Hyderabad T20: హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈ నెల 14న జరిగే భారత్ – వెస్టిండీస్ 4వ T20 మ్యాచ్ కు మల్కాజ్ గిరి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 40 వేల మంది ప్రేక్షకులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో మొత్తం 2,200 మంది పోలీసులతో అక్కడ బందోబస్తు ఎర్పాటు ,చేయనున్నారు. దీంతో పాటుగా 5గురు DCP లు, 5 Addl DCP లు, 15 ACP లు, 50 ఇన్స్పెక్టర్లు ఫీల్డ్ లో ఉంటారు. SOT, Octopus, Bomb Squad, SHE Teams కూడా అందుబాటులో ఉంచనున్నారు.
స్టేడియం వ్యాప్తంగా 408 CCTV లు, 2 డ్రోన్లతో నిరంతర నిఘా పెట్టనున్నారు. సోషల్ మీడియాను కూడా మానిటర్ చేస్తున్నారు. ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలను మధ్యాహ్నం 3 గంటల నుండి హెవీ వెహికల్స్‌కు దారి మళ్లింపు చేయనున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. స్టేడియం లోపల VVIP, VIP లకు మాత్రమే పార్కింగ్ సదుపాయం కల్పించారు. సాధారణ ప్రేక్షకులకోసం ఉప్పల్ చౌరస్తా – రామంతపూర్ రోడ్డులోని జైన్ ప్రాపర్టీస్, NGRI, DSL మాల్ వద్ద పార్కింగ్‌ను దాదాపుగా మొత్తం 8 వేల వాహనాలకు చోటు కలప్పించారు.
Also read: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోరుకు సీపీఎం పార్టీ సై.. ఈ జిల్లాలపై స్పెషల్ ఫోకస్!
సికింద్రాబాద్ వైపు నుండి వచ్చేవారు తార్నాక – హబ్సిగూడ మీదుగా, అంబర్పేట్ నుండి వచ్చేవారు రామంతపూర్ – DSL మాల్ మీదుగా రావాలని పోలీసులు తెలిపారు. అయితే ఇక ప్లేయర్లు బంజారాహిల్స్ నుండి పంజాగుట్ట – తార్నాక మీదుగా స్టేడియంకు రానున్నారు. దీంతో టికెట్లు అధికారిక సైట్లలోనే కొనాలని పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వస్తే నో ఎంట్రీ అని ఆటస్థలంలోనికి నిషేధిత వస్తువులు తీసుకురావద్దని, వీలైనంత వరకు మెట్రో, TSRTC బస్సులు వాడుకోవాలని పోలీసులు తెలిపారు. మహిళల భద్రత కోసం 5 ప్రత్యేక షీ టీమ్స్. HCA ఆధ్వర్యంలో Say No To Drugs క్యాంపెయిన్ ను ఎర్పాటు చేయనున్నట్టు పోలీస్ అధికారుల తెలిపారు.
Also read: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో..అదిరిపోయే డిష్‌వాషర్లు,ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు