు షర్ట్ కూడా అంతే ప్రత్యేకం. పెద్ద కాలర్లు.. బోల్డ్ చెక్స్.. రంగురంగుల ప్రింట్లు.. చెస్ట్ వరకు ఓపెన్‌గా ఉండే బటన్లు! అప్పటి ఫ్యాషన్‌ను తలుచుకుంటునే గమ్మత్తుగా ఉంది కదా!
ఫ్యాషన్ అంటే కేవలం డ్రెస్సు మాత్రమే కాదండోయ్. ఇంకా ఉంది.. ఇదిగో చూడండి.. పొడవాటి జుట్టు, సైడ్‌బర్న్స్.. ప్లాట్‌ఫామ్ షూస్.. పెద్ద సన్‌గ్లాసెస్! హీరో ఏ హెయిర్‌స్టైల్ చేస్తే.. అదే హెయిర్‌స్టైల్ చేయాలని సెలూన్‌లో యువత అడిగే రోజులవి. అప్పటి ఫ్యాషన్‌కు సినిమానే అతిపెద్ద ట్రెండ్‌సెట్టర్‌గా ఉండేది. హీరో వేసుకున్న షర్ట్.., హీరో వేసుకున్న ప్యాంట్.., హీరో పెట్టుకున్న గాగుల్స్.. అన్నీ ప్రేక్షకుల్లోకి వెళ్లేవి. ముఖ్యంగా కృష్ణ, చిరంజీవి వంటి హీరోల స్టైలిష్ లుక్స్ యువతపై బలమైన ప్రభావం చూపించాయి.
మహిళల ఫ్యాషన్‌లోనూ ప్రత్యేకమైన మార్పులు కనిపించేవి ఆ రోజుల్లో. చీరలే ప్రధాన వస్త్రధారణగా ఉన్నప్పటికీ.. సల్వార్ కమీజ్, బెల్ స్లీవ్స్, ప్రింటెడ్ డ్రెస్సులు కూడా యువతలో ఆదరణ పొందాయి. హెయిర్‌స్టైల్‌లోనూ వాల్యూమ్.. పొడవాటి జుట్టు.. సినిమా కథానాయికల ప్రభావం కనిపించేది. అప్పట్లో ట్రెండ్ మారడానికి నెలలు పట్టేది.. ఇప్పుడు కొన్ని గంటలు చాలు! ట్రెండ్‌ను మార్చేస్తున్నారు.
Also Read: భారత రాజకీయాలకు టర్నింగ్ పాయింట్ 1980.. ఇందిరా గ్రాండ్ రీఎంట్రీ, బీజేపీ ఆవిర్భావం!
Also Read: వార్తా ప్రపంచం మారిపోయిందండోయ్.. 80ల్లో అలా, ఇప్పుడేమో ఇలా!