Effects of Makeup: మేకప్ వాడటం అనేది ఈ రోజుల్లో చాలామందికి రోజువారీ అలవాటుగా మారింది. బయటకి వెళ్ళేటప్పుడు అందంగా కనిపించాలన్న కోరికతో ముఖ్యంపై వున్న మచ్చలను కనిపించకుండా మేకప్ వేసుకుంటారు. కాని అదే మేకప్ ఎక్కువగా వాడితే, ముఖ్యంగా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మానికి అనేక సమస్యలు వస్తాయి. మేకప్ వాడినప్పుడు చర్మంపై మనం వాడే క్రీమ్‌లో ఉండే కెమికల్స్ ముఖంపై పేరుకుపోతాయి. ఇవి చర్మపు రంధ్రాలను మూసేస్తాయి. దాంతో చర్మం లోపల పేరుకుపోయిన దుమ్ము బయటకు రాలేక మొటిమలు, పింపుల్స్ వస్తాయి. కొందరికి తరచూ మొటిమలు రావడానికి ప్రధాన కారణం మేకప్ సరిగా శుభ్రం చేయకపోవడమే.
ఇంకా మేకప్ ఉత్పత్తులు మంచి వాసన ఉంటే మనం ఇట్టే ఆకర్షితులవుతారు. అంతేకాదు అలా తయారు చేసిన క్రీములు, కెమికల్స్ వల్ల అలర్జీ వచ్చే అవకాశం ఎక్కువ. దీనిని వాడటం వలన చర్మం ఎర్రబడటం, మంట రావటం, దురద, పొడిబారటం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవాళ్లకు ఈ సమస్యలు మరింతగా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు కాంటాక్ట్ డెర్మటైటిస్ అనే ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. మేకప్ వేసినప్పుడు వాడే బ్రష్‌లు, స్పాంజ్‌లు శుభ్రం చేయకపోతే వాటిపై బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్లు కలిగిస్తాయి.
Also Read: Black Tomatoes: నల్ల టమాటాలు కూడా ఉన్నాయా? దీన్ని తింటే ఇన్ని లాభాలా !
మేకప్ ఎక్కువ సమయం పాటు ముఖంపై ఉంచితే చర్మానికి ఆక్సిజన్ అందకుండా పోతుంది. ఫలితంగా చర్మం మసకబారుతుంది, సహజ కాంతి తగ్గుతుంది. అంతేకాదు, రాత్రి మేకప్ వేసుకుని పడుకోవడం చాలా ప్రమాదకరం. రాత్రి సమయంలో చర్మం సహజంగా పునరుద్ధరణ ప్రక్రియలు చేస్తుంది. కానీ మేకప్ ఉండటం వలన పొర ఉండటం ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. ఫలితంగా వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపిస్తాయి. ముఖంపై చిన్న చిన్న గీతలు, మచ్చలు, రంగు మార్పులు త్వరగా వస్తాయి.
మరొక సమస్య ఏంటంటే గడువు ముగిసిన మేకప్‌ను వాడటం. ఇవి చర్మానికి దెబ్బతినేలా చేస్తాయి. వాడిన వెంటనే అది ఎదైనా సమస్యగా అనిపిస్తే దాన్ని వాడకుండా ఉండటం మంచిది. తెలిసి తెలియక వాడిన దాని ప్రభావం క్రమంగా చర్మాన్ని పాడుచేస్తాయి. కొందరు మేకప్ వేసిన తర్వాత రోజంతా నీళ్లు తాగరు, చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయరు. దాంతో పొడిబారటం, చర్మం కాంతిని కోల్పోవడం మొదలవుతుంది. మొత్తం మీద మేకప్ వాడటం వల్ల అందం తాత్కాలికంగా పెరిగినట్లు అనిపించినా, జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. సరైన శుభ్రత, సరైన ఉత్పత్తుల ఎంపిక తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే మేకప్ వల్ల వచ్చే సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడుతూ చివరకు సహజ అందాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి.