E-Paper
Advertisement

మీ పిల్లలు ఇతరులతో తమ వస్తువులు షేర్ చేసుకోవడానికి ఇష్టపడటం లేదా? సులభంగా ఇలా నేర్పండి

మీ పిల్లలు ఇతరులతో తమ వస్తువులు షేర్ చేసుకోవడానికి ఇష్టపడటం లేదా? సులభంగా ఇలా నేర్పండి
Advertisement

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు బొమ్మలు, చాక్లెట్లు లేదా ఇతర వస్తువులను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడకపోతే ఆందోళన చెందుతారు. పిల్లలు తమ వస్తువులను ఎవరికీ ఇవ్వకుండా కాపాడుకోవడం సహజమైన ప్రవర్తన అని నిపుణులు చెబుతున్నారు. చిన్న వయస్సులో పిల్లలు ఇది ‘నాది’, అది ‘నీది’ అనే భావన ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు తమకు ఇష్టమైన వస్తువులను ఇతరులతో పంచుకోవడానికి వెనుకాడుతుంటారు. అయితే సరైన మార్గంలో ప్రోత్సహిస్తే పిల్లల్లో ఇతరులతో కలివిడిగా ఉండడం, తమ వస్తువులు ఇచ్చిపుచ్చుకునే అలవాటు క్రమంగా పెంపొందించవచ్చు.

తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారు

పిల్లలు పెద్దలను చూసి ఎక్కువగా నేర్చుకుంటారు. మీరు ఇతరులతో ఆహారం లేదా వస్తువులు పంచుకుంటే పిల్లలు కూడా అదే అలవాటును అనుసరించే అవకాశం ఉంటుంది. మీరు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల ముందు ఇవి చేయాలి. ఏదైనా సరే ఇతరులకు అవసరమైనప్పుడు వారికి సహాయం చేయాలని, తమ వస్తువులు “పంచుకోవడం వల్ల అందరికీ ఆనందం కలుగుతుంది” అని చెప్పండి. మీ ప్రవర్తనే పిల్లలకు ఒక పాఠంగా మారుతుంది.

పిల్లలను బలవంతం చేయకూడదు

Advertisement

పిల్లలకు ఇష్టమైన బొమ్మలను వెంటనే మరొకరికి ఇవ్వాలని బలవంతం చేయడం మంచిది కాదు. అలా చేస్తే వారిలో అసురక్షిత భావన పెరిగే అవకాశం ఉంటుంది. పంచుకోవడం అంటే తమ వస్తువు శాశ్వతంగా పోతుందని వారు భావించవచ్చు. అందుకే ప్రశాంతంగా మాట్లాడి.. కొద్దిసేపు మాత్రమే మరొకరు ఆడుకుంటారని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. నమ్మకం కలిగితే పిల్లలు పంచుకోవడానికి సులభంగా సిద్ధపడతారు.

ఆటల ద్వారా పంచుకోవడం నేర్పించాలి

పిల్లలు సరదాగా నేర్చుకున్న విషయాలను త్వరగా అర్థం చేసుకుంటారు. కాబట్టి వంతుల వారీగా ఆడే ఆటలను ఎంపిక చేయండి. బోర్డ్ గేమ్స్, బిల్డింగ్ బ్లాక్స్ లేదా గ్రూప్ యాక్టివిటీస్ ఇందుకు బాగా ఉపయోగపడతాయి. ‘ఇప్పుడు నా వంతు, తర్వాత నీ వంతు’ అని చెబుతూ సహకారం, ఓర్పు గురించి వారికి నేర్పించవచ్చు.

పిల్లలకు మనోభావాలను గౌరవించాలి

Advertisement

ప్రతి పిల్లవాడికి ఎంతో ఇష్టమైన ఒక బొమ్మ లేదా వస్తువు ఉంటుంది. అలాంటి వస్తువులను బలవంతంగా పంచుకోమని చెప్పకూడదు. ఇంటికి అతిథులు వచ్చే ముందు ఏ బొమ్మలను పంచుకోవాలనుకుంటున్నారో పిల్లలతో మాట్లాడండి. కొన్ని ప్రత్యేకమైన వస్తువులను పక్కన పెట్టుకునే అవకాశం ఇవ్వండి. దీంతో వారు ఇతర వస్తువులను సులభంగా పంచుకోవడానికి సిద్ధమవుతారు.

Also Read: ఒక్క రోజులో మూడు ఋతువుల ఫీలింగ్.. వేసవిలో టూర్ వెళ్లడానికి అద్భుతమైన లొకేషన్

పిల్లలు చెప్పినట్లు చేస్తే వారిని అభినందించాలి

పిల్లలు స్వచ్ఛందంగా ఏదైనా పంచుకున్నప్పుడు వెంటనే ప్రశంసించాలి. మీ మాటలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మీ ప్రశంసలు పొందిన వారి ప్రవర్తనలో మార్పులు వస్తాయి. పిల్లలు మళ్లీ మళ్లీ చేయడానికి ప్రయత్నిస్తారు. దీంతో పంచుకోవడం వారి సహజ అలవాటుగా మారుతుంది.

ఓర్పుతో నేర్పిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి

పంచుకోవడం అనేది ఒక్కరోజులో వచ్చే అలవాటు కాదు. ప్రతి పిల్లవాడు తనదైన వేగంతో సామాజిక నైపుణ్యాలను నేర్చుకుంటాడు. కాబట్టి ఇతర పిల్లలతో పోల్చకుండా ప్రేమతో, ఓర్పుతో మార్గనిర్దేశం చేయాలి. క్రమంగా పిల్లల్లో దయ, సహకారం, ఇతరుల పట్ల గౌరవం వంటి మంచి లక్షణాలు పెరుగుతాయి. ఇవి వారి భవిష్యత్తు జీవితంలో కూడా ఎంతో ఉపయోగపడతాయి.

Related News

పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోతోంది.. టీనేజ్ విద్యార్థుల్లో ప్రమాదకర మార్పులు.. కారణాలు ఇవే

వయసు పెరిగినా అద్భుతమైన జ్ఞాపకశక్తి.. పదునైన మెదడు కోసం పది సూత్రాలు

SIR తర్వాత ఓటర్ లిస్ట్‌లో మీ పేరు కనిపించడం లేదా? మళ్లీ నమోదు చేసుకోవడానికి ఇలా చేయండి

వెన్నునొప్పి, మెడ నొప్పితో బాధపడుతున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే ఫిజియోథెరపీ అవసరం

దేవుడిపై బలమైన నమ్మకం.. ఈ తేదీల్లో పుట్టినవారిలో ఆధ్యాత్మిక శక్తి ఎక్కువ

బ్రేకప్ తర్వాత మళ్లీ డేటింగ్ ఎప్పుడు ప్రారంభించాలి? మళ్లీ ప్రేమలో పడే ముందు ఈ విషయాలు ఆలోచించండి

ఈ విధానంలో భోజనం చేస్తే షుగర్ ఎప్పుడూ పెరగదు.. మధుమేహులకు డాక్టర్ చెప్పిన సింపుల్ చిట్కా

పేరు లేని బంధం.. బ్రేకప్ కూడా కాదు.. అయినా సిచ్యుయేషన్‌షిప్ ఎందుకింత బాధిస్తుంది?

Big Stories

Advertisement
×