Flax seeds benefits: అవిసె గింజలు తినడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్లు, మినరల్స్, జింక్‌తో పాటు ఇతర పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. చర్మాన్ని సంరక్షించడంలో అవిసె గింజలు కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అవిసె గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయట. వాటిలో ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ల సమ్మేళనం, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా గుండె జబ్బలను తగ్గించేందుకు, శరీరంలో నొప్పి వాపులను తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. అవిసె గింజల్లోని విటమిన్-E గుండె ఆరోగ్యం కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అవిసె గింజలు అందానికి కూడా మేలు చేస్తాయి. అవిసె గింజలు తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుందట. అవిసె గింజల్లో ఉండే విటమిన్-E యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు రాకుండా చేస్తాయట. వీటితో తయారు చేసిన మాస్క్ వేసుకుంటే చర్మంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో కాంతివంతమైన, ఆరోగ్యవంతమైన చర్మం పొందడం సులభతరం అవుతుందట.
ALSO READ: వేడిగా ఉందని కూల్ కూల్ ఐస్ క్రీంలు తింటే ఖతమే
అవిసె గింజలలో ఉండే మాంగనీస్, జింక్ కూడా చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి జలుబు, ర్యాషెస్, ఇతర చర్మ సమస్యల నుండి రక్షించడానికి సహాయపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, అవిసె గింజలను తరచుగా తినడం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా మారుతుందట.
అవిసె గింజలు కేవలం ఆహారంగా కాకుండా, సౌందర్య ఉత్పత్తులలో కూడా విస్తృతంగా ఉపయోగించబడతాయి. అవిసె గింజల పేస్ట్‌ని జుట్టు కోసం ఉపయోగిస్తే మంచిదట. అవిసె గింజల ఆయిల్ జుట్టు పెరుగుదలని ప్రోత్సహించడంతో పాటు, జుట్టు ఒత్తిడి, దురద, స్ప్లిట్ ఎండ్స్‌ని కూడా తగ్గిస్తుంది. అవిసె గింజల్ని ఆహారంలో కలిపి తీసుకోవడం జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుందట.
ఎలా తీసుకోవాలి?
తరచుగా తీసుకునే ఆహారంలో అవిసె గింజలను చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాటిని సలాడ్, పేస్టు లేదా పచ్చడిలో కూడా ఉపయోగించవచ్చు.
జుట్టు కోసం అవిసె గింజల ఆయిల్ ఉపయోగించవచ్చు. దీనిని జుట్టులో బాగా మసాజ్ చేసి కొంత సమయం తర్వాత కడిగేయవచ్చు.
అవిసె గింజలు సహజమైన స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో కూడా ఉంటాయి. జుట్టు,చర్మం ఆరోగ్యంగా కనిపించడానికి సహాయపడతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.