చలికాలంలో ఆరోగ్యాన్ని ప్రత్యేక శ్రద్ధతో చూసుకోవాల్సిన అవసరం ఉంది. శరీరం డిటాక్సిఫికేషన్‌కు ఉపయోగపడే పానీయాలను కూడా అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి. ఇక్కడ మేము రాత్రి నిద్ర పోయే ముందు తాగాల్సిన ఒక టీ గురించి ఇచ్చాము. భోజనం చేశాక ఒక గంట తర్వాత ఈ టీ తాగి నిద్రపోతే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని అల్లం, దాల్చిన చెక్క కలిపి చేస్తారు.
అల్లం, దాల్చిన చెక్క కలిపి చేసే టీని తాగడం వల్ల మన మెదడుకు, శరీరానికి హాయిగా అనిపిస్తుంది. పడుకునే ముందు దాల్చిన చెక్క అల్లం టీ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నిద్ర బాగా పడుతుంది. మానసిక ఆందోళన తగ్గుతుంది.
శరీరానికి విశ్రాంతి ఇస్తుంది
దాల్చిన చెక్క, అల్లం రెండూ కూడా నిద్రా నాణ్యతను పెంచుతాయి. అల్లం కండరాలను సడలించి శరీరంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇక దాల్చిన చెక్క… రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించి నిద్రకు భంగం కలిగించే తగ్గులను నివారిస్తుంది. కాబట్టి పడుకునే ముందు ఈ టీ తాగడం వల్ల శరీరం ప్రశాంతంగా ఉంటుంది.
జీర్ణ క్రియకు…
దాల్చిన చెక్క, అల్లం కలిపి చేసే ఈ టీలో జీర్ణ క్రియకు ఉపయోగపడే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అల్లం వికారాన్ని, వాంతి వచ్చే గుణాన్ని తగ్గిస్తుంది. జీర్ణ క్రియను ప్రోత్సహిస్తుంది. దాల్చిన చెక్క పొట్టను ప్రశాంతంగా ఉంచుతుంది. జీర్ణ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. మీరు భారీ భోజనాలు చేసినట్లయితే కచ్చితంగా దాల్చిన చెక్క అల్లం కలిపిన టీ తాగడం మర్చిపోవద్దు. ఇది ఉబ్బరం అజీర్ణం వంటి సమస్యలు రాకుండా చూసుకుంటుంది. దీనివల్ల నిద్ర కూడా భంగం కలగదు.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా దాల్చిన చెక్క, అల్లం ఈ రెండూ ఉపయోగపడతాయి. అల్లం అంటువ్యాధులతో పోరాడి జలుబు, ఫ్లూ వంటి లక్షణాలు రాకుండా కాపాడతాయి. ఇక దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి రోగనిరోధక చేస్తున్న బలంగా మారుస్తుంది. రాత్రిపూట ఒక కప్పు దాల్చిన చెక్క అల్లం టీ తాగడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. వింటర్ సీజన్ లో కచ్చితంగా ఈ టీని తాగాల్సిందే.
ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు..
ఒత్తిడి తగ్గించేందుకు కూడా దాల్చిన చెక్క అల్లం టీ ఉపయోగపడుతుంది. మానసికంగా అలసిపోయి ఒత్తిడికి గురయ్యే వారు ప్రతిరోజూ ఒకసారైనా ఈ దాల్చిన చెక్క టీ తాగుతూ ఉండాలి. ఇది ఒత్తిడిని, ఆందోళన తగ్గించి ప్రశాంతమైన నిద్ర పట్టేలా చేస్తుంది. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు ఈ టీవీ తాగడం వల్ల రక్తం స్థాయిలు రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు అధికంగా ఉంటే అది రాత్రి నిద్ర పై ప్రభావం చూపుతుంది. కాబట్టి షుగర్ నియంత్రణలో ఉండటానికి ఈ టీ ని తాగడం అలవాటుగా మార్చుకోండి.

Share