E-Paper
Advertisement

Heart Blockage: మీ గుండె ఆరోగ్యం ప్రమాదంలో ఉందా? ఈ 5 లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి

Heart Blockage: మీ గుండె ఆరోగ్యం ప్రమాదంలో ఉందా? ఈ 5 లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి
Advertisement

Heart Blockage: గుండె సంబంధిత సమస్యలు ప్రస్తుతం చాలా మందిలో మనం చూస్తున్నాం. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇదిలా ఉంటే గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు శరీరంలో కొన్ని ముందస్తు హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. ఈ లక్షణాలు కొన్ని సార్లు స్వల్పంగా ఉంటాయి. కానీ వాటిని ఎట్టి పరిస్థితిల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు అని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇంతకీ గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారి శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. ఛాతీలో అసౌకర్యం లేదా నొప్పి:

గుండె జబ్బులకు ఇది అత్యంత సాధారణ సంకేతం. ఛాతీ మధ్యలో ఒత్తిడిగా అనిపించడం, బరువుగా ఉండటం లేదా మంటగా అనిపించడం వంటివి జరిగితే అప్రమత్తంగా ఉండాలి. ఇది కేవలం కొన్ని నిమిషాల పాటు ఉండి, విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది లేదా మళ్ళీ వస్తుంది. గ్యాస్ సమస్య అని దీనిని అశ్రద్ధ చేయకూడదు.

Advertisement

2. ఎడమ చేయి లేదా భుజం నొప్పి:

గుండె నుంచి వెళ్లే నాడులు ఎడమ చేతి వైపుకు కూడా విస్తరించి ఉంటాయి. కాబట్టి.. గుండెపై ఒత్తిడి పడినప్పుడు ఆ నొప్పి ఎడమ భుజం, ఎడమ చేయి, మెడ లేదా దవడ వరకు పాకవచ్చు. ముఖ్యంగా శారీరక శ్రమ చేసినప్పుడు ఈ నొప్పి పెరిగితే అది గుండెకు సంబంధించిన సమస్యే అయ్యే అవకాశం ఉంది.

3. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది:

కొద్ది దూరం నడిచినా లేదా చిన్నపాటి పని చేసినా విపరీతంగా ఆయాసం రావడం గుండె బలహీనతకు సంకేతం. గుండె రక్తాన్ని సరిగ్గా పంపింగ్ చేయలేనప్పుడు ఊపిరితిత్తులపై ఒత్తిడి పడి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఒక్కో సారి కూర్చున్నా కూడా ఆయాసంగా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

4. అధికంగా చెమటలు పట్టడం:

ఎండలో లేకపోయినా లేదా కష్టపడకపోయినా హఠాత్తుగా ఒళ్ళంతా చల్లని చెమటలు పడుతుంటే అది గుండెపోటుకు ముందస్తు హెచ్చరిక కావచ్చు. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు, రక్తాన్ని పంపింగ్ చేయడానికి గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. దీని వల్ల శరీరం చల్లబడటానికి ప్రయత్నిస్తూ చెమటను విసర్జిస్తుంది.

5. విపరీతమైన అలసట, కళ్ళు తిరగడం:

రోజంతా ఏ పనీ చేయకపోయినా విపరీతమైన నీరసం, అలసటగా అనిపిస్తుంటే అది గుండె జబ్బు లక్షణం కావచ్చు. రక్తపోటు (BP) అకస్మాత్తుగా పడిపోవడం వల్ల మెదడుకు రక్తప్రసరణ తగ్గి కళ్ళు తిరగడం లేదా స్పృహ తప్పడం వంటివి జరుగుతాయి.

ఇతర సాధారణ లక్షణాలు:

కాళ్ళ వాపులు

హృదయ స్పందనలో మార్పు

తగ్గని దగ్గు 

పైన పేర్కొన్న లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా భయపడకుండా, వెంటనే డాక్టరును కలిసి ECG లేదా 2D Echo వంటి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. సరైన సమయంలో స్పందించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.

Related News

బిజీ లైఫ్‌లోనూ దంపతుల మధ్య దూరం పెరగకూడదంటే.. ఈ 7 విషయాలు మర్చిపోవద్దు!

పిల్లల్లో క్యాన్సర్‌కు ముందు కనిపించే లక్షణాలివే.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి!

ఆనందాలు వెల్లివిరిసే వేళ..ఆత్మీయులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!

కడుపు నిండా తిన్నా శరీరంలో శక్తి లేదా? మీరు చేసే తప్పులివే

కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ప్రతి విషయంలో తమ అభిప్రాయం చెబుతుంటారు

వయసు పెరిగినా శరీరంలో చరుకుదనం తగ్గదు.. డాక్టర్ సూచించిన ఈ 6 అలవాట్లు పాటిస్తే

మీరు ఇంట్లోనే RO వాటర్ తాగుతున్నారా? అది విషపూరితం కావొచ్చు.. ఈ 3 సంకేతాలు గుర్తించండి

ఒకేసారి ఎక్కువ టాబ్లెట్స్ తీసుకుంటున్నారా? జాగ్రత్త ఈ కాంబినేషన్లు ప్రమాదకరం

Big Stories

Advertisement
×