BigTV English
Advertisement

Bad Cholesterol: మీ గుండె బాగుండాలంటే.. ఈ కలర్ ఫుడ్స్ తినేయండి, ఈ రంగే ఎందుకంటే?

Bad Cholesterol: మీ గుండె బాగుండాలంటే.. ఈ కలర్ ఫుడ్స్ తినేయండి, ఈ రంగే ఎందుకంటే?

చెడు కొలెస్ట్రాల్ కారణంగా గుండె అనేక రోగాల బారిన పడుతోంది. ముఖ్యంగా యువత కూడా గుండె సమస్యలు పెరుగుతున్నాయి. ఇలా గుండె పోటు లేదా గుండె సంబంధిత వ్యాధులు పెరగడానికి కారణం. మనం తినే తిండే గుండె ఆరోగ్యం కోసం కొన్ని ప్రత్యేక ఆహారాలను తినాలి.


శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిలో గుండెపోటు కూడా ఒకటి. కొలెస్ట్రాల్ మన శరీరానికి అత్యవసరమైనదే. కొలెస్ట్రాల్ అనేది కణాలు, హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి అవసరమైన మైనం లాంటి పదార్థం. కొలెస్ట్రాల్ శరీరానికి ఎంత అవసరమో అంతమేరకే ఉండాలి. అది ఎక్కువగా పేరుకుపోతే చెడు కొలెస్ట్రాల్ రూపంలో రక్తనాళాల్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీనివల్ల గుండెకు రక్తప్రసరణ సరిగా జరగదు. అందుకే గుండెపోటు, స్ట్రోక్ వంటివి వస్తూ ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోకుండా ఉండాలి. అంటే జంక్ ఫుడ్ మానేయాలి. అలాగే కొవ్వు అధికంగా ఉండే మాంసం వంటివి తినడం తగ్గించుకోవాలి. వ్యాయామం చేయాలి. చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేసే కొన్ని ఎల్లో సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. వీటిని ప్రతిరోజు తినేందుకు ప్రయత్నించండి.

పసుపు
పసుపులో శోథ నిరోధక లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహకరిస్తుంది. ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేస్తుంది. ఇంట్లో వండిన భోజనంలో పసుపు ఉండేలా చూసుకోండి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.


నిమ్మకాయ
నిమ్మకాయను కూడా ఆహారంలో నిత్యం ఉండేలా చూసుకోవడం ముఖ్యం. ఎందుకంటే దీనిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. వీటిలో ఉండే సిట్రిక్ యాసిడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించే రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. తాజా నిమ్మరసాన్ని మీరు వండే కూరల్లో చల్లుకొని తినండి చాలు. నిమ్మరసంలోని పోషకాలు శరీరానికి అందుతాయి.

మొక్కజొన్న
మొక్కజొన్న గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ ను నియంత్రించే ఫైబర్ ను కలిగి ఉంటుంది. కాబట్టి గుండె, ధమనలకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలి. అంటే మొక్కజొన్నను ఆహారంలో భాగం చేసుకోవాలి.

అల్లం
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండెను రక్షిస్తుంది. మీరు రోజువారీ ఆహారంలో అల్లాన్ని భాగం చేసుకోవాలంటే ప్రతి కూరలో కూడా అల్లం తరుగును వేయండి. అలాగే అల్లంతో టీ చేసుకుని తాగేందుకు ప్రయత్నించండి.

అరటి పండ్లు
అరటి పండ్లు ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరలోనే ఉంటాయి. రోజుకు ఒక అరటిపండు తింటే చాలు కావలసినంత పొటాషియం, ఫైబర్ శరీరానికి చేరుతుంది. అలాగే అరటిపండు రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ ను కూడా పెరగకుండా నియంత్రిస్తుంది. మీ రోజువారీ ఆహారంలో అరటి పండ్లను చేర్చుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ధమనుల్లో ఇలాంటి అడ్డంకులు ఏర్పడకుండా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తి అరటిపండ్లకు ఉంది.

Also Read: అలా నడుస్తున్నారా? జాగ్రత్త.. ఆ భయానక వ్యాధులు వస్తాయ్

ఇక్కడ మేము చెప్పిన పసుపు రంగులో ఉండే సూపర్ ఫుడ్స్ అన్నింటినీ ప్రతిరోజూ తినేందుకు ప్రయత్నించండి. లేదా వీటిలో కనీసం రెండయినా రోజు మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీ ఆహారపు అలవాట్లను మార్చుకుని గుండెకు రక్షణ మీరే ఇవ్వాలి.

Related News

Criticism: పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా.. సానుకూల ధోరణే సరైన పరిష్కారం!

Mental Health: ఈ లక్షణాలు మీలో ఉంటే.. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లే ?

Air Pollution: పిల్లల్లో ఈ సమస్యలా ? వాయు కాలుష్యమే కారణం !

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా వాడితే.. పూర్తిగా షుగర్ కంట్రోల్

Surya Namaskar benefits: సర్వరోగాలకు ఒకటే పరిష్కారం.. ఆరోగ్యంతో పాటు సమయమూ ఆదా!

Feeding Mistakes: ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ అన్నం తినిపిస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Exercise: రోజూ వ్యాయామం చేయడానికి టైం లేకపోతే.. వీకెండ్ వారియర్స్‌గా మారిపోండి!

Village style Fish Pulusu: విలేజ్ స్టైల్ లో చేపల పులుసు చేశారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, రెసిపీ అదిరిపోతుంది

Big Stories

×