Moeen Ali On IND VS PAK : 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న క్రమంలో ఐసీసీని ఉద్దేశించి మొయిన్ అలీ షాకింగ్ స్టేట్ మెంట్ చేశారు. 2027 వరల్డ్ కప్‌లో టీమిండియా, పాక్ మధ్య ఫైనల్స్ జరిగేలా ఐసీసీ కుట్రలు చేస్తోందని మొయిన్ అలీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 2017 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా కూడా ఇలాంటి కుట్రలు జరిగాయని, ఇప్పుడు అలాంటి సాహాసాలకు ఐసీసీ తెరలేపుతోందని తెలిపారు. టీమిండియా, పాక్ మధ్య ఫైనల్స్ జరిగితే కోట్లు వస్తాయని ఈ కుట్రలు చేస్తున్నట్టు బాంబ్ పేల్చారు. ఇంత దుర్మార్గం అవసరమా ? ఐసీసీ ఇలాంటి చర్యలకు పాల్పడితే, రోడ్డున పడుతుందని హెచ్చరించారు. దీంతో ఐసీసీపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మొయిన్ అలీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
2017 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఫైనల్ మ్యాచ్ టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య నిర్వహించేలా ఐసీసీ కుట్రలకు తెరలేపిందని ఐసీసీపై మొయిన్ అలీ సంచలన ఆరోపణలు చేశారు.కావాలనే ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్ లు నిర్వహించి, ఐసీసీ క్యాష్ చేసుకుంటోందన్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా అలాంటి పరిస్థితులు ఉండబోతున్నట్టు పేర్కొన్నారు. తన అంచనా ప్రకారం 2027 వరల్డ్ కప్‌లో టీమిండియా, పాక్ మధ్య ఫైనల్స్ జరుగనున్నట్టు బాంబ్ పేల్చారు. దానికి కోసం ఐసీసీ, బీసీసీఐ, జై షా అందరూ కలిసి కుట్రలకు తెరలేపుతున్నట్టు ఆరోపణలు చేశారు.