E-Paper
Advertisement

మీ పాత జీన్స్ పారేస్తున్నారా? ఈ చిట్కాలతో ఇంటిని అందంగా డెకరేట్ చేయొచ్చు

మీ పాత జీన్స్ పారేస్తున్నారా? ఈ చిట్కాలతో ఇంటిని అందంగా డెకరేట్ చేయొచ్చు
Advertisement

ప్రతి ఇంట్లో ఒకటి లేదా రెండు పాత జీన్స్‌లు తప్పకుండా ఉంటాయి. అవి పాతబడటం లేదా సరైన సైజు కాకపోవడం వల్ల అల్మారాలోనే పడి ఉంటాయి. చాలామంది వాటిని పనికిరావని భావించి పారేస్తారు. కానీ కొద్దిగా క్రియేటివ్‌గా ఆలోచిస్తే అదే పాత జీన్స్‌తో ఇంటిని అందంగా అలంకరించే వస్తువులగా తయారు చేయవచ్చు.

జీన్స్ తయార చేసే డెనిమ్ వస్త్రం చాలా బలంగా, మన్నికగా ఉంటుంది. అందుకే దాంతో తయారైన వస్తువులు ఎక్కువకాలం ఉపయోగపడతాయి. తక్కువ ఖర్చుతో ఇంటికి కొత్త లుక్ ఇవ్వాలనుకుంటే ఈ సులభమైన ఐడియాలను ప్రయత్నించండి.

1. స్టైలిష్ డెనిమ్ కుషన్ కవర్లు

Advertisement

పాత జీన్స్‌తో అందమైన కుషన్ కవర్లు తయారు చేయవచ్చు. ఇవి లివింగ్ రూమ్ లేదా బెడ్‌రూమ్‌కు మొడరన్ లుక్ ఇస్తాయి. ముందుగా కుషన్ సైజుకి సరిపోయేలా జీన్స్ వస్త్రాన్ని కత్తిరించండి. తర్వాత అంచులను కుట్టి కవర్ తయారు చేయండి. వేర్వేరు రంగుల డెనిమ్ ముక్కలను కలిపి ప్యాచ్‌వర్క్ డిజైన్ కూడా చేయవచ్చు. ఇవి సోఫా లేదా మంచంపై ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

2. ప్లాంటర్ కవర్లు తయారు చేయండి

ఇంట్లో ఉండే చిన్న మొక్కల కుండీలకు డెనిమ్ కవర్లు వేస్తే అవి మరింత అందంగా కనిపిస్తాయి. ముందుగా కుండి పరిమాణాన్ని కొలిచి, దానికి సరిపోయేలా జీన్స్ వస్త్రాన్ని కత్తిరించండి. దాన్ని కుండికి చుట్టి బిగించండి. కావాలంటే బటన్లు లేదా చిన్న డెకరేషన్ వస్తువులతో మరింత అందంగా తీర్చిదిద్దవచ్చు. దీంతో సాధారణ కుండీలు కూడా ప్రత్యేకంగా కనిపిస్తాయి.

3. డెనిమ్ టేబుల్ రన్నర్

Advertisement

డైనింగ్ టేబుల్ లేదా సెంటర్ టేబుల్ అందాన్ని పెంచడానికి డెనిమ్ టేబుల్ రన్నర్ మంచి ఎంపిక. జీన్స్‌లోని పొడవైన భాగాలను సన్నని పట్టీలుగా కత్తిరించి వాటిని కలిపి కుట్టండి. దీన్ని టేబుల్‌పై పరచితే ఇంటికి ప్రత్యేకమైన రస్టిక్ లుక్ వస్తుంది. అతిథులు కూడా ఈ ప్రత్యేక డెకరేషన్‌గా మెచ్చుకుంటారు.

4. వాల్ పాకెట్ ఆర్గనైజర్

చిన్న వస్తువులను భద్రపరచడానికి జీన్స్ జేబులు బాగా ఉపయోగపడతాయి. పాత జీన్స్ పాకెట్లను కత్తిరించి ఒక బలమైన వస్త్రంపై కుట్టండి. తర్వాత దాన్ని గోడకు వేలాడదీయండి. ఇందులో తాళం చెవులు, మొబైల్, పెన్నులు, ఛార్జర్లు లేదా చిన్న నోట్‌బుక్‌లను సులభంగా పెట్టుకోవచ్చు. దీంతో ఇంట్లో వస్తువులు చక్కగా సర్దుకోవచ్చు.

Also Read: కేవలం 20 నిమిషాల్లో రాత్రి డిన్నర్ రెడీ.. రుచి, పోషకాలతో 5 హెల్తీ రెసిపీలు

5. డెనిమ్ డోర్ హ్యాంగింగ్

ఇంటి ప్రధాన ద్వారాన్ని అందంగా అలంకరించడానికి డెనిమ్ డోర్ హ్యాంగింగ్ తయారు చేయండి. జీన్స్ వస్త్రాన్ని గుండ్రం, నక్షత్రం లేదా గుండె ఆకారాల్లో కత్తిరించి దారానికి కట్టండి. తర్వాత చెక్క పూసలు, రంగురంగుల బటన్లు లేదా రిబ్బన్లతో అలంకరించండి. ఇది ఇంటి ప్రవేశ ద్వారానికి అందమైన, వెల్‌కమ్ రూపానిస్తుంది.

పాత జీన్స్‌కు కొత్త లైఫ్

పాత జీన్స్‌ను పారేయడం కంటే వాటిని కొత్తగా ఉపయోగించడం మంచి ఆలోచన. ఇలా చేయడం వల్ల ఇంటి డెకరేషన్‌కు ప్రత్యేకమైన శైలి వస్తుంది. అదే సమయంలో పాత బట్టలను తిరిగి ఉపయోగించడం ద్వారా వ్యర్థాలను కూడా తగ్గించవచ్చు. కొద్దిగా సృజనాత్మకతతో మీ పాత జీన్స్‌ను ఎన్నో సంవత్సరాలు ఉపయోగపడే అందమైన హోమ్ డెకర్ వస్తువులుగా మార్చుకోవచ్చు.

Related News

32 కేజీల బరువు తగ్గిన ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆ 5 ఆహారాలను దూరం పెట్టడం వల్లే అంటూ సీక్రెట్ రివీల్!

నెల చివరికి జేబు ఖాళీ.. జీతం సరిపోవడం లేదా? ఈ స్మార్ట్ ఫైనాన్సియల్ టిప్స్ మీ కోసమే

బిగుతుగా ఉన్న బ్రా వేసుకుంటే రొమ్ము క్యాన్సర్ వస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

పచ్చి పాలు తాగడం వల్ల యువకుడికి గుండె సమస్య.. హెచ్చరిస్తున్న డాక్టర్లు

ప్రేమ అంటే రక్తంతో లవ్ లెటర్స్ రాయడం కాదు.. ఒక్కడే కొండను చీల్చిన ప్రేమికుడు

పిల్లల ప్రవర్తనలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే తల్లిదండ్రులు తప్పు చేస్తున్నట్లే..

స్టేజ్‌పై మాట్లాడేటప్పుడు చేతులు, కాళ్లు వణుకుతున్నాయా? మీ కాన్ఫిడెన్స్ పెంచేందుకు ఈజీ టిప్స్

పనికి రాని పెయింటింగ్‌ను రూ.2,800కి కొన్నాడు.. కట్ చేస్తే కోటీశ్వరుడయ్యాడు, అదెలా?

Big Stories

Advertisement
×