E-Paper
Advertisement

సేమియా ఉప్మా బోర్ కొట్టిందా? ఇలా ఎగ్ సేమియా ట్రై చేయండి!

సేమియా ఉప్మా బోర్ కొట్టిందా? ఇలా ఎగ్ సేమియా ట్రై చేయండి!
Advertisement

Egg Semiya Recipe: ఉరుకులు పరుగుల బిజీ జీవితంలో ఉదయాన్నే వంట గదిలో గంటల తరబడి గడపడం ఎవరికీ సాధ్యం కాదు. ముఖ్యంగా బ్యాచిలర్స్ లేదా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు క్షణం తీరిక ఉండదు. అలాంటి సమయాల్లో తక్కువ సమయంలో కడుపు నిండేలా, రుచి కరమైన ఆహారం తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా సేమియాతో ఉప్మా లేదా పాయసం చేసుకుంటూ ఉంటాం. కానీ.. ఒకసారి ఇలా ‘ఎగ్ సేమియా’ ట్రై చేశారంటే రోజూ ఇదే కావాలని అడుగుతారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ రెసిపీని కేవలం 10 నిమిషాల్లో ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:

సేమియా: 1 కప్పు

Advertisement

గుడ్లు: 2

ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగినది)

Advertisement

పచ్చిమిర్చి: 2 (చీలికలు)

అల్లం వెల్లుల్లి పేస్ట్: అర స్పూన్

టొమాటో: 1 (చిన్న ముక్కలు)

కారం మరియు పసుపు: రుచికి సరిపడా

ధనియాల పొడి, గరం మసాలా: అర స్పూన్ చొప్పున

నూనె లేదా నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు

కొత్తిమీర: కొద్దిగా

తయారీ విధానం:

1. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి ఒక కప్పు సేమియా వేసి దోరగా వేయించుకోవాలి. (ఇది ఆప్షనల్, ముందుగా వేయిస్తే పొడిపొడిగా వస్తుంది). ఇప్పుడు మరో గిన్నెలో నీళ్లు మరిగించి, అందులో కొద్దిగా ఉప్పు, నూనె వేసి సేమియాను ఉడికించాలి. సేమియా మెత్తగా కాకుండా.. 80% మాత్రమే ఉడికేలా చూసుకోవాలి. ఆ తర్వాత నీటిని వంపేసి, సేమియాపై చల్లటి నీళ్లు పోస్తే పొడిపొడిగా ఉంటుంది.

2.ఇప్పుడు అదే పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ కలర్ రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు పాన్ మధ్యలో కొద్దిగా స్థలం చేసి రెండు గుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. గుడ్లు కొద్దిగా ఉడికిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కలుపుతూ ఫ్రై చేయాలి.

Also Read: పక్కా తెలంగాణ స్టైల్ సర్వపిండి..ఒక్క సారి టేస్ట్ చేేస్తే అస్సలు వదలరు!

3. ఎగ్ ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలాలు అన్నీ గుడ్డు పట్టేలా రెండు నిమిషాలు మగ్గనివ్వాలి.

4. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పొడి పొడిలాంటి సేమియాను ఈ ఎగ్ మసాలా మిశ్రమంలో వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి సేమియాకు మసాలా బాగా పట్టేలా మెల్లగా కలపాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. గుమగుమలాడే వేడివేడి ఎగ్ సేమియా రెడీ!

తక్కువ సమయంలో.. ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతోనే ఎంతో రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ లేదా ఈవెనింగ్ స్నాక్ రెసిపీ కావాలనుకుంటే ఈ ఎగ్ సేమియా చక్కటి ఆప్షన్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ కుటుంబ సభ్యులకు రుచి చూపించండి!

Related News

నెల రోజులపాటు నిల్వ ఉండే రవ్వ లడ్డు..క్షణాల్లోనే చేయండిలా!

అతనంటే ఎంతో ఇష్టం.. కానీ ఐ లవ్ యు చెప్పడానికి భయం.. మనసులో మాట చెప్పేందుకు టిప్స్

ఈ ముగ్గురికి పొరపాటున కూడా సాయం చేయకండి..లేదంటే మీ జీవితమే నాశనం!

నిద్రలో కాలి కండరాలు పట్టేయడానికి కారణమేంటి? ఎప్పుడు ప్రమాదకరమంటే..

నాన్ స్టాప్ డాండియా డాన్స్ చేసినా చెదరని మేకప్.. రాత్రంతా ఫ్రెష్ లుక్ కోసం టిప్స్

సన్‌స్క్రీన్ వాడుతున్నా చర్మం నల్లబడుతోందా? మీరు చేస్తున్న తప్పులు ఇవే

10 నిమిషాలు లేదా 20 నిమిషాలు? ఎంతసేపు స్నానం చేస్తే చర్మ ఆరోగ్యానికి మంచిది?

Big Stories

Advertisement
×