BigTV English

Bath After Eating : తిన్న వెంటనే స్నానం చేస్తున్నారా? .. అయితే ఇది చెక్ చేయండి!

Bath After Eating : తిన్న వెంటనే స్నానం చేస్తున్నారా? .. అయితే ఇది చెక్ చేయండి!
Bath After Eating
Bath After Eating

Bath After Eating : మనం అందరం ఫ్రెష్‌గా, ఉల్లాసంగా ఉండేందుకు రోజుకు రెండు పుటలా స్నానం చేస్తాం. ఇది చాలా మంచి అలవాటు కూడా. అయితే మనలో కొందరు స్నానం విషయంలో చిన్నచిన్న పొరపాట్లు చేస్తుంటారు. తిన్న వెంటనే స్నానానికి వెళుతుంటారు. ఇలా చేయడం పెద్దపొరపాటు. పెద్దలు కూడా తిన్నవెంటనే స్నానానికి వెళితే తిడుతుంటారు. మీకు కూడా ఈ అలవాటు ఉండే మానేయండి. తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.


దీన్ని కొందరు మూడనమ్మకం అనుకుంటారు. కానీ తిన్న వెంటనే స్నానం చేయకూడదనే దాని వెనుక శాస్త్రీయ కారణాలున్నాయి. తిన్న వెంటనే స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు  హెచ్చరిస్తున్నారు.

Also Read : క్యాప్ పెట్టుకుంటే జుట్టు రాలుతుందా..?


నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరంలోని ప్రతి పనికి ఓ సమయం ఉంటుంది. ఆహారం తిన్న వెంటనే మన శరీరంలో జీర్ణశ్రయం తన పనిని మొదలు పెడుతుంది. ఆహారాన్ని జీర్ణం చేయడం ప్రారంభిస్తుంది. అందుకనే తిన్న వెంటనే స్నానం చేయకూడదు. దీనివల్ల శరీరం చల్లబడి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. శరీరం చల్లబడినప్పుడు జీర్ణక్రియకు అవసరమైన ఉష్ణోగ్రత అందదు. దీని వల్ల అజీర్ణం మరియు అసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. జీర్ణక్రియ సరిగా జరగకపోవడం వల్ల కడుపు ఉబ్బరం, బరువు పెరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి.

భోజనం తర్వాత స్నానం చేయడం వల్ల రక్తనాళాల్లో సమస్య కూడా వస్తుంది. చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో ఒక రసాయన మూలకం ఉత్పత్తి అయి శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈ రసాయనం రక్త నాళాలను విస్తరించి రక్తాన్ని నరాలు మరియు చిన్న నరాలకు వేగంగా ప్రయాణించేలా ప్రేరేపిస్తుంది. ఇది శరీర ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి భోజనం చేసిన వెంటనే స్నానం చేయకండి.

Also Read : రంజాన్ ఉపవాసం.. ఈ ఫుడ్స్‌తో ఎనర్జిటిక్‌గా ఉండండి!

తిన్న తర్వాత చేయకూడనవి

  • భోజనం తర్వాత కొందరు పళ్లు తోముకుంటారు. కానీ ఇలా చేయకండి. ఇలా చేయడం దంతాల ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు తిన్న 30 నిమిషాల తర్వాత మాత్రమే బ్రష్ చేయండి.
  • భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి 1 గంట గ్యాప్ ఇచ్చి నిద్రపోండి. లేదంటే బరువు పెరుగుతారు.
  • భోజనం తర్వాత వేడి నీళ్లతో స్నానం చేయకండి. వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత, గుండె స్పందన రేటు పెరుగుతుంది. ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారి తీయొచ్చు. ఒక గంట గ్యాప్ ఇచ్చి స్నానం చేయండి.
  • Disclaimer: ఈ కథనాన్ని పలు అధ్యయనాల ఆధారంగా, ఇంటర్నెట్‌లోని సమచారం మేరకు సేకరించాం. దీనిని కేవలం అవగాహనగ భావించండి.

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×