BigTV English

Pudina Chutney: పుదీనా చట్నీ తింటే హైబీపీ తగ్గుతుందా? దీనిలో నిజమెంత?

Pudina Chutney: పుదీనా చట్నీ తింటే హైబీపీ తగ్గుతుందా? దీనిలో నిజమెంత?

సోషల్ మీడియా వచ్చాక ప్రతిదీ వైరల్ అవ్వడం మొదలైంది. అలాగే ఈ మధ్యన పుదీనా చట్నీ తింటే అధిక రక్తపోటు అదుపులో ఉంటుందని ఒక వీడియో చాలా చోట్ల కనిపించింది. కొంతమంది ఇది నిజమేనని నమ్ముతున్నారు. మరికొందరు ఉత్తినేనని కొట్టి పడేస్తున్నారు. అయితే దీనిలో నిజం ఎంతో వైద్యుల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం.


పుదీనా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన మూలిక. పుదీనా చట్నీ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే పుదీనా చట్నీ తినడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.  అయితే ఇది మాత్రం పూర్తిగా అపోహ. ఇది శరీర ఆరోగ్యం మొత్తానికి మేలు చేస్తుంది. అలాగే రక్తపోటు కూడా ఎంతో కొంత మేలు చేస్తుంది. కానీ హైబీపీని పూర్తిగా కంట్రోల్ లో ఉంచుతుంది అన్నది మాత్రం కేవలం ఒక ఊహ మాత్రమే. అయితే ప్రతిరోజూ పుదీనా చట్నీ తినడం వల్ల మాత్రం ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

ఏం తినాలి?
రక్తపోటును నిర్వహించడానికి అదుపులో ఉంచడానికి కొన్ని రకాల ఆహారాలు ఉపయోగపడతాయి. దీనిలో మాత్రం నిజం ఉంది. కానీ కేవలం పుదీనా చట్నీ మాత్రమే రక్తపోటును అదుపులో ఉంచుతుంది అన్నది మాత్రం కేవలం ఒక అపోహ మాత్రమే. రక్తపోటును అదుపులో ఉంచేవి పాలకూర, అరటి పండ్లు, బెర్రీలు, నారింజ, అవిసె గింజలు, బాదం, కొవ్వు లేని పాల ఉత్పత్తులు, వెల్లుల్లి, బీట్రూట్, తృణధాన్యాలు వంటివి.


పొటాషియం అధికంగా ఉండే పాలకూర బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. అలాగే అరటిపండ్లలో కూడా పొటాషియం అధికంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా అధిక రక్తపోటును పెరగకుండా అడ్డుకుంటాయి. ఇక అవిసె గింజలు, బాదం పప్పులు ఆరోగ్యకరమైన కొవ్వులను మెగ్నీషియంను కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి ఎంతో మేలు చేస్తాయి.

ఇక గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు పాల ఉత్పత్తులు కూడా ఉపయోగపడతాయి. అయితే కొవ్వు తీసిన పాలను మాత్రమే ఉపయోగించాలి. అలాగే సహజంగానే రక్తపోటును తగ్గించే వెల్లుల్లి, బీట్రూట్ ను కూడా ప్రతిరోజూ తినాల్సిన అవసరం ఉంది. సమతుల్య ఆహారాన్ని తినడంలో ధాన్యాలు కూడా భాగమే. కాబట్టి క్వినోవా, బ్రౌన్ రైస్, సజ్జలు, జొన్నలు వంటివి తరచూ తినాలి. ఓట్స్ కూడా తినడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది. రక్తపోటు కూడా పెరగకుండా ఉంటుంది.

ఆహారం ఎంత ఉత్తమమైనది తీసుకున్నా కూడా శరీరానికి సరిపడా నిద్ర ఉండాలి. నిద్ర లేకపోతే ఎంత మంచి ఆహారం తిన్నా ఆ ఫలితం కనిపించదు. రోజుకి 7 నుంచి 8 గంటల పాటు మంచి నిద్రను పొందండి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి. ఎలాంటి వ్యాధులు మీ వైపుగా రావు.

Also Read: ఉదయం పూట గోరువెచ్చని నీళ్లు తాగితే.. మతిపోయే లాభాలు !

పుదీనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వికారం, అజీర్ణతను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఇది తలనొప్పిని తగ్గించేందుకు సహాయపడుతుంది. దీని నుంచి వచ్చే సువాసన తాజాదనాన్ని అందిస్తుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు శరీరాన్ని అన్నిరకాలుగా కాపాడతాయి.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×