High Blood Pressure: ఉరుకుల పరుగుల జీవితం కారణంగా ప్రస్తుతం జనం వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్న వయస్సులోనే హైబీపీ వంటి సమస్యలను ఎదుర్కుంటున్నారు. ఒకప్పుడు 50 ఏళ్లు ఉన్న వారిలో హైబీపీ సమస్య ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం 20 ఏళ్ల యువకుడు కూడా ఈ సమస్యతో పోరాడుతున్నారు. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ప్రజలు అనేక రకాల మందులను తీసుకుంటారు.మీరు కొన్ని హోం రెమెడీస్ సహాయంతో రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
అధిక రక్తపోటు అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. దీన్ని నియంత్రించడానికి మందులతో పాటు కొన్ని హోం రెమెడీస్ కూడా చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి.
బీపీని తగ్గించేవి ఇవే:
వెల్లుల్లి: వెల్లుల్లిలో అల్లిసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది రక్తనాళాలను సడలించి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. హైబీపీ సమస్యతో ఇబ్బంది పడే వారు కూరగాయలు, పప్పులు, సలాడ్లలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అల్లం: అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇది రక్త నాళాలను విస్తరిస్తుంది. ఫలితంగా రక్తపోటు కూడా తగ్గిస్తుంది. మీరు టీలో అల్లం కలుపుకొని కూడా తినవచ్చు.
దాల్చిన చెక్క: దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది అధిక రక్తపోటుకు కారణమయ్యే రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. మీరు దాల్చిన చెక్కను టీ, కాఫీ లేదా పెరుగులో కలిపి కూడా తినవచ్చు.
పసుపు: పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది వాపును తగ్గిస్తుంది . రక్తపోటును నియంత్రిస్తుంది. మీరు పసుపును మీ కూరగాయలు లేదా పప్పులతో కలపుకుని తినడం ద్వారా కూడా మంచి ఫలితం ఉంటుంది.
ఉల్లిపాయ: ఉల్లిపాయలో క్వెర్సెటిన్ ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు ఉల్లిపాయను పచ్చిగా లేదా ఉడికించి కూడా తినవచ్చు.
Also Read: ఖరీదైన ఫేస్ క్రీములు అవసరమే లేదు, వీటితో మచ్చలేని చర్మం
ఈ పదార్థాలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయని గమనించండి.
అధిక రక్తపోటు మీకు ఉంటే మీరు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.
ఈ పదార్థాలను మీరు తీసుకునేటప్పుడు సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం.