Diet For Weight Loss: ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా పెరిగిన బరువును తగ్గించుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడానికి చాలా కష్టపడాలి. దీన్ని తగ్గించుకోవడానికి కొందరు గంటల తరబడి వ్యాయామం చేస్తుంటారు. కానీ ఎలాంటి డైట్ ప్లాన్ పాటించకపోవడం వల్ల సరైన ఫలితాలు రావడం లేదు.
ఒక పక్కా డైట్ ఫాలో అవుతూ వ్యాయామం చేస్తే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మహిళలకు పొట్ట చుట్టూ బెల్లీ ఫ్యాట్ పెరిగినప్పుడు వ్యాయామం చేసే టైం అంతగా ఉండక పోవచ్చు. ఇలాంటి సమయంలో మంచి డైట్ కూడా మీకు ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. మహిళల బెల్లీ ఫ్యాట్ తగ్గించే డైట్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని మహిళలు సులభంగా ఫాలో అయిపోవచ్చు.
కొన్ని ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.కొంతమంది ఈ కొవ్వును తగ్గించుకోవడానికి జిమ్‌లో చేరతారు. కానీ ఆహారం సరిగ్గా లేకపోతే, బరువు తగ్గరు. అటువంటి పరిస్థితిలో, కొవ్వు తగ్గడానికి మహిళలు ఏమి తినాలో నిపుణులు చెబుతున్నారు.
1.మహిళలు బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఈ డైట్ ప్లాన్‌ని అనుసరించవచ్చు (ఉదయం 7:00)
-చియా గింజలతో నిమ్మరసం
-జీలకర్ర నీరు
– అల్లం-పసుపు టీ
– వేడి నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్
2.అల్పాహారం (ఉదయం 8:00)
-వెజిటబుల్ ఆమ్లెట్ మరియు 1 మల్టీగ్రెయిన్ టోస్ట్
-డ్రై ఫ్రూట్స్, సీడ్స్‌తో కూడిన ఓట్స్
-మూంగ్ దాల్ చిల్లాను పుదీనా చట్నీతో కలిపి తినవచ్చు.
-బచ్చలికూర, ప్రొటీన్లు, బాదం పాలు, అరటిపండు కలపడం ద్వారా స్మూతీని తయారు చేసుకుని త్రాగండి.
-2 ఉడికించిన గుడ్లు, అవోకాడో టోస్ట్
3. మధ్యాహ్న అల్పాహారం (ఉదయం 11:00)
– కొబ్బరి నీరు
-ఫ్రూట్స్ , నట్స్ చేతినిండా
– మజ్జిగ
– కాల్చిన మఖానా, పప్పు
4.భోజనం (మధ్యాహ్నం 1:30)
-1 రోటీ, చీజ్, ఏదైనా కర్రీతో పాటు పప్పుతో తినండి. సలాడ్‌ని కూడా చేర్చుకోవడం మంచిది.
-కిడ్నీ బీన్స్ లేదా కాయధాన్యాలు , సలాడ్‌తో బ్రౌన్ రైస్ తినండి.
-క్వినోవా కిచ్డీని పెరుగుతో తినండి.
-మిల్లెట్ రోటీని వెజిటెబుల్ కర్రీ, పెరుగుతో తినండి.
5. సాయంత్రం అల్పాహారం (సాయంత్రం 4:00)
– వేయించిన బాదంపప్పుతో పాటు గ్రీన్ టీ తాగండి
-1 ఉడికించిన గుడ్డు, మూలికా టీ
– 1 పండు తినండి. ఆపిల్, జామ లేదా నారింజ వంటివి.
Also Read: బట్టతలపై కూడా జుట్టు రావాలంటే.. ఇలా చేయండి !
6. రాత్రి భోజనం (7:30 pm)
– కాల్చిన చికెన్ లేదా చేపలు
-లెంటిల్ సూప్, మల్టీగ్రెయిన్ టోస్ట్
– కూరగాయలతో పనీర్ టిక్కా
-బచ్చలికూర లేదా టమోటా సూప్ , సలాడ్
ఈ ఆహారాన్ని అనుసరించడంతో పాటు, రోజు 2 నుండి 3 లీటర్ల నీరు త్రాగాలి. దీంతో పాటు, ఆహారాన్ని స్టీమింగ్, గ్రిల్లింగ్ లేదా రోస్ట్ చేసి తినండి. అంతే కాకుండా ప్రతి రోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. కొన్ని రోజుల పాటు ఈ డైట్ ఫాలో అయితే మీరు తక్కువ సమయంలోనే ఈజీగా బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.