BigTV English

Mumbai floods: ముంబై అల్లకల్లోలం.. మునిగిన అండర్ గ్రౌండ్ మెట్రో..!

Mumbai floods: ముంబై అల్లకల్లోలం.. మునిగిన అండర్ గ్రౌండ్ మెట్రో..!

Mumbai floods: భారీ వర్షాలు ముంబైను ముంచెత్తుతున్నాయి. 6 గంటల్లో 200 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్ష బీభత్సానికి మొత్తం పది మంది ప్రాణాలు కోల్పోయారు. కుండపోత ప్రభావం రోడ్డు, రైలు, విమాన సర్వీసులపైనా ప్రభావం తీవ్రంగా పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి. వాహనదారులు, ప్రయాణికులు నడుముల్లోతు వరదలోనే ముందుకు సాగాల్సి వచ్చింది.


అస్తవ్యస్తమైన జనజీవనం
రైలు మార్గాలపై కొన్ని ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల మేర వరద చేరడంతో సెంట్రల్‌ రైల్వే నడిపే అత్యంత కీలకమైన సబర్బన్‌ సర్విసులను రద్దు చేసింది. దీంతో, ప్రయాణికులు ఎక్కడివారక్కడే ఉండిపోయారు. రైళ్లు పట్టాలపైనే నిలిచిపోవడంతో జనం బయటకు దూకి వరద నీళ్లలోనే గమ్యస్థానాలకు కాలినడకన బయలుదేరారు. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయలేదు. హైకోర్టు సైతం మధ్యాహ్నం 12.30 గంటల వరకే పనిచేసింది.

స్తంభించిన రైలు, రోడ్డు, విమాన సర్విసులు
మంగళవారం 345 విమానాలకు రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మరోవైపు సుమారు 700 మందితో నిన్న సాయంత్రం బయలుదేరిన మోనో రైళ్లు రెండు అర్థంతరంగా నిలిచిపోవడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. మైసూర్‌ కాలనీ–భక్తి పార్క్‌ స్టేషన్ల మధ్యన ఉండగా విద్యుత్‌ సరఫరా లోపంతో అర్థంతరంగా నిలిచిపోయింది.


మధ్యలో నిలిచిపోయిన రెండు మోనో రైళ్లు
అయితే ఏసీ పనిచేయకపోవడంతో అందులోని 582 మంది గంటపాటు ఉక్కిరిబిక్కిరియ్యారు. స్పృహతప్పిన కనీసం 15 మందిని ఆస్పత్రిలో చేర్పించారు. ఫైర్, మున్సిపల్‌ సిబ్బంది ప్రయాణికులందరినీ సురక్షితంగా ఖాళీ చేయించి, బస్సులో గమ్యస్థానాలకు పంపించారని సీఎం ఫడ్నవీస్‌ చెప్పారు. వడాలా స్టేషన్‌కు సమీపంలో 200 మంది ప్రయాణికులతో నిలిచిపోయిన మరో మోనోరైలును అధికారులు విజయవంతంగా వెనక్కి తీసుకెళ్లారు.

వచ్చే 48 గంటలు కీలకమన్న సీఎం
గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటి వరకు 21మంది చనిపోయారు. వచ్చే 48 గంటలు అత్యంత కీలకమైన సమయమని సీఎం అన్నారు. ముంబై, థానె, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్‌ జిల్లాల్లో హై అలెర్ట్‌ ప్రకటించామని చెప్పారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జురాల, కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు.. భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన ఐదు గేట్లను పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు నీటిమట్టం 2.32 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం 2.12 టీఎంసీలుగా కొనసాగుతుంది. 7వేల 200 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు.

Also Read: భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతో తెలుసా?

కృష్ణా, గోదావరి నదులకు పెరుగుతున్న వరద ఉద్ధృతి
భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రాజెక్టు ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.92 లక్షల క్యూసెక్కులుగా ఉంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42 అడుగులకు చేరింది. ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7.38లక్షల క్యూసెక్కులుగా ఉంది. జిల్లా యంత్రాగం అప్రమత్తమై అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సహాయక చర్యలకు 16 కోట్లు మంజూరు చేసింది. రక్షణ చర్యల కోసం SDRF బృందాలను సిద్ధం చేసింది. కృష్ణా, గోదావరి నది పరీవాహక ప్రాంత ప్రజలు, లంక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు.

Related News

Nepal Landslide: కొండచరియలు విరిగిపడి.. 14 మంది మృతి

Cough Syrup: షాకింగ్.. దగ్గు మందులో విషపూరిత రసాయనాలు, టెస్టుల్లో ఏం తేలిందంటే?

Cyclone Shakti: దూసుకొస్తున్న శక్తి సైక్లోన్.. తీర ప్రాంతాలకు ఐఎండీ కీలక హెచ్చరికలు!

MLA KP Mohanan: ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. చొక్కాపట్టుకుని నడిరోడ్డుపై నిలదీసిన స్థానికులు, వైరల్ వీడియో

Rajnath Singh: సర్ క్రీక్ పై చేయి వేస్తే కరాచీని లేపేస్తాం – రాజ్ నాథ్ సింగ్ వార్నింగ్

Warning To Pakistan: అలా చేస్తే, మ్యాప్‌లో లేకుండా పోతారు.. పాకీలకు ఇండియన్ ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్

Cough Syrup: దగ్గు మందు మరణాలు.. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

IAF Chief: అవన్నీ కట్టుకథలు.. ఆపరేషన్ సింధూర్‌పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Big Stories

×