BigTV English

Gastric Problem : ఇవి తింటే గ్యాస్ రావడం పక్కా..!

Gastric Problem : ఇవి తింటే గ్యాస్ రావడం పక్కా..!

Gastric


Gastric Problem Causes : మనం తీసుకునే ఆహారమే మనకు శ్రీరామరక్ష. మనం తీసుకునే ఆహారంతో మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. కొందరికి మాత్రం సరైన ఆహారం తీసుకుపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇందులో సాధారణంగా ప్రతి ఒక్కరిని వేంటాడే సమస్య గ్యాస్ ట్రబుల్. దీనివల్ల కడుపులో ఉబ్బరంగా ఉంటుంది. ఏదైనా ఆహారం తిన్న తర్వాత ఈ సమస్య వస్తుంటుంది. ఇది చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది.

గ్యాస్ సమస్య ఎంతలా బాధిస్తుందంటే.. ఊపరి తీసుకోవడం భారంగా ఉంటుంది. ఛాతిపై బరువుగా ఉంటుంది. అజీర్ణ సమస్యలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని ఫుడ్స్ తీసుకున్న తర్వాత కడుపులో గ్యాస్‌ ఫామ్ అవుతుంది. ఈ నేపథ్యంలో కొన్నింటికి దూరంగా ఉండాలి. అవేంటో తెలుసుకుందాం..


READ MORE : ఫైబర్ ఫుడ్స్‌.. అదిరిపోయే బెనిఫిట్స్..!

కొన్ని అధ్యయనాల ప్రకారం.. క్యాబేజీ, వెల్లుల్లి, ఉల్లిపాయ తింటే వెంటనే కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది. జీర్ణశక్తి బలహీనంగా ఉన్న వారిలో ఈ సమస్య కాస్త అధికంగా ఉంటుంది. అటువంటి వారు కొన్నింటికి దూరంగా ఉండాలని భావిస్తుంటారు. ఏ ఫుడ్స్ గ్యాస్ ఉత్పత్తి చేస్తాయో తెలుసుకుంటే మంచిది.

వెల్లుల్లి, ఉల్లిపాయలో ఫ్రక్లాన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి కరిగే ఫైబర్ మిశ్రమంతో కలిగుంటాయి. అవి కడుపులో తీవ్రమైన వాయువులను సృష్టిస్తాయి.

క్యాబేజి, బ్రోకలీ,కాలే వంటి కూరగాయల్లో రాఫినోస్ ఉంటుంది. ఈ రాఫినోస్‌ను బాడీ తేలిగ్గా జీర్ణించుకోలేదు. దీని కారణంగా కడుపులో ఇబ్బంది కలుగుతుంది. ఉబ్బరంగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం తగ్గిస్తే మంచిది.

పప్పు ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే.. గ్యాస్ ట్రబుల్ ఉన్న వారికి కడుపులో గడబిడ తెచ్చిపెడతాయి. బీన్స్‌లో ఉండే హై ఫైబర్, ఒలిగోశాకరైడ్స్ ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల కడుపులో ఉబ్బరంగా ఉంటుంది. వీటిలో బాడీలో విచ్ఛిన్నం కానీ చక్కెర పదార్థాలు ఉంటాయి.

కొందరు సలాడ్స్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. పచ్చి కూరగాయలతో సలాడ్ చేసుకుని తింటారు. వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. అందుకే వీటిని తిన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

చాలా మంది కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ తాగుతారు. ఈ డ్రింక్స్ వల్ల గ్యాస్ సమస్య తగ్గిపోతుందని భావిస్తుంటారు. కానీ, ఇందులో కార్బన్ డైయాక్సైడ్ అధికంగా ఉంటుంది. ఇది కడుపులోకి ప్రవేశించినప్పుడు కడుపులో నొప్పి వస్తుంది. కూల్ డ్రింక్స్ తరచూ తీసుకుంటే ఉబ్బరం, త్రేన్పుల వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

READ MORE : రాత్రిపూట జుట్టుకు నూనె రాస్తున్నారా..?

ఆహారం తిన్న 30 నిమిషాల తర్వాత సెలెరీ, సోంపు, జీలకర్ర కషాయాలు తీసుకుండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ధనియాల కషాయం తీసుకోవడం జీర్ణక్రియకు చాలా మంచిది. వీటిని బాగా నమిలి కూడా తినొచ్చు.

Disclaimer : ఈ సమాచారాన్ని పలు అధ్యయనాల ఆధారంగా మీ అవగాహన కోసం అందిస్తున్నాం. దీనిని కేవలం సమాచారంగా భావించండి.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×